”జై తెలంగాణ”- ”జై సమైక్యాంధ్ర” గర్జనలు ఇంకెంతకాలము ? న్యాయాన్యాయముల గురించి, ధర్మాధర్మముల గురించి, కనీస మానవత్వము గురించి ఇంకెప్పుడు ఆలోచించెదరు…?

Image

”జై తెలంగాణ”- ”జై సమైక్యాంధ్ర” గర్జనలు ఇంకెంతకాలము ?

న్యాయాన్యాయముల గురించి, ధర్మాధర్మముల గురించి, కనీస మానవత్వము గురించి ఇంకెప్పుడు ఆలోచించెదరు…?

కృతయుగములో ధర్మము నాలుగు పాదములతో నడిచేదట.
త్రేతాయుగమున ఆ నాలుగింటిలో ఒక పాదము విరిగినది …
ద్వాపరయుగమున మరొక పాదము విరిగినది …
చివరికి కలియుగము ప్రవేశించేనాటికి ధర్మమునకు
ఒకే ఒక్క పాదము మిగిలినది.

అది మన దౌర్భాగ్యము.
ఒంటికాలితో గెంతే ధర్మమును ఎవరు గౌరవించెదరు?
ఎవరు గౌరవించిననూ ఎవరు గౌరవించకపోయిననూ ఆంధ్రులు మాత్రం అస్సలు పట్టించుకొనరు.

న్యాయమును- అన్యాయముగా… అన్యాయమును న్యాయముగా;
ధర్మమును అధర్మముగా,,, అధర్మమును ధర్మముగా;
తిమ్మిని బమ్మిగా – బమ్మిని తిమ్మిగా భ్రమింపజేయడంలో
ఆంధ్రులను మించినవారు ఎవరైననూ ఉన్నారా?

అబద్ధాలు చెప్పడంలో, నీతులు వల్లించడంలో, ఆడి తప్పడంలో – మడమ తిప్పడంలో
ఆంధ్రులను తలదన్నువారు దుర్భిణివేసి చూచిననూ భారతదేశమునందే కాదు
ఈ సమస్త భూమండలమునందు మనకు మరెవరూ కాన్పించరు.

ఇది నిక్కంబ.

అందుకు ఈకింది ఉదాహరణములు కొన్నింటిని బరిశీలించుడు:

1) వైఎస్‌ఆర్‌ పిసిసి అధ్యక్షుడిగా వున్నప్పుడు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయుటకు 40 మంది తెలంగాణా ఎంఎల్‌ఎలను ఉసిగొల్పి ప్రత్యేక తెలంగాణా ఆకాంక్షకు తిరగి ఊపిరిపోసే ప్రయత్నం చేశాడు. 2004లో ప్రత్యేక తెలంగాణా కొరకే పుట్టిని టిఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు కుదర్చుకుని – ఎన్నికల ప్రచారములో తెలంగాణా ఇస్తామనే హామీని గుప్పిస్తూ సొనియాగాంధీ తో కలసి తెలంగాణాలో ప్రచారము చేశాడు. ముఖ్యమంత్రిగా నిండు అసెంబ్లీలో ”తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని. కాకపోతే స్టేక్‌ హోల్డర్ల అనుమానాలు నివృత్తి చేయవలసి వుందని” ప్రకటించినాడు. కానీ ఆ తరువాత ”తెలంగాణా ఇస్తే హైదరాబాద్‌కు వెళ్లాలంటే పాస్‌పోర్టు వీసాలు తీసుకోవలసి వస్తుందంటూ” ఆంధ్రలో ప్రజలను తెలంగాణాకు వ్యతిరేకంగా ఉసిగొల్పాడు.

2) చంద్రబాబు నాయుడు 2004లో సమైక్య నినాదము అచ్చిరాలేదని 2009లో యెర్రంనాయుడు అధ్యక్షతన ఒక కమిటీని వేసి మూడు ప్రాంత నాయకులతో కూలంకషంగా చర్చించి తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని – అదే టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నాడు. ”మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం” అని పలుమార్లు సవాలు చేశాడు. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి తెలంగాణాకు అనుకూలంగా లిఖితపూర్వకంగా టీడీపీ అభిప్రాయాన్ని తెలియజేశాడు. తీరా 2009 డిసెంబర్‌లో తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత అడ్డం తిరిగాడు. ప్రస్తుత జులై 30 సిడబ్ల్యుసి ప్రకటన వచ్చిన తరువాత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. తన పార్టీ సభ్యుల చేత పార్లమెంటులో వీధిభాగోతం ఆడిస్తున్నాడు.

