కాకి పిల్ల కాకికి ముద్దు … ఎవరి ఉద్యమాలు వారికి ముద్దు …!

కాకి పిల్ల కాకికి ముద్దు … ఎవరి ఉద్యమాలు వారికి ముద్దు …!

కాకి తల్లి …తన పిల్లపై ముద్దు మురిపెములు కురిపిస్తూ
”కోకిల పిల్లను” పొడిచి పొడిచి హింసించునట.
ఎందులకు?

కోకిల పిల్ల కాకి పిల్ల వలె ”కావు కావు ” మనకుండా…
”కుహూ కుహూ..” మనుట అది సహించజాలదు కనుక.

ఉప్పు కప్పురంబు లొక్క పోలిక నుండునటుల
కాకి-కోకిలలు రెండును నొకేరకముగ నల్లగ నిగనగలాడుచుండును.
కానీ వాటి పలుకులు వేరు.
అందువలననే అవి ఒకే గూటిలో మనజాలవు.

మనకు కోకిల రావం వీనుల విందుగ అనిపించును
కానీ కాకికి కోకిల కూత దుర్భరముగ వినిపించును.
కాకికి ”కావు కావులే” మధురాతి మధురముగ నుండును.
అందులకే ”కాకి పిల్ల కాకికి ముద్దు” అను లోకోక్తి వచ్చినది.

ఈ కాకిగోల మన కేల.
ఇప్పుడు మన ముందున్న గోల వేరు కదా.

ఉద్యమములు కూడా రెండు రకములు.
కాకి కోకిలల వలె ఆ రెండు రకముల ఉద్యమములు పైకి ఒకే రకముగ కనిపించును.
అవి రెండూ ఒకే రకముగ ఉవ్వెత్తున ఎగసి పడుచుండును.
కానీ చూడ చూడ రుచుల జాడ వేరు.

ఒక రకం ఉద్యమం ”మాది మాకు కావాలె” అని నినదిస్తే
రెండో రకం ఉద్యమం ”మాది మాకే కావాలి. మీది కూడా మాకే కావాలి” అని నినదించును.

ఒక రకం ఉద్యమం ”మా నీళ్లు మాకు కావాలి. మా ఉద్యోగాలు మాకు కావాలి. మా నిధులు మాకు దక్కాలి” అంటుంది.
రెండో రకం ఉద్యమం ”మీ నీళ్లు , మీ ఉద్యోగాలూ,  మీ నిధులూ మాకే కావాలి. మీ నీళ్లు లేకపోతే మా
ప్రాంతం ఎడారి అవుతుంది. మీ ఉద్యోగాలు లేకపోతే మా పిల్లలు వీధుల్లో అడుక్కు తినవలసి వస్తుంది. మీ నిధులు లేకపోతే మా ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేం”అంటుంది.

ఒక ఉద్యమం స్వాభిమానాన్ని, స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛని, అస్తిత్వాన్ని కోరుకుంటుంది.
రెండో రకం ఉద్యమం మరొక ప్రాంతంపై పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని, దోపిడీని శాశ్వతముగ చెలాయించాలని ఉబలాటపడుతుంది.

ఒక రకం ఉద్యమంపై లాఠీలు విరుగుతాయి, టియర్‌ గ్యాసులు విషం చిమ్మిస్తాయి, రబ్బర్‌ బుల్లెట్లు పేలుతాయి…. ఒక్క సమావేశం పెట్టుకోవాలన్నా వారికి గగనంగా మారుతుంది. అతికష్టం మీద సమావేశానికి అనుమతి ఇచ్చినా ఆరోజు రైళ్లు బస్సులు రద్దు అవుతాయి, ప్రైవేటు లారీలకు ఫర్మానాలు జారీ అవుతాయి.

కానీ రెండో రకం ఉద్యమం పరిస్థితి వేరు.
దానికి ప్రభుత్వ ఆదరణ వుంటుంది .
పెట్టుబడిదారుల అండదండలు దానికి పరిపుష్టి నిస్తాయి.

ఆ పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు మరియు
రంగుడబ్బాల మీడియా దానిని వేనోళ్ల కీర్తిస్తుంటాయి.
అట్టి ఉద్యమమునకు భంగము వాటిల్లకుండా రక్షక భటులు భద్రత కల్పిస్తారు.

అంతిమంగా …

ఏ ఉద్యమాన్ని విజయం వరిస్తుంది?
ఏ ఉద్యమాన్ని న్యాయదేవత హర్షిస్తుంది?
ఏ ఉద్యమంలో ధర్మం వుంది?

ఓ సమస్త మహాజనులారా  !

ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడునటుల కాకుండా
న్యాయాన్యాయ విచక్షణతో , నిష్పక్షపాతముతో, ప్రజాస్వామ్య బధ్ధముగ

స్పందించండి !

Image

Madaakabalam Telugu TalleeMoorkhas

Gaddi Tinaalsi vastundataKodi Eekala samaikyandhraHijra SamaikyandhraSmaadhilo Samaikyam

Kotulu Barrelu

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

5 Responses to కాకి పిల్ల కాకికి ముద్దు … ఎవరి ఉద్యమాలు వారికి ముద్దు …!

  1. kingkong says:

    సాటి తెలుగు వారి మీద చాలా మంచి విషం కక్కారు. సంతోషం.

    • గ్రీన్ స్టార్ says:

      >>సాటి తెలుగు వారి మీద చాలా మంచి విషం కక్కారు. సంతోషం.

      వారు చెప్పినది మీరు మళ్ళి నిరూపించారు, అందుకే ‘విషం’ అన్నారు. సంతోషం

  2. స్పందన “ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడునటుల కాకుండా న్యాయాన్యాయ విచక్షణతో , నిష్పక్షపాతముతో, ప్రజాస్వామ్య బధ్ధముగ” ఉండాలి. మీరు మాత్రం టపాలో దాన్ని పాటించరు. భేష్!
    సిసలైన తెవాదం ఇదే ముక్క చెప్పుద్ది – “మేం జెప్పే నీతులు మీ కోసం మాత్రమే, మేం పాటించడానిక్కాదు.”

    • J T Bandagi says:

      మీరు మాత్రం టపాలో దాన్ని పాటించరు. భేష్!
      <<<<
      ఏం పాటించమంటారు చదువరి సాబ్ !
      "మా గుండెల మీద కూచున్నారు…..
      మాకు ఊపిరాడడం లేదు….
      కాస్త లేవండ్రా బాబూ" అన్నా మీకు రుచించదాయె.

  3. దయచేసి మీ నీళ్ళు,మీ నిధులు,మీ ఉద్యోగాలు మాకు శాశ్వతంగా ఎప్పటిలా అనుభవించే అధికారం కట్టపెట్టండి ప్లీజ్ ,మీ తెలంగాణా ను కూడా మా ముఖ్యమంత్రులే సమర్థవంతంగా చిరకాలం పాలించి చరిత్ర సృష్టించే అవకాశం మాకే ఇవ్వండి!మీకు ఏమైనా సమస్యలుంటే మా ముఖ్యమంత్రినే అడగండి!ఆయన తెలంగాణా కు ఒక్క రూపాయికూడా ఇవ్వను పొండి ,దిక్కున్నచోట చెప్పుకోండి అంటే అప్పుడు పార్టీ అధిష్టానాన్ని దేబిరించండి ……అన్నట్లుగా ఉంది సమైక్యాంధ్ర నిరసన !అది పగటి భాగోతంలా లేదూ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s