నిన్నటి వరకు:”తెలంగాణా వస్తుందంటారా?” ఇవాళ్టి నుంచి: ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమేనంటారా?

నిన్నటి వరకు:”తెలంగాణా వస్తుందంటారా?” ఇవాళ్టి నుంచి: ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమేనంటారా?

ఓడలు బళ్లవుతాయి…
బళ్లు ఓడలవుతాయి… అంటే ఇదే మరి!

నిన్నటి వరకు ”తెలంగాణా వస్తుందంటారా” అన్న ప్రశ్న వినిపించేంది.
అంతకంటే గట్టిగా ”రాదు గాక రాదు” అన్న సమాధానం ప్రతిధ్వనించేది.

కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమవుతుందంటారా, మంత్రివర్గ తీర్మానం వెనక్కిపోతుందంటారా?”
అన్న ప్రశ్నలు … వాటితోపాటు ”అబ్బే అది జరుగనిపని” అన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.

ఎంత మార్పు!
ఒక్కసారిగా పరిస్థితి ఇలా ఎలా మారిపోయింది?

గాంధీలేని మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా 60 రోజులు అంగరంగ వైభోగంగా, నభూతో నభవిష్యతి అన్న చందాన జరిగిన సకల సీమాంధ్ర జనుల సమ్మె ఇలా ఎలా నిష్ఫలమయింది?

ఆరుకోట్ల మందిని కాదని నాలుగు కోట్లమందిని…
175 మంది ఎంఎల్‌ఎలను కాదని 119 మంది ఎంఎల్‌ఎలని…
మెజారిటీని కాదని మైనారిటీని విజయం ఎలా వరించింది?
అసంభవం అనుకున్నది సంభవమెట్లయింది?

హైదరాబాద్‌ అసెంబ్లీ తీర్మానం లేపోయినా, మొదటి ఎస్‌ఆర్‌సి తక్షణ విలీనాన్ని వ్యతిరేకించినా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపేవిధంగా నెహ్రూ అంతటివాణ్ని ఒప్పించిన సీమాంధ్ర లాబీయింగ్‌ మాస్టర్లు ఇప్పుడెందుకు విఫలురయ్యారు?

పది ఛానళ్లు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ని తలదన్నే విధంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చిత్రించి 24 గంటలు ప్రసారం చేసినా, పది పత్రికలు తెలంగాణ వార్తల్ని తొక్కిపెట్టి మొత్తం పేపర్‌నిండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వేనోళ్ల కీర్తించినా నిష్‌ప్రయోజనమెందుకయింది?

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?
బలవంతులు దుర్బల జాతిని బానిసల గావించారు అందురు గానీ
దుర్బలురైన తెలంగాణా వారు బలవంతులైన సీమాంధ్రులను ఎలా పరాజితుల్ని చేయగలిగారు?

”సిడబ్ల్యుసి తీర్మానం శిలాశాసనం కాద”న్న సింహగర్జనలేమైపోయాయి?

టీడీపీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చి వుండవచ్చు
కానీ ఇప్పుడు సమైక్యాంధ్రకోసం భాహాటంగా పార్లమెంటులో పోరాడుతోంది కదా…
వైఎస్‌ఆర్‌పార్టీ సమన్యాయం పాటించి తెలంగాణా విభజించవచ్చని చెప్పినా

ఆ తరువాత సమైక్యాంధ్ర తప్ప మరొకటి వద్దని స్పష్టంగా ప్రకటించి రంగంలో దిగింది కదా…
తెలంగాణాపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి వుంటాం అని ప్రకటించిన సిఎం సైతం సమైక్యాంధ్ర తిరుగుబాటు జెండాను ఎగరేశాడు కదా..
ఇంత మంది యు టర్న్‌ తీసుకున్నా అధిష్టానం ఎందుకు యూ టర్న్‌ తీసుకోకుండా ముందుకే వెళ్లింది?

మెజారిటీ సీమాంధ్ర ప్రజల్ని కాదని మైనారిటీ తెలంగాణా ప్రజల పక్షం ఎందుకు వహించింది??
ఎందుకు? ఎందుకు?? ఎందుకు???

ఎందుకంటే ఇంకా న్యాయం ఒక్కపాదంతోనైనా నడుస్తోంది కాబట్టి!
మన దేశంలో ధర్మం ఇంకా కొన ఊపిరితోనైనా బతికివుంది కాబట్టి!!

కాదంటారా?

Image

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

15 Responses to నిన్నటి వరకు:”తెలంగాణా వస్తుందంటారా?” ఇవాళ్టి నుంచి: ”సమైక్యాంధ్ర మళ్లీ సాధ్యమేనంటారా?

 1. chandu says:

  kCR eppdu okkati chepthu vunnadu ” dharmame chivari ki vijayam sadisthundhi” . adhe jarigindhi

 2. ధర్మ మేవ జయతే! న్యాయ మేవ జయతే!!
  ధర్మం, న్యాయం మన పక్షాన వున్నాయి కాబట్టే సీమాంధ్రు లెన్ని దగుల్బాజీ వేషాలేసినా కేంద్రం పట్టించుకోలేదు! ముఖ్యమంత్రి బఫూన్ వేషాలు కేంద్రం దగ్గర సాగలేదు! కేంద్రానికి తెలుసు అమాయకు లెవరో, దోపిడీదారు లెవరో! అందుకే తెలంగాణా ప్రథమ విజయం సాధించింది. సీమాంధ్ర లాబీయింగ్ ప్రమాదకరమైంది! తస్మాత్ జాగ్రత…జాగ్రత!!

  కేంద్ర ప్రకటన మాత్రాన గృహము నలికి,
  పండుగను జేసికొనఁగాను వలదటంచు,
  మనసు బోధించు చున్నది; మన స్వరాష్ట్ర
  మేర్పడెడు దాఁక నిత్యము హితముఁ గోరి,
  యెదిరి కదలికల్ తెలివితో నెఱుఁగ వలయు;
  దానఁ దెలగాణ రాష్ట్రావతరణ మగును!!

  -నా తెలంగాణ కోటి రత్నాల వీణ
  (ratnaalaveena.blogspot.com)

 3. bollibabu says:

  excellent post sir… keep it up.

  entha kammaga chepparu sir.

 4. aditya says:

  భయ్యా
  మీ ఆశయం నెరవేరినందుకు శుభాకాంక్షలు. కాని ఇదంతా బలి ఇచ్చె ముందు మేకని మేపుతున్నట్లు నా కనిపిస్తుంది. ఇదేదో నేను ఈర్షయతో అనట్లేదు.
  కాంగ్రెస్స్ పార్టీని నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈదినట్లే. తొందరగా టి బిల్లు పాస్ అయ్యి విడిపోవాలని కోరుకుంటు.

  తోటి భారతీయుడు.

  • J T Bandagi says:

   ఆదిత్యా జీ
   నిజమే
   ఇవాళ ఏ పార్టీనీ నమ్మేటట్టు లేదు.
   ఏ నాయకుడినీ నమ్మేటట్టు లేదు.
   తెలంగాణ అల్ప సంతోషి కాబట్టి అమాయకంగా అనిపిస్తుందేమొ కానీ
   ఎప్పుడూ తన పోరాటాన్ని మాత్రమే నమ్ముకుంటుంది.
   కాబట్టి దేనికైనా సిధ్ధమే తను.
   >>>> ” కాని ఇదంతా బలి ఇచ్చె ముందు మేకని మేపుతున్నట్లు నా కనిపిస్తుంది. ఇదేదో నేను ఈర్షయతో అనట్లేదు.” <<<<
   ఇప్పుడు అంత భయం, అనుమానం అవసరం లేదు.

 5. emmellen says:

  mee kharma anukovadam tappa emee cheyyalemu….

 6. Atal says:

  Guys, if Telangana is formed without constitutional amendment, then 371D will be only applicable for AndhraPradesh and not to Telangana. Once you are out of 371D all jobs will be open for entire India. All seats in colleges too. And if for govt jobs there is condition of telugu then all andhra people will be eligible for your jobs. So i am sorry to say more andhrites will get jobs in new Telangana. And all illegal employees might be legal if telangana is out of 371D.

  I dont hold any interest/property/grudge on hyderabad. But just want to clarify the thing. you have to consult/convince seemandra, else only you will be out of 371D. means T-Guy cant get govt job in seemandra and All other can get jobs in Hyderabad…

  • Viswaroop says:

   Don’t worry, once Telangana state is formed, only Telangana residents are eligible for jobs and colleges. No more back door entry for Andhraites through illegal means.

  • J T Bandagi says:

   అటల్జీ
   సమైక్య రాష్ట్రం తో పాటు 371 డి కూడా ఆటోమేటిక్ గా కాల గర్భం లో కలసిపోతుంది.
   ఏం భయపడకండి
   ఎవర్నీ భయపెట్టే ప్రయత్నం చేయకండి.

 7. King says:

  telangana tondaragaa icheste happy ye kada..
  .. ee udyamalu deekshalu tokka gaddi anni enduku..
  oorike samanya janalamaina maa meede antha pratapalu..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s