3) వైఎస్‌జగన్‌ కాంగ్రెస్‌ పార్టీలో వున్నప్పుడు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నను సొంత పార్టీ పెట్టిన తరువాత ”మాకు తెలంగాణా ఇచ్చే శక్తీ లేదు ఆపే శక్తి లేదు” అంటూ ప్రకటించాడు. షర్మిల, విజయమ్మ ఇడుపులపాయలోనూ, తెలంగాణా పర్యటనల సందర్భంగానూ పలుమార్లు కేంద్రం ఆర్టికిల్‌ 3 ప్రకారం నిర్ణయం తీసుకుంటే మేం సమర్థిస్తాం అని చెప్పారు. విజయమ్మ, వైఎస్‌జగన్‌లు మొన్నటి ఆమరణ నిరాహార దీక్షలు కూడా సమైక్యాంధ్ర నినాదంతో కాకుండా ”ఇరు ప్రాంతాలకు సమన్యాయం” అనే డిమాండుతోనే జరిపారు. కానీ ఇప్పుడు పూర్తిగా సమైక్య శంఖారావం పూరిస్తున్నారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోలుస్తున్నారు..

4) ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ”తెలంగాణా అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు కేంద్రం చేతుల్లో వుంది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి వుంటాం. అమలు చేస్తాం” అని ప్రకటించి ఇప్పుడు ”రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు నీటి సమస్యలు వస్తాయి, ఉద్యోగ సమస్యలు వస్తాయి” అంటూ తన పార్టీ నిర్ణయానికి తనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

5) పిసిసి అధ్యక్షుడు ”హిందీ మాట్లాడే వాళ్లకి 8 రాష్ట్రాలుండగా తెలుగువాళ్లకి 2 రాష్ట్రాలుంటే తప్పేమిటని” ఎన్నో సార్లు ప్రజల్ని ప్రశ్నించి ఆ తరువాత సమైక్యాంధ్ర అనడం, ఇప్పుడు నర్మగర్భంగా మరేవో డైలాగులు వల్లిస్తుండడం తెలిసిందే కదా.

6) టీఆర్‌ఎస్‌ తెలంగాణా అంశంపై అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణా బిల్లు పెట్టాలని అనేక మార్లు సభను జరగనివ్వకుండా ఎంత పోరాడినా స్పందించని సీమాంధ్ర నేతలు ఇవాళ రంగు డబ్బాల ముందుకు వచ్చి గంభీరంగా చర్చించడం ఎంత హాస్యాస్పదం.

7) తెలంగాణా ప్రజలు తమపై సాగుతున్న అణచివేతపట్ల, కేంద్ర ప్రభుత్వం నిండు పార్లమెంటులో ప్రకటించి వెనక్కి తగ్గడం పట్ల, అనేకమంది తెలంగాణా యువతీ యువకులు నిరాశతో ఆవేదనతో ఆత్మబలిదానాలు చేసుకోవడం పట్ల కోపోద్రిక్తులై ట్యాంకు బండు మీద వున్న ఆంధ్ర ఆధిపత్యాన్ని చాటే కొన్ని విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు నానా నీతులు చెప్పిన సీమాంధ్ర నాయకులు… మొన్న తమ సీమాంధ్రలో తమ పార్టీకి చెందిన రాజీవ్‌ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను తగలబెడ్తున్నప్పుడు ఎందుకు కిక్కురు మనలేదు?

8) తెలంగాణా ఆకాంక్షను వ్యతిరేకించిన నటుల సినిమాలను తెలంగాణాలో అడ్డుకుంటామన్నందుకు ఎంతో తిట్టిపోసినవాళ్లకు ఇవాళ సీమాంధ్రలో కొందరు నటుల సినిమాలను అడ్డుకోవడం న్యాయంగా ఎలా అనిపిస్తోంది?

9) ప్రభుత్వం పోలీసులు ఇచ్చిన అండదండలతో… ఉమ్మడి రాజధాని అనే నెపంతో … తెలంగాణా నడిబొడ్డున వేలాది మంది సీమాంధ్రులు ”జై సమైక్యాంధ్ర” అని నినాదాలు చేయవచ్చును కానీ ఒక్క పోలీసు కానిస్టేబులు, ఒక విద్యార్థి ”జై తెలంగాణా” అని నినదిస్తే కొట్టడం, పీక కోస్తామని సైగచేస్తూ బెదిరించడం ఏం సమైక్యతను, ఏ సౌజన్యాన్ని చాటుతోంది?

