అమ్మా ఇందిరమ్మా…. మా కోసం మళ్ళీ జన్మించి మా చమైక్యతను కాపాడు తల్లీ….!

అమ్మా ఇందిరమ్మా…. మా కోసం మళ్ళీ జన్మించి  మా చమైక్యతను కాపాడు తల్లీ….!

అమ్మా!
ఇందిరమ్మా!

మా తెలుగు తల్లిని కన్న తల్లివి
మా అమ్మవు అమ్మమ్మవు
యావత్‌ తెలుగు జాతికే ఇలవేలుపువు నువ్వే నమ్మా !

1969లో విరుచుకు పడిన ప్రత్యేక తెలంగాణా తుఫాన్‌ను ధీటుగా ఎదుర్కొని
చెన్నారెడ్డి లాంటి మత్తగజాన్ని లొంగదీసుకుని
369 మంది తెలంగాణా యువకుల్ని బలితీసుకుని
మా చమైక్యతను…… మహోన్నత ప్రజాస్వామ్య స్పూర్తిని
కాపాడిన ధీరోదాత్తురాలివమ్మా నువ్వు.

1972లో అంతకంటే పెద్ద ఎత్తున ముంచెత్తిన జై ఆంధ్ర సునామీని కూడా ధీటుగా ఢీకొని
తెలంగాణా ఉద్యమ సమయంలో
”తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది” అన్న
ఎన్‌టిరామారావు సైతం ” రెండుగ వెలుగు జాతి ” అని స్వరం మార్చి పాడినప్పటికీ
వినకుండా దాదాపు 400 మంది సీమాంధ్ర యువతను బలితీసుకుని
మరోసారి మమ్మల్ని చీలిపోకుండా కాపాడిన ఆదిపరాశక్తివమ్మా నువ్వు.

అస్సాంని చీల్చావు,….
చచ్చినా ఒప్పుకోనన్న పంజాబ్‌ను సైతంఅసెంబ్లీని రద్దుచేసి మరీ చీల్చావు…

ఏ ప్రధాన మంత్రీ ఏర్పాటు చేయనన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశావు…. !అయినా ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం ససేమిరా చీల్చనన్నావు

హైదరాబాద్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని
నైజాంనవాబు ఐక్యరాజ్యసమితికి చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో వున్న కారణంగానే
తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించావని గిట్టని వాళ్లు అంటారు,

లేకపోతే అన్ని రాష్ట్రాలను ముక్కలు చెక్కలు చేసిన నువ్వు
మీ నాన్న అయిష్టంగా అతుకుపెట్టిన తెలంగాణాంధ్ర ప్రదేశ్‌ను
దేనికదిగా విడదీస్తే దేశ సమైక్యత దెబ్బతింటుందని ఎలా అనుకుంటావు తల్లీ.

కారణం ఏదైనా మా చమైక్యతను కాపాడిన కల్పతరువువు నువ్వే నువ్వే నువ్వే నమ్మా!

ఇప్పుడు నువ్వు లేవు కాబట్టే
కెసిఆర్‌ అనే ఒక బక్కన్నను, ముక్కు తిమ్మన్నను మేనేజ్‌ చేయడం చేతకాక

పోలీసుల చేత ఉద్యమ కారుల్ని చంపించడం చేతకాక,….
రెండు ఉప్పెనలప్పుడు పోలీసు కాల్పుల్లో చనిపొయిన వారి కంటే అధికంగా
ఓ 1200 మంది తెలంగాణా యువతీ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్న
చిన్న సాకుతో …. ఆంధ్రప్రదేశ్‌ను …తద్వారా యావద్దేశాన్ని…..తద్వారా యావత్‌ ప్రపంచాన్ని …..
ప్రజాస్వామ్య విరోధులు,

రాజ్యాంగ ద్రోహులు ముక్కలు చ్కెలుగా …చెక్క ముక్కలుగా చేయాలనుకుంటున్నారమ్మా

అందుకే
నువ్వే మా కోసం మరో జన్మెత్తి మా చమైక్యతను కాపాడాలి తల్లీ.

కొంపదీసి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో
నైజాం నవాబు దరఖాస్తు కొట్టివేయబడింది కాబట్టి
నువ్వు కూడా తెలంగాణాను
మా కబంధ హస్తాలనుంచి వేరుచేస్తావా?

అంతా నీ దయ – మా ప్రాప్తం తల్లీ..!

Image

Image

Image

Advertisements
This entry was posted in Telangana and tagged , , , , . Bookmark the permalink.

3 Responses to అమ్మా ఇందిరమ్మా…. మా కోసం మళ్ళీ జన్మించి మా చమైక్యతను కాపాడు తల్లీ….!

 1. mandhubabu says:

  మెయిళ్లద్వారా తెలంగాణ ఆకాంక్షనుచాటండి!

  – తెలంగాణ ప్రజాస్వామ్య హక్కు
  – అదే జీఓఎంకు చెప్పండి
  – ఐదు రోజులే గడువు
  – నిర్ణీత ప్రామాణికత ఉంటేనే చెల్లుబాటు
  – అందుకే నెటిజన్ల ఫోరం ప్రత్యేక వెబ్ రూపకల్పన
  తెలంగాణవాదులు, మేధావులు నిర్మాణాత్మకంగా జీఓఎం రూపొందించిన ప్రశ్నావళి ప్రకారం అభిప్రాయాలను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నట్లు వివరించారు.
  http://www.nextgen6.com/gom/

  Plz pass this message to al ur friends and relatives. Support telangana. Jai telangana

 2. surya prakash apkari says:

  ఇందిరా గాంధీ గారు మళ్ళీ పుట్టి వస్తే దేశకాల పరిస్తుతులను అనుసరించి తెలంగాణా విభజనను వేగతరం చేసేది!అప్పుడు చెన్నారెడ్డి ని ఎలాగో ఒకలా మేనేజ్ చేసినట్లు కేసీఆర్ ను మేనేజ్ చేయడం సాధ్యం కాదని వెంటనే చటుక్కున గ్రహించేది! sooner the better!….. అని సోనియా గాంధీ కి ఆర్డర్ లాంటి సలహా ఇచ్చేది!ఇందిర తండ్రి నెహ్రు మళ్ళీ పుట్టినా తెలంగాణా విభజన జరిగేది! కనుక ఈ సంవత్సరం ౯ వ డిసెంబర్ న తప్పక విభజన జరుగబోతున్నది!రెండు రాష్ట్రాలూ ఒకే గవర్నర్ కింద తమ పని తాము చకచకా చేసుకుంటూ సహజీవనం చేస్తాయి!

  • అవునండీ. తెలంగాణావారు కోరుకున్నాక చచ్చినట్లు ఇరుప్రాంతాలవారు సహజీవనం చేయకతప్పుతుందా?
   లేకపోతే తెలంగాణావారికి నష్టం కలగదా? దానికి కేసీఆర్ & శిష్టచతుష్టయం ఒప్పుకోరు కదా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s