రామాయణమంత విన్నాక రాముడికి సీత ఏమవుతుంది? అని అనుమానం వచ్చినట్టు ఇన్ని ఉద్యమాలు జరిగాక ఇప్పుడు ”సమైక్యత” అంటే ఏమిటి? ”జై సమైక్యాంధ్ర” అంటే అర్థమేంటి అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి!

‘రాముడికి సీత ఏమవుతుంది?’ అనే పేరుతో ఆరుద్ర ఓ పుస్తకం రాశారు.

ఒక్క వాల్మీకి రామాయణమే కాకుండా ప్రపంచంలో ఇంకా అనేక రామాయణాలున్నాయని ఆయన సోదాహరణగా వివరించారు. అలాంటి ఒక రామాయణంలో రాముడికి సీత చెల్లెలైతే, మరొక రామాయణంలో సీత రాముడికి కూతురని చెప్పుకొచ్చారు. ఆనాటి సాహిత్యం మౌఖికమైనది కావడం వల్లా, అనేక ప్రక్షిప్తాల వల్లా ఎల్లలు దాటినా కొద్దీ కథ రకరకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చింది.

ఇది అలా పక్కన పెడితే…

ఇప్పుడు ఇన్నాళ్ల ఉద్యమాలను చూసిన తరువాత ” రాముడు- సీత ” విషయంలో లాగే

అసలు సమైక్యత అంటే ఏమిటి? జై సమైక్యాంధ్ర అంటే అర్థమేమిటి? ఎవరిది నిజమైన నిస్వార్థమైన నికార్సయిన సమైక్యవాదం? ఒక పార్టీకి చెందిన సమైక్యవాది ఇంకో పార్టీకి చెందిన సమైక్యవాదిని ఎందుకు అనుమానిస్తున్నాడు?

ఎందుకు వాళ్లు ఆగర్భ శత్రువుల్లా ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు? అసలు ఏం జరిగింది?
ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది?

ఎవరితో ఎవరు సమైక్యంగా వుండాలనుకుంటున్నారు? ఎవర్ని ఎవరు దుంపనాశనం చేయాలనుకుంటున్నారు? భారత చిత్రపటంలో రెండు భూభాగాలను కలిపి చిత్రించడమేనా సమైక్యత అంటే? ఆ చిత్రపటంలో రెండు రాష్ట్రాలను వేరువేరుగా చిత్రించినంత మాత్రాన అక్కడి ఇక్కడి ప్రజలు ఆగర్భ శత్రువుల్లా మారిపోతారా? భూమి బద్దలవుతుందా?

మరి సమైక్యాంధ్ర అని నినదించేవాళ్లే సమైక్యంగా వుండటంలేదే? ఒక్క ప్రాంతంలో ఒకే నినాదం ఉచ్ఛరించేవాళ్లే తన్నుకుంటున్నారే? మరి వేరే ప్రాంతం వాళ్లతో సఖ్యంగా ఎలా వుండగలుగుతారు?

సమైక్యత అంటే తెలంగాణా మీద సీమాంధ్ర పెత్తనం మూడు పూవులు ఆరు కాయలుగా సాగడమేనా?

తెలంగాణా ప్రజల ఇష్టా అయిష్టాలతో నిమిత్తంలేదా?

తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ,శాశ్వతంగా  వారిని సమైక్య పాలన కింద పడివుండేలా చేయడం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యమేనా?

ఒకప్పుడు 1956 కంటే ముందు ఆంధ్ర- తెలంగాణా (హైదరాబాదు అనాలేమొ) రాష్ట్రాలు వేరువేరుగా వుండలేదా? ఇప్పుడెందుకు వుండలేవు.

ఒక తెలుగు వాడు పోయి కోట్లు వెచ్చించి బెంగుళూరులో నిజాం పాలెస్‌ లాంటి భవనాలు నిర్మించుకోలేదా? వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టలేదా? హైదరాబాద్‌లో పెట్టిన పెట్టుబడులు ఎక్కడికి పోతాయి?

రాష్ట్ర విభజన అంటే దేశ విభజన కాదు కదా?

రాజాజీ రాజకీయ నాయకులను మద్రాసు నుంచి మెడబట్టి గెంటేశాడు తప్ప ఇతర ఆంధ్రులనెవర్నీ ఏమీ అనలేదు కదా.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ల తరువాత కూడా అక్కడ లక్షల సంఖ్యలో ఆంధ్రులు శుభ్రంగా వుండటంలేదా?

ఇప్పుడు ఇక్కడే ఏం కొంపలంటుకుంటాయి?

మొన్నటి వరకూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ పార్టీ తెలంగాణాకు అనుకూలమనే చెప్పాయి కదా? కాంగ్రెస్‌ కూడా తెలంగాణా ఇస్తాననే హామీతోనే టిఆర్‌ఎస్‌తో పెట్టుకుని ఒకసారి, పెట్టుకోకుండా అనేకసార్లు తెలంగాణాపై వాగ్దానాలు చేసింది కదా.?

ఇన్నాళ్లకి ఇంత ఆలస్యంగా అందరు ఆమొదించిన నిర్ణయానికి ఓకే చెప్పగానే ఈ యూటర్నులేమిటి? ఈ ఉద్యమ టర్నులేమిటి? ఈ దీక్షా టర్నులేమిటి?

యావద్దేశం తెలంగాణాపై నిర్ణయం తీసుకుందని అది తిరుగులేని నిర్ణయమని తెలిసి కూడా ఇంకా ఈ గొడవలెందుకు?

వీటి వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అదేదో సినిమాలో ”కుక్క కావాలి… కుక్క కావాలి” అని ఒక పిల్లవాడు మంకు పట్టు పట్టినట్టు విజ్ఞులైనవాళ్లు, అన్నీ తెలిసినవాళ్లు కూడా ఉద్దేశపూర్వకంగా మొండిగా మారాం చేయడం మంచిదేనా?

ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు….

వీటికి సమాధానాలు చెప్పే మేధావులే లేరా?

మొన్నటి వరకు ఆంధ్రా వాళ్లను ఉత్తరాదిన ”మద్రాసీలు” అనే పరిగణించేవారు.

ఇక ఇప్పటి నుంచీ ఏమని ….. సంబోధిస్తారో!!

Image

Emira Balaraju

Advertisements
This entry was posted in Telangana and tagged , , . Bookmark the permalink.

8 Responses to రామాయణమంత విన్నాక రాముడికి సీత ఏమవుతుంది? అని అనుమానం వచ్చినట్టు ఇన్ని ఉద్యమాలు జరిగాక ఇప్పుడు ”సమైక్యత” అంటే ఏమిటి? ”జై సమైక్యాంధ్ర” అంటే అర్థమేంటి అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి!

 1. chandu says:

  androlla thalkayalo medadu u vunte ginthaa radantham endhuku bayya

 2. సీమాంధ్రులు ఎన్ని అడ్డంకులు పెట్టినా, వాళ్ళ దూకుడు, దుర్మార్గ వర్తనాలు తెలిసిన కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా విశ్రమించదు గాక విశ్రమించదు! ఇకనైనా ఈ సీమాంధ్రులు ఎడ్డెం అంటే తెడ్డెం అనటం మాని, విడిపోవడం వల్ల ఖచ్చితమైన సమస్యలేమున్నాయో చర్చించుకోవటం ఉత్తమం. దొంగ ఉద్యమాలాపి, సమస్యా పరిష్కారానికి సిద్ధపడితే మంచిది. లేకుంటే నష్టపోయేది వాళ్ళే మరి!

  నీటి పాట్లను ట్రిబ్యునల్ తేఁట పఱచు!
  మఱియు నుద్యోగులకు నియమావళి యిట
  నుండెను! నుపాధి కొఱ కే జనుండు నైన
  నెచటికైనను బోయి యుండినను నెవరు
  నీ ప్రజాస్వామ్య దేశాన నెటుల నాపు
  దురు? కనుక, నివియ వితండ దుర్మదాంధ
  దర్పిత వచనమ్ములు! కాన, తగ్గుమనుచు
  నిచటి తెలగాణ జనులు ఖండించుచుండ్రి!

  జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

  -నా తెలంగాణ కోటి రత్నాల వీణ (ratnaalaveena.blogspot.com)

 3. A consequence of coming to believe in
  1. Self Righteousness rooted in intellectual arrogance
  2. Publicity and Power achieved through GOEBBELS Propaganda
  3. Prosperity achieved through immoral and some illegal practices..
  The kick of this cocktail is not ready to face the “Satyameva Jayate”
  Perhaps will not be surprised if some of them face the Final fate of Hitler and GOEBBELS..if not mended their ways..

 4. Goutham says:

  మొన్నటి వరకు ఆంధ్రా వాళ్లను ఉత్తరాదిన ”మద్రాసీలు” అనే పరిగణించేవారు.
  ఇక ఇప్పటి నుంచీ ఏమని ….. సంబోధిస్తారో!!
  …………………………..
  “బద్మాష్ లోగ్”

 5. mandhubabu says:

  Ajakarulu, paranna jeevulu, mosagallu, dhopidi dhaarulu, nalli kutlollu,

  ani mathramu andhrollani piluvakandi. already vallu ave kadhaaa

 6. surya prakash apkari says:

  సమైక్యాంధ్ర ఉద్యమమంటే హైదరాబాద్లో భాగం కోసం ఉద్యమం!తెలంగాణా ఆగేది కాదు!ఎదుటివాడి గుండెకాయను కాజేయాలని చూడటం వాడిని పట్టపగలు హత్య చేయడం తో సమానం!సమైక్యాంధ్ర ఉద్యమం మింత వెలుగుతున్న చంద్రుని తెచ్సివ్వమని పసిపిల్లవాడు మారాం చేస్తూ ఏడుస్తున్నట్లు ఉంది!

 7. King says:

  Samaikyandhara untundani evariki kalalu levu kaani..
  samikyandhya undyamam antha dabbulu asstulu ela ollu kundamane badha.. Iam from Anantapur but what is the problem if state is bifurcated? it is the governments mistake to concentrate all development in one city. all areas in country should be developed.. Ippudu udyamalu chesi emi prayojanam.. comman man batuku durbharam avvadam tappa.. politicians happy gane untaaru vallu tindi neelu current anni dorkutaayi.. aa pandayya ee samaiykyandhara udyaman aapandi…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s