10) జనాభా పరంగా ఎంఎల్‌ఎ, ఎంపీల పరంగా సీమాంధ్ర తెలంగాణా కంటే పెద్దది. అంత మాత్రాన సీమాంధ్ర ప్రజలు ఒప్పుకుంటేనే తెలంగాణా ఇవ్వాలనడం ఏ న్యాయం కిందకు వస్తుంది. విడిపోవాలనుకుంటున్న ప్రాంతంలోని ప్రజల అభిప్రాయం ముఖ్యమా లేక అన్యాయం చేసే, బ్రూట్‌ మెజారిటీతో దౌర్జన్యం చేసే వారి అభిప్రాయం ముఖ్యమా?

మరికొన్ని అంశాలు తరువాత చర్చించుకుందాం
ముందు వీటికి విజ్ఞులైన సీమాంధ్రులు సమాధానాలు చెప్పండి.
ఉభయ ప్రాంతాలలోని బీద ప్రజలకు నష్టం కలిగిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చూపండి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫజల్ అలీ కమిషన్ (మొదటి ఏస్ ఆర్ సి) 1954-55లోనే తెలంగాణ (హైదరాబాద్) రాష్త్రాన్ని ప్రతిపాదిస్తూ గీసిన చిత్రపటం ఇది:

First SRC Telangana
మద్రాస్ నుంచి వేర్పాటు వాది పొట్టి స్రీరాములు ఆత్మ బలిదానం తొ ఎర్పడిన ఆంధ్ర రాష్టం చిత్రపటం ఇది.
బాల అనే పత్రిక ఆనాదు సగర్వంగా ముఖ చిత్రంగా ప్రకటించుకుంది .
ఇప్పుదు మళ్ళీ దీనికోసమే “జై సమైక్యాంధ్ర” … ” జై సమైక్యాంధ్రా ” అని నినదిస్తున్నారు.

andhra-1953

 

 

Advertisements
This entry was posted in Telangana and tagged , , , . Bookmark the permalink.

40 Responses to ”జై తెలంగాణ”- ”జై సమైక్యాంధ్ర” గర్జనలు ఇంకెంతకాలము ? న్యాయాన్యాయముల గురించి, ధర్మాధర్మముల గురించి, కనీస మానవత్వము గురించి ఇంకెప్పుడు ఆలోచించెదరు…?

 1. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా ప్రకటించే హక్కు మీకు ఎవరిచ్చారు?

  ఆంధ్రప్రదేశ్ ముక్కలయ్యాక అప్పుడు ప్రకటించుకోండి. కాని అదింకా అధికారికంగా జరగలేదు. కాబట్టి మీరు ప్రకటించిన పటం‌తప్పు. దీనికి నా నిరసన తెలియజేస్తున్నాను.

  • మదరాసు ఉమ్మడి రాష్ట్రంలో తమ రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆంధ్రులు సొంత పటాన్ని వాడలేదా?

   • rao says:

    vada ledu

   • Vasu says:

