”కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ” అయినట్టు… కొద్ది మంది బడాబాబుల బాధ మొత్తం సీమాంధ్ర ప్రజల బాధ అయిపోయింది.

ఇంకెన్నాళ్ళు ???????????

Inkennaallu 2

”కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ…
ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ …” అన్నడు చలం, ‘మహాప్రస్థానం’ ముందు మాటలో.

గట్లనే ఇప్పుడు కొద్ది మంది పెట్టుబడిదార్ల, కాంట్రాక్టర్ల, కబ్జాకోర్ల, అక్రమార్కుల బాధ –

మొత్తం సీమాంధ్ర ప్రజల బాధ అయిపోయినట్టు గొడ్తాంది. గా చాల్బాజ్‌ గాండ్లు తమ రోగాన్ని అందరికి అంటించి గత్తర లేపుతున్నరు.

ఆంధ్ర నుంచి తెలంగాణ డీమెర్జ్‌ అయితె – తమ అక్రమాలన్ని ఎక్కడ బయటపడ్తయో, తమ అధికారం ఎక్కడ మంట్లె కలిసిపోతదో అని వాళ్ల లాగులు తడుస్తుండొచ్చుగని … సీమాంధ్రల వున్న ఉద్యోగులు, కరంటోళ్లు , కార్మికులు, కర్షకులు, రైతుకూలీలు, విద్యార్థులు, రెక్కాడితె గని డొక్కాడనోళ్లు, బీదోళ్లు, ఆఖరికి బిచ్చగాళ్లు సుత ఏదో కొంపలు మునుగుతున్నట్టు గిట్ల గాయి గాయి చేసుడేందో ఏం సమజయితలేదు.

ప్రపంచపు బాధంతా తన బాధగా చేసుకున్న శ్రీశ్రీ అసొంటోళ్లు
జెర మంచీ చెడు, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం ఆలోచించె మనసున్నోళ్లు మచ్చుకైనా లేరా సీమాంధ్రల.

అంత గలిసి తెలంగాణాను ఎన్నాళ్లు దోచుకతిందామనుకుంటున్నరు?
తెలంగాణల బాంచెపు నాయకులు ఉన్నప్పుడంటే మీరు ఆడింది ఆటయింది, పాడింది పాటయింది.
”మీకు ఒక్క రూపాయి గూడ ఇయ్య … ఏం పీక్కుంటరో పీక్కోండ్లి” అని ఇంకా  మీసాలు మెలేస్తనంటె నడుస్తదా?

ఇప్పుడు తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని, మీ నేతల కపట నాటకాలని, నయవంచనని, నక్క జిత్తులను అన్ని గ్రహించింది. మస్తు అర్థం చేసుకున్నది.

అయినా తెలంగాణ ఏం అడుగుతుందిర భయ్‌?

మా బతుకు మేం బతుకుతం అంటాంది.

1956 కు ముంధున్నట్టు మీ జాగల మీరు ఉండండిర భయ్‌ అంటున్నది.

మా నీళ్లు మాగ్గావాలంటున్నది, మా నిధులు మాకు గావాలంటున్నది, మా ఉద్యోగాలు మాకు గావాలంటున్నది. మా సెక్రటేరియట్‌ మాకు గావాలంటున్నది. గంతే గద?!

అండ్ల ఏమన్న అన్యాయం ఉన్నదా? అధర్మం ఉన్నదా??

హైదరాబాద్‌ల మీరు పెట్టిన పెట్టుబడులంటరా… మీ లెక్క వాటిని ఇక్కడ ఎవ్వడు కబ్జ చెయ్యడు. మీయి మీకే వుంటయి. మీ ఆస్తులు చెన్నయ్‌ల లేవా, బెంగళూరుల లేవా? డల్లస్‌ల లేవా? ఎన్ని రాష్ట్రాలల్ల మీరు యాపారాలు చేస్తలేరు? ఓ మిమ్మల్ని కట్టుబట్టలతోని ఎవడో పొమ్మన్నట్టు గాయి గాయి చేస్తున్నరు . ఏమొ ….. కతలు పడ్తున్నరు.

ఎన్నేళ్ల సందో పోరంగ పోరంగ, పన్నెండు వందలమంది పోరళ్లు ఆత్మబలిదానాలు చేసుకోంగ ఆఖరికి కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రకటిస్తే మీరు గింత జిద్దు చేసుడేమన్న న్యాయమేనా?

జెర్రంత ఆలోచించుండ్రి.

మీరు …. నాలకేసి బగ్గ రాక్కున్నా తెలంగాణా ప్రజలు ఒప్పుకోకుండా

ఇగ సమైక్యత సాద్యంకాదంటె కాదు.

అనవసరంగ, అన్యాలంగ అమాయకులను ఎందుకురా హరగోసపెడ్తరు?

 

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

4 Responses to ”కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ” అయినట్టు… కొద్ది మంది బడాబాబుల బాధ మొత్తం సీమాంధ్ర ప్రజల బాధ అయిపోయింది.

  1. chandu says:

    anna eddoniki eddi bashalane artham ayeethadhi anna ..gitla chepithe artham kadu

  2. viru says:

    మాకు తెలంగాణా గురుంచి బాధ కాదు, అక్రమంగా దోచుకున్న రామోజీ ఫిలింసిటీ, లాగడ పాటి లాంకో హిల్స్, రింగ్ రోడ్ చుట్టూ మేము దోచుకున్న పొలాలు, మీరు హైదరాబాద్ మాకు వదిలిపెట్టి, ఇంకో రాజదానిని వరంగల్ లో నిర్మించుకొండి మాకు ఏమి అభ్యంతరం లేదు.

  3. King says:

    Avunu correct ga cheppav… rajakeeyanke jarigina vidbhajana nirnayaniki samanja jenalu enduku avasta padallo artham kaadu.. chandra baabu evarikosam deni kosam deek shal chestunando.. janga kooda enduku deek shal chestunando naaku arthamkadu.. valla kevarian ahceppandayya.. ala vadileyyakandi… mothaniki edo okati telchandi.. seeam dhya vadini ayina ee seemandhra nayakulu chese panikimalina rajakeeyalu doku teppistunnayi.. i support bifurcation of telangana.

  4. తెలంగాణా రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు పొయ్యేదేమీ లేదు!సీమాంధ్ర కబ్జాకోర్లు,దోపిడీ చేసే పెట్టుబడి దార్లు పనికట్టుకొని చేయిస్తున్న కుహనా,కృత్రిమ,అసహజ,అన్యాయపు ఉత్తుత్తి ఉద్యమం!మొత్తం ప్రపంచంలో వేరేవాళ్ళ భౌగోళిక ప్రాంతం మీదకూడా మాకు హక్కులు కావాలని వెనకనుండి ముఖ్యమంత్రి నల్లారి,మరికొంతమంది పెట్టుబడిదారులు వ్యక్తిగత స్వార్థంతో తెలంగాణా వనరులను ఎల్లప్పుడు కొల్లగొట్టాలనే కుత్సితపు బుద్ధితో దన్నుగా ఉంది చేయిస్తున్న నాటకీయ ఉద్యమం!ఇది ఎన్నిరోజులు ఎంత ధాటిగా ఎంత పకడ్బందీగా చేయించినా చివరకు నీరుగారి విఫలమయ్యే ఉద్యమం!తెలంగాణా ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతుంటే దానిని ఆపడం ఎవ్వడి తాత తరం కాదు! ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s