తెలంగాణ లోని బకరా నేతలకు బంపర్‌ ఆఫర్‌……. !

మీకు అన్యాయము జరిగినదను మాట వాస్తవము.
తెలిసియో తెలియకనో మేము కొన్ని తప్పులను చేసినాము.
తప్పులు మానవ సహజము.
ఈ లోకమున తప్పులు చేయనివారెవ్వరు?

మా తప్పుల వలననే మన మధ్య భేదాభిప్రాయములు పొడసూపినవి.
అందులకు మేము మిక్కిలి పశ్చాత్తాపపడుతున్నాము.

బశ్చాత్తాపమునకు మించిన శిక్ష లేదందురుకదా విజ్ఞులు.
కావున మేము గతములో చేసిన తప్పులను సరిదిద్దుకొనుటకు
మాకు ఒక అవకాశము నొసంగుమని
బాధాతప్త హృదయముతో మిమ్ము బ్రాధేయపడుతున్నాము.

మీకు న్యాయము చేయుటకు ఈ కింది బంపర్‌ ఆఫర్లను ప్రతిపాదించుచున్నాము.
వీటిని నిండుమనంబుతో, మోదముతో, ఆమోదించి
మన రాష్ట్ర సమైక్యతను కాపాడి
ప్రపంచ వ్యాప్తముగనున్న 18 కోట్ల తెలుగుతల్లి సంతానమును
సంతసింప  జేయవలసినదిగా మిమ్ము అభ్యర్థించుచున్నాము.

1) పదిహేను సంవత్సరముల పాటు ముఖ్యమంత్రి పీఠము అధిష్టించు అవకాశము తెలంగాణ నేతలకే కల్పించుట..

2) అవసరమైనచో ఉప ముఖ్య మంత్రి పీఠము, పీసీసీ అధ్యక్ష పదవి సైతము 15 సంవత్సరముల పాటు తెలంగాణ నేతలకే ఇచ్చుట.

3) మా ప్రజా ప్రతినిధుల సంఖ్య 175 మీ ప్రజా ప్రతినిధుల సంఖ్య 119 అన్న భయసందేహములు  మీకు లేకుండా అధికార పక్షము,
ప్రతిపక్షము వారందిరిచేత ఈ మేరకు లిఖిత పూర్వక హామీ.

4) హైదరాబాద్‌ ట్యాంకు బండు మీదనే కాక విశాఖపట్టణము ఆర్‌కె బీచ్‌లో, సమస్త సీమాంధ్ర పట్టణములలో తెలంగాణా నేతల విగ్రహములను బ్రతిష్టించుట.

5) నీళ్లు, నిధులు, ఉద్యోగముల విషయములో సమన్యాయము కొరకు ”శ్రీకృష్ణ కమిటీ” చేత విచారణ జరిపించి తగు చర్యలు తీసుకొనుట.

6) పాఠ్య పుస్తకములలో తెలంగాణా చరిత్రను, తెలంగాణ వీర గాథలను చాటు పాఠములను చేర్చుట.

7) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా బ్రకటించి….. సీమాంధ్ర ఆడపడచులకు బతుకమ్మ ఎటుల ఆడవలనో శిక్షణ ఇప్పించి మరీ ఆడించుట.

8) ఆనాడు ఆంధ్ర తెలంగాణా రాష్ట్రము అన్న పేరు కాకుండా ఆంధ్రప్రదేశ్‌ అన్న పేరు పెట్టినందుకు బ్రాయశ్చిత్తముగా మన మొత్తము రాష్ట్రమునకు ”తెలంగాణ రాష్ట్రము” అని పేరు మార్పుట.

9) సినిమాలలో కథానాయకులకు తెలంగాణ యాసలో, ప్రతినాయకులకు సీమాంధ్ర మాండలికములలో డైలాగులు రాయించి వంద తెలుగు సినిమాలను నిర్మించుట.

ఈ మేరకు

నూతన ”  పెద్దమనుషుల ఒప్పందము ” కుదుర్చుకొనుటకు, తద్వారా మునుముందు మన దోపిడీ యజ్ఞమును ప్రశాంతముగా , సంతోషముగా, సమైక్యముగా చేసుకొనుటకు ముందుకు రావలసినదిగా సవినయముగ కోరుతున్నాము.

————————————————————————————-

గతం లో ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి పీఠం మీద  ఏ తెలంగాణా ముఖ్య మంత్రీ పట్టుమని  రెండున్నరేళ్ళను మించి లేరు.  కేంద్రం లో ప్రధాన మంత్రిగా ఐదేళ్ళూ మైనారిటీ ప్రభుత్వాన్ని అపర చాణక్యుడిగా నడిపిన పీవీ కూదా ఆంధ్ర రాజకీయలను తట్టుకోలేకపోయారు. ఇక ముఖ్యమంత్రిగా అంజయ్య పడ్డ అవమానాలు అన్నీ ఇన్నీ కావు.

లేరు. Image

Image

Image

తెలంగాణా అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ..

SrkanthChariYadaiah 4

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

10 Responses to తెలంగాణ లోని బకరా నేతలకు బంపర్‌ ఆఫర్‌……. !

 1. shayi says:

  గమనిక : తెలంగాణ బకరాలు ఈ “నవీన పెద్ద మనుషుల ఒప్పందము”నకు అంగీకరించిన తక్షణము జరుపు రహస్య సమావేశమునకు సీమాంధ్ర నాయకులంతా విచ్చేయ వలసినదిగా విజ్ఞప్తి. ఆ సమావేశములో పై ఒప్పందములోని ప్రతి అంశమును సత్వరమే ఎట్లు ఉల్లంఘించవలెనో చర్చించబడును.

  • మీరు ఉత్త బకరా కాదు, మహా బకరా గారండీ షాయి గారూ! ఉల్లంఘించడమెలాగో సిద్ధం చేసుకున్నాకే “న పె మ ఒ” ను పంపించాం.

   • shayi says:

    ఒరే ’చదువరి’ లేబుల్ తగిలించుకొన్న మొద్దు రాచిప్పా!
    ఇవాళ కాబినెట్ నోట్ తయారైనాక, నువ్వు…. నీ సీమాంధ్ర ఉద్యమకారులు…. మీ చెక్కా నాయకులు…. అందరూ మహామహా ఘనాఘన దేడ్ దిమాఖ్ బకరాలని తేలిపోయింది.
    “ఉల్లంఘించడమెలాగో సిద్ధం చేసుకున్నాకే “న పె మ ఒ” ను పంపించాం.” అని నువ్వు చెప్పాలా? నీ జాతి లక్షణమే ద్రోహం చేయడమని ప్రపంచమంతా తెలుసు. చెప్పుకోడానికి కూడా నీకు సిగ్గు లేదు. అయినా ఉమ్మేస్తే తుడుచుకపోయేటోనికి సిగ్గేంది? బొగ్గేంది??

 2. మరి అటులనే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన 1000 మందికి పైగా అమర వీరుల ప్రాణాలను తిరిగి ఇస్తారా..? మీ పోస్ట్ లో కనీసం వారి గురించిన ప్రస్తావన కూడా లేదు. మీ ఉద్దేశ్యం ప్రకారం రాజకీయ నాయకులకు పదవులు ఇస్తే చాలు. తెలంగాణ ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటున్నారా..? తెలంగాణ అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరి కోరిక.. (.మీరు సమైక్యాంద్ర ఎలా అంటున్నారో అలాగ.)

  • J T Bandagi says:

   చందు తులసి గారూ ,
   1000 మంది అమర వీరుల ప్రస్తావన తెచ్చి ఈ” సెటైర్” ను సీరియస్ చేసారు.
   గుండెలు అవిసిపోతున్నాయి.

   • J T Bandagi says:

    వారిని తలచుకుంటూ
    గుండెల్ని పిండే శ్రీకాంతా చారి, యాదయ్యల
    ఆత్మ బలిదాన ఫొటోలు
    ఈ పోస్టులో పొందుపరుస్తున్నాను.

 3. అమరవీరుల ఫోటోలు పెట్టినందుకు థాంక్యూ అండి.
  తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయకుల చేతులనుంచి ఎప్పుడో ప్రజల చేతుల్లోకి వచ్చింది.
  రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటే ఎలాగోలా ఆశ పెట్టి అదుపు చేసేవారు.

  • J T Bandagi says:

   మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను తులసి గారూ.
   అబద్ధాలతో,
   ఇలాంటి జిత్తులమారి హామీలతో, ఒప్పందాలతో
   ఆనాడు తెలంగాణను అంకురించక ముందే నలిపేశారు.
   కానీ ఇప్పుడు
   తెలంగాణా ఆవిర్భావాన్ని ఎవరూ ఆపలేరు.
   మహా అయితే కొద్ది రోజులు ఆలస్యం చేయగలరు
   అంతే.

 4. Raju says:

  Telangana kuhuna amaraveerualku kuda okkokkariki Nuta padahaarlu ippinche baadhyatha naadi.

 5. మానసిక విభజన ప్రజల్లో జరిగినాక భౌతికవిభజన ఆలస్యంగా అయినా జరిగి తీరుతుంది!తెలంగాణా ప్రజలు ఎన్నో ఆటుపోట్లను ఎంతో ఓరిమితో ధైర్య సాహసపూరితంగా ఎదుర్కున్నారు!తెలంగాణా ఉద్యమం ఎన్నడో ప్రజల చేతుల్లోకి పోయింది!ఇది పదవులకోసం ఆరాటం కాదు,ఇది ఆత్మగౌరవ పోరాటం,మా దిశ స్వయం పాలన!మా ఘోష స్వాభిమానం!తెలంగాణా రాష్ట్ర నినాదం ఎన్నడో పల్లెపల్లెకూ పాకింది,ఇల్లు ఇల్లుకూ సోకింది!తెలంగాణా మేధావుల మౌనం ఇప్పుడు ఈ దశలో అత్యంత ప్రమాదకరం!ఎంతకాలం ఈ రావణ కాష్టం!ఇప్పుడు ఏ కారణ౦ వల్లనైనా తెలంగాణా రాకపోతే ఇక ఎప్పటికీ రాదు!తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా ప్రజలను తెలంగాణా ప్రజా నాయకులే నిరంతరం పాలించాలి!సీమాంధ్ర ముఖ్యమంత్రుల తెలంగాణా వనరుల దోపిడీ పాలనకు చరమగీతం పాడదాం!ఇది అంతిమ పోరాటం!రాబోయే ఎన్నికలలో కలువకుంట్ల చంద్రశేఖర్ రావుగారి తెలంగాణా రాష్ట్ర సమితిని అత్యధిక సీట్లలో గెలిపిస్తేనే తెలంగాణా రాష్టం సిద్ధిస్తుందని ఇప్పుడు పూర్తిగా రుజువు అయింది!! వెయ్యిమంది ఆత్మబలిదానాలు ఎంతమాత్రం వృధా కారాదు!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s