మన జుట్టును మనమే ఇతర్లకి అందిస్తాం. ఆ తర్వాత అవమానిస్తున్నారంటూ మనమే అరచి గోలచేస్తాం… మంటగలసిపోతున్న తెలుగుజాతి ఆత్మగౌరవం!

మన జుట్టును మనమే ఇతర్లకి అందిస్తాం. ఆ తర్వాత అవమానిస్తున్నారంటూ మనమే అరచి గోలచేస్తాం… మంటగలసిపోతున్న తెలుగుజాతి ఆత్మగౌరవం!

” ద ప్రాసెస్‌ ఆఫ్‌ ద ఫార్మేషన్‌ ఆఫ్‌ సెపరేట్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణా విల్‌ బి ఇనిషియేటెడ్‌. ఏన్‌ అప్రాప్రియేట్‌ రెజల్యూషన్‌ విల్‌ బి మువ్డ్‌ ఇన్‌ ద స్టేట్‌ అసెంబ్లీ…”
అని చిదంబరం 2009 డిసెంబర్‌లో పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు.

దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
సమైక్యతను నిజంగా కోరుకునేవాళ్లు ఏం చేసి వుండాల్సింది ఈ నాలుగేళ్లలో?

మనం సమైక్యంగా వుందాం… జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుందాం అని తెలంగాణా ప్రజల్ని ఒప్పించి వుండాల్సింది.
రాష్ట్రం సమైక్యంగా వుండాలనుకుంటున్నట్టు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి వుండాల్సింది.

కానీ జరిగిందేమిటి…
”తెలంగాణా ఉద్యమం కొందరు రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం.”
”కుక్కకు బొక్క వేసినట్టు ఒక మంత్రిపదవి పడేస్తే కెసిఆర్‌ ఈ ఉద్యమం లేవదీసేవాడే కాదు.”
”సీమాంధ్ర కంటే తెలంగాణాలోనే అభివృద్ధి ఎక్కువగా జరిగింది.”
”తెలంగాణా వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలు. నీళ్లలో, నిధుల్లో, ఉద్యోగాల్లో వాళ్లకు ఎలాంటి అన్యాయమూ జరుగలేదు.
సమైక్యం వల్ల సీమాంధ్ర కంటే తెలంగాణా వాళ్లే ఎక్కువ బాగుపడ్డారు.”
”తెలంగాణ వాళ్లకి భాషరాదు, నాగరికత తెలియదు. సోమరిపోతులు”
అంటూ తేరగా దొరికిన రంగు డబ్బాల ముందు
తెగ డిస్కషన్లు చేస్తూ కూచున్నారు.

కనీసం అదే చర్చను సాధికారికంగా అసెంబ్లీలో చేయడానికైనా సాహసించలేదు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీలో చర్చ జరపాలని, తీర్మానం పెట్టాలని
అనేకసార్లు అనేక రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది.
అయినా అంతా నిమ్మకు నీరెత్తినట్టున్నారు.

ఇప్పుడేమో కేంద్రం తీర్మానం కోసం ఎప్పుడు బిల్లు పంపిస్తుందా…
ఎప్పుడు దానిని ఓడిస్తామా అని ఎదురు చూస్తున్నారు.
(అధిష్టానం నిర్ణయాన్ని అధిష్టానం మొహం మీద తిప్పి కొట్టగల సత్తా ఎంతమందికి వుందన్నది వేరే విషయం).

అసలు ”తెలంగాణాకు మేం అనుకూలం… మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం” అని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం.
”తెలంగాణా తెచ్చే శక్తి మాకు లేదు. తెలంగాణాను ఆపేశక్తి మాకు లేదు. ఆర్టికిల్‌ 3 ప్రకారం మీరు బిల్లు తెస్తే మాకు సమ్మతమే.
మేం తెలంగాణా ఆకాంక్షని గౌరవిస్తున్నాం” అని ప్రకటించిన వైఎస్‌ఆర్‌ పార్టీ.
అఖిల పక్షంలో అందరిముందూ ఒప్పుకుని ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయిస్తే
ఇంక రాజకీయాలకు,

తెలుగువాడి మాట తప్పని, మడమ తిప్పని తనానికి విలువ ఏముంటుంది?

ఎవరైనా మనల్ని ఎందుకు గౌరవిస్తారు??

తెలంగాణా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఎంతో ప్రయత్నించి విఫలమైన తరువాత…
మీ దుర్మార్గపు రాజకీయ ఎత్తులకు, జిత్తులకు తల్లడిల్లి పోయి దాదాపు 1200 మంది తెలంగాణా యువత తెలంగాణా అకాంక్ష కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత.
నాలుగు నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు అచంచల పట్టుదలతో కదంతొక్కుతున్న ప్రస్తుత దశలో….

ఇప్పుడు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అని,
దానిని ఆపడం అసాధ్యం అని తేటతెల్లమయిన తరువాత కూడా…..
కాస్త హుందాగా ప్రవర్తించాలన్న స్పృహ లేకపోతే ఎవరేం చేయగలరు??

తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం సంగతి అటుంచి

మన హిపోక్రసీని చూసి యావద్దేశం అసహ్యించుకోదా?

స్వార్థ పరులు అలా చేస్తున్నారంటే వాళ్ల బాధని అర్థం చేసుకోవచ్చు
కానీ అన్నీ తెలిసిన చదువుకున్నవాళ్లు, విజ్ఞులు, వివేకులు కూడా

అదే బాటలో ఆలోచించడం నిజంగా మన దౌర్భాగ్యమే.

Image

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

8 Responses to మన జుట్టును మనమే ఇతర్లకి అందిస్తాం. ఆ తర్వాత అవమానిస్తున్నారంటూ మనమే అరచి గోలచేస్తాం… మంటగలసిపోతున్న తెలుగుజాతి ఆత్మగౌరవం!

 1. అన్నీ తెలిసిన చదువుకున్నవాళ్లు, విజ్ఞులు, వివేకులు కూడా
  అదే బాటలో ఆలోచించడం నిజంగా మన దౌర్భాగ్యమే.
  Very Well Said

 2. తెదేపా,వైకాపా యు turn తీసుకొని సీమాంధ్ర ప్రయోజనాలకోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసినా కాంగ్రెస్ మాత్రం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది!ఒక తెలుగు భాషకు రెండురాష్ట్రాలు ఏర్పడుతున్నాయి!రాష్ట్ర విభజనలో పార్లమెంట్ పాత్ర గణనీయంగా ఉంటుంది కనుక కాంగ్రెస్ ఈ బిల్లును తొందరగా పార్లమెంట్ లో పాస్ చేయించడానికి చకచకా పావులు కదుపుతోంది!కిరణ్ లాంటి ముఖ్యమంత్రులను అధిష్టానం ఎందరినో చూసింది!సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమాన్ని పరోక్షంగా నడుపుతున్నది కిరణ్ అని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు!రాష్ట్రపతి పాలన బూచితో కిరణ్ ను నియంత్రించి అతని ద్వారా మెల్ల మెల్లగా సమ్మె విరమి౦పజేస్తోంది!విభిన్న ప్రకటనలు చేయించి సీమాంధ్ర నాయకులను confuse చేసి చాప కింద నీరులా ప్రక్రియను వ్యూహాత్మకంగా వేగంగా కదలుతున్నది!తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఇక ఖాయం!

 3. chandu says:

  telugu jathi anna concept thappu ….mana basha telugu mana jathi bharatha jathi

  • J T Bandagi says:

   చందు గారూ
   నిజమే .
   తెలుగు జాతి, హిందీ జాతి, ఉర్దూ జాతి అని జాతులేమీ ఉండవు.
   అయితే వాళ్ళ కోణం లోంచి రాయడం వల్ల ఆ పదం పడిపోయింది.

 4. బందగీ గారూ నమస్కారం!
  మీరు రాసే రాతలతోనైనా ఈ సీమాంధ్ర వాళ్ళు కుహనా పెద్దమనుషుల కబంధ హస్తాల్లోంచి బయట పడతారంటారా?
  మంచి చెబితే, చెవికెక్కని వాళ్ళకు ఎవరు చెప్పినా ఫలితం శూన్యం. అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా! మీ పూనిక వ్యర్థం కాదు. తప్పక ఫలితం ఉంటుందని నా ఆశంస. అభినందనలతో…….

  “నా తెలంగాణ కోటి రత్నాల వీణ”

  • J T Bandagi says:

   గుండు మధుసూధన్ గారూ
   నమస్కారం.
   మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
   పట్టుమని పది వందల మందికి కూడా చేరని ఈ బ్లాగు రాతలతో ఎదో సిధ్ధిస్తుందన్న ఆశ ఏమీ లేదు.
   కానీ దుర్మార్గపు , నీతి మాలిన రాజకీయాల వల్ల
   ఆశోపహతులై పిట్టల్లా రాలిపోయిన మన తెలంగాణా
   అమాయక యువతరాన్ని తలచుకుంటె కలిగే బాధకు ఔట్ లెట్ గా
   ఈ రాతలు.
   ఈ ఉడతాభక్తి సెవ ఒక్కరిని కదిలించినా/ ఆలొచిప జేసినా సంతోషమే కదా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s