    జై గొట్టిముక్కల గారు,
    భారతదేశ చిత్ర పటంలో కాష్మీర్ ను, అరుణాచల్ ప్రదేశ్ ను ఇష్టమొచ్చినట్లు చూపిస్తే, దేశ ప్రజలు భావోద్రేకానికి లోనై నిరసన తెలుపలేదా? అది తప్పేలా అవుతుంది? శ్యామలీయం గారు అడ్డు చెపితే ఆయన మీద అనవసరంగా మీ నాలేడ్జ్ తో వాదనకు దిగుతున్నారు. అందరికి మీ అంత సుపర్ నాలేడ్జ్ ఉందని ఎలా అనుకొంటారు? అంతటితో ఆగకుండా ఆంధ్రావాళ్లను మీరు ఆ జన్మ శత్రువులుగా పరిగణించి, చురుక్కు మని బాధ కలిగించే విధంగా వ్యాఖ్యలు రాయటం , మీలోని అసహనాన్ని, అబద్రతా భావాన్ని సూచిస్తుంది. ఈ రేండు కాకపోతే మీ నాలేడ్జ్ ను ప్రదర్శించటానికి, మీరు ప్రయత్నిస్తున్నరని అనుకోవలసి వస్తుంది. మీరు రాసే వ్యాఖ్యలు కొన్నిసార్లు మీస్థాయికి తగినట్లు లేకపోయినా, గమ్ముగా ఉండవలసి వస్తున్నాది. మీ అభిప్రాయనికి భిన్నంగా ఒక చిన్న వ్యాఖ్య రాసినా వాళ్లందరిని తెలంగాణ వ్యతిరేకులు గా మీరు భావిస్తున్నారు. నేనైతే తెలంగాణాకు వ్యతిరేకం కాదు,మీ వ్యాఖ్యలకి బదులిచ్చి ఆంధ్రా తెలంగాణా అంటూ అనవసరం గా చర్చలో దిగటం ఎందుకని గమ్ముగా ఉంట్టున్నాను. అంతే కాదు మీలాగా అందరికి ఆంధ్రా, తెలంగాణ చరిత్ర క్రీ పూ నుంచి 17 సెప్టెంబర్ 2013 వరకు చరిత్ర లో ఎమీ జరిగిందో కూలంకషంగా తెలియదు. మీరైతే ఆంధ్రా తెలంగాణా చరిత్ర మీద పి చ్ డి కన్నా ఎక్కువ పరిశోధనలు చేసినట్లు ఉన్నారని, మీ బ్లాగు, మీరు రాసే వ్యాఖ్యలు చదివితే తెలుస్తుంది. మీ దగ్గర ఎంతో విలువైన సమాచారం ఉంటే, ప్రభుత్వ కమిటీలకో తెలంగాణా పోరాటం చేసే వారితో నే పంచుకోండి. అంతే కాని పిచుక మీద బ్రహ్మాస్రం లాగా బ్లాగులో వారి పైన ప్రయోగిస్తే ,అనవసరమైన మనస్పర్ధలు రావటం తప్పించి ఏమి లాభం ఉండదు.

  • J T Bandagi says:

   భారత దేశ (సరిహద్దులను సూచించే) చిత్రపటం కాదు ఇది.
   భారత దేశం లోని రాష్ట్రాలను సూచించే చిత్ర పటం ఇది.
   ఎప్పుడో 1955 లోనే ఫజల్ అలీ (మొదటి ఎస్ ఆర్ సి) కమిషనే
   ఇలాంటి చిత్రపటాన్ని తయారు చేసింది.
   కొత్త రాష్ట్రాలను ప్రతిపాదించేప్పుడు ఇట్లాగే సూచిస్తారు.

   అయినా పటాన్ని చూస్తేనె కంపరంగా వుందా మీకు?

   “ఆంధ్ర ప్రదేష్ ముక్కలయ్యాక…” అన్న మీ పద ప్రయోగాన్ని నేనూ తీవ్రంగా ఖండిస్తున్నాను.
   ముక్కలేంటి… ముక్కలు. …..

   ఆ మాట కొస్తే
   మీ దుర్మార్గపు లాబీయింగ్ తో,
   దొంగ ఒప్పందాలూ హామీలతొ
   ఆదరా బాదరాగా మోసపూరితంగా
   రెందు ముక్కల్ని బలవంతంగా కలిపితేనే
   ఆంధ్ర ప్రదేష్ ఏర్పడింది అన్న వాస్తవాన్నిమరచిపోవద్దు.

   సరిగా అతుక్కోలేదు కాబట్టి …
   మీ దోపిడీని, వివక్షను, హేళనలను
   తెలంగాణా భరించ లేక పోతోంది కాబట్టి
   ఆ రెండు ముక్కలూ
   ఇప్పుడు విడిపోతున్నాయి.
   అంతే

   • J T Bandagi says:

    శ్యామల రావు గారూ
    మీకొసం మరో రెండు చిత్ర పటాలు ఈ పోస్ట్ లో పొందుపరిచాను చూడండి>

   • J T Bandagi says:

    దానిలో‌తెలంగాణాని విడిగా చూపటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
    అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ లేదు కదా?
    >>>>
    కానీ అప్పడు కన్నడ, మరాఠీ ప్రాంతాలతో హైదరాబాద్ రాష్త్రం
    అధికారికంగా వేరేగా వుండేది కదా !

    కన్నడ మరాఠీ ప్రాంతాలను కత్తిరించి చూపడం
    సబబే అయినప్పుదు రేపు తెలంగాణా పేరుతో డీమెర్జ్ కాబోతున్న అదే రాష్ట్రాన్ని
    ప్ర్జెక్ట్ చేస్తే తప్పెలా అవుతుంది ???

    తెలంగాణా అస్తిత్వం సాకారం కాబోతున్న ప్రతిసారీ
    అడ