పూల మొక్కలు విడిపోదామంటున్నయ్‌…! కలుపు మొక్కలు కలిసుందామంటున్నయ్‌…!!

పూల మొక్కలు విడిపోదామంటున్నయ్‌…! కలుపు మొక్కలు కలిసుందామంటున్నయ్‌…!!

అది యొక ఉద్యానవనము.
అందు అనేక పూల మొక్కలున్నవి.
ఎందరో తోటమాలులు కూడా వున్నారు.
కానీ వారు స్వార్థపరులు, సోమరిపోతులు.
పూలమొక్కల సంరక్షణను పట్టించుకొనెడివారుకాదు.

అయినను ఆ పూలమొక్కలు
తమ అస్తిత్వమును కాపాడుకొనుచు ప్రకృతిని శోభిల్లజేయుచుండెడివి.
ఇది ఇటులుండ
ఆ వనములోకి కొన్ని కలుపు మొక్కలు వలస వచ్చినవి.

“మీరూ మొక్కలే…
మేమూ మొక్కలమే…
మన దంతా ఒకే జాతి
మన దంతా ఒకే భాష
మన మంతా కలిసుందాం
కలిసి వుంటే కలదు సుఖం
విడిగా వుంటే అంతా దుఖం”

అంటూ సమైక్య గీతాలాలపించి,
సవాలక్ష వాగ్దానములతో మైమరపించి,
అరచేతిలో వైకుంఠము చూపించి
ఆ వనమునందు తిష్టవేసినవి.

కాలక్రమమున
ఆ కలుపు మొక్కలు వనమెల్లా విస్తరించినవి.
ఇప్పుడు ఆ వనములో పూల మొక్కల జాడ కనిపించనంతగా
కలుపు మొక్కలు తాడిచెట్టంత ఎత్తున ఏపుగా పెరిగినవి.

ఆ పూలమొక్కలకు ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అయ్యే దుర్భరస్థితి ఏర్పడినది.
అందువలన
” మీతో మేం కలిసుండలేం మనం విడిపోతాం
మీ మానాన మీరు బతకండి
మా మానాన మేము బతుకుతాం ” అనడం మొదలుపెట్టినవి.

కలుపు మొక్కలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నవి.
విభజన వద్దు సమైక్యత ముద్దు అని రణన్నినాదాలు చేస్తున్నవి.

“మేము రాకముందు ఈ వనము ఎట్లుండెడిది
నీరు పోసే నాధుడు లేక ఎండిపోయినట్టుండెది కదా.
మేము వచ్చిన తరువాతనే ….
మేము ఏపుగా పెరిగిన తరువాతనే…
మేమంతా తెగ బలిసిన తరువాతనే ….
ఈ వనం నేడు పచ్చదనముతో కళకళ లాడుతున్నది.
ఇప్పుడు మమ్ము ఈ అభివృద్ధి చెందిన వనమును వదలి వెళ్లిపొమ్మనుట
జాగో భాగో అనుట దుర్మార్గము కదా ” అంటున్నవి.

“విడిపోవాలని మీకు అంత ఉబలాటముగా వున్న యెడల
ఈ వనమును మాకు వదిలి…

మీరే మరొక వనమును చూసుకొనుడు ” అని ఘీంకరిస్తున్నవి.

మానవత్వమున్న మేధావులారా!
ధర్మాధర్మ విచక్షణ వున్న మానవులారా!!
ఎవరిది న్యాయమో తీర్పు మీరే చెప్పుడి.

(డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌ గారు రాసిన కవిత స్ఫూర్తితో)

Image

Advertisements
This entry was posted in Telangana and tagged , , , . Bookmark the permalink.

14 Responses to పూల మొక్కలు విడిపోదామంటున్నయ్‌…! కలుపు మొక్కలు కలిసుందామంటున్నయ్‌…!!

 1. chandu says:

  entha goppaga raasaru hats off !

 2. babu says:

  chaala baaga chepparandi. excelelnt.

 3. venkatesh says:

  ఇవాళ అనంతపురం ఎంపీ వెంకట్రామి రెడ్డి ఒకే ఒక్క సూటి ప్రశ్న అడిగాడు. 1959 లో ఖమ్మంలో కలిసిన భధ్రాచలం మీద మీకు హక్కు ఉంటే అంతకు పూర్వమే 1956 లో కలిసిన మాకు హైద్రాబాదుపై హక్కు లేదా? అని… తెలంగాణ వాదులూ ఈ ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉందా? ఉంటే చెప్పండి.

  • J T Bandagi says:

   @ Venkatesh
   మెజారిటీ తెలంగాణ ప్రజలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విలీనాన్ని రద్దు చేయాలని (డీమెర్జర్) కోరుకుంటున్నారు.
   వారి నిర్విరామ పోరాటం నేడో రేపో సాకారం కాబోతున్నది.
   అట్లాగే మెజారిటీ భద్రాచలం ప్రజలు గనక ఖమ్మం తో డీమెర్జ్ అయి
   తూర్పు గోదావరి జిల్లాతో తిరిగి కలసిపోవాలని కోరుకుంటె
   దానిని ఏ తెలంగాణావాదీ అడ్డుకోలేడు.
   ముందు అక్కడి ప్రజలకు ఏది సౌలభ్యమో అడిగండి.

   • తూగో జిల్లాతో తిరిగి కలవడానికి భద్రాచలం ప్రజలు కోరుకుంటే ఎవరూ అడ్డు పడరు. శాసనసభ్యులు కుంజా సత్యవతి గారు తాము తెలంగాణాలోనే ఉండాలని కోరిన విషయం అనంత వెంకట్రాం రెడ్డి గారికి తెలిసంట్లు లేదు మరి.

 4. Hari says:

  mari majority hyderabadilamu(nenu puttindi perigindi hyderabad lone), Hyderabad ni NCR tarahaalo, capital region ga cheyaalanu korutunnaamu, mari hyderabad lo unna majority muslim kuda ade koruchunnaaru, mari mee siddaantaala prakaaram maa hyderabad lo nundi mee Telangana vaallu Seemandhra vaallu vellipovaaali, mari siddhamena?
  P.S: samaadhaanam leka pothe anni bokkalu musukoni kuchondi anthegaani, topic divert chesi answer ni daata veyaddu, majority siddhaanthaam prakaareme maatlaade vaallaku aahvaanam.

  • J T Bandagi says:

   హరి గారూ
   ఈ కొత్త ఫిటింగ్ ఏమిటి ?
   హైదరాబాదే తెలంగాణ …
   తెలంగాణే హైదరాబాద్ !
   1956 లో ఆంద్ర రాష్ట్రంలో ఏ హైదరాబాద్ రాష్ట్ర ప్రాంతం మెర్జ్ అయిందో అది ఇప్పుడు డీమెర్జ్
   అవుతోంది . అంతే !
   ఏ శకుని పాచికలూ ఇక పనిచేయవు.
   కలుపు మొక్కలు చేసిన విధ్వంసం చాలు!

  • chandu says:

   muslims NCR tharahaa system nu korukuntunnara adhi correct kadu …Andhra jyothi survey chudandai http://www.youtube.com/watch?v=Pvv4hlQOWfY … 1956 lo ilage matladi vundi vunte bagundu brother lopali vache dhakaa okaa la matladi vachinaa tharuvathaa ippudu mataldam thagadu

  • chandu says:

   hyderabad lo vunna majority shasana sabuulu telangana ku anukulam gane vunna vishayam neeku teliyadaa

  • shayi says:

   తెలంగాణ కాని.. భద్రాచలం కాని…. మెర్జ్ అయినవి తిరిగి డీమెర్జ్ అవడానికి ఆ ప్రాంతాల మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం అన్నాం!
   కాని హైదరాబాద్ మెర్జ్ కాక ముందు తెలంగాణలోనే ఉంది. మెర్జ్ అయినాక కూడ తెలంగాణలోనే ఉంది. ఇక అక్కడ డీమెర్జ్ అవడానికి ఏముంది?
   ఈ ఇంగిత జ్ఞానం లేకుండా తెగ ఆవేశపడడం దేనికి నాయనా?
   అయినా మీలాంటి వాళ్ళ సందేహం తీర్చడానికి మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (నమస్తే తెలంగాణ కాదు….) ఆ సర్వే కూడ చేయించి ముచ్చట తీర్చుకొన్నాడు. హైదరాబాదులో మూడింట రెండొంతుల జనం హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉండాలని కోరుకొన్నారు. వెళ్ళి ఆంధ్రజ్యోతి పేపర్లు వెదుక్కొని చదువుకో….

  • shayi says:

   మిష్టర్ హరి!
   తెలంగాణ కాని.. భద్రాచలం కాని…. మెర్జ్ అయినవి తిరిగి డీమెర్జ్ అవడానికి ఆ ప్రాంతాల మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం అన్నాం!
   కాని హైదరాబాద్ మెర్జ్ కాక ముందు తెలంగాణలోనే ఉంది. మెర్జ్ అయినాక కూడ తెలంగాణలోనే ఉంది. ఇక అక్కడ డీమెర్జ్ అవడానికి ఏముంది?
   ఈ ఇంగిత జ్ఞానం లేకుండా తెగ ఆవేశపడడం దేనికి నాయనా?
   అయినా మీలాంటి వాళ్ళ సందేహం తీర్చడానికి మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (నమస్తే తెలంగాణ కాదు….) ఆ సర్వే కూడ చేయించి ముచ్చట తీర్చుకొన్నాడు. హైదరాబాదులో మూడింట రెండొంతుల జనం హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉండాలని కోరుకొన్నారు. వెళ్ళి ఆంధ్రజ్యోతి పేపర్లు వెదుక్కొని చదువుకో….

  • Mr. Hari:

   What is your source please? If you are so confidant, please try to mobilize Hyderabadis on your demand. Don’t make outrageous claims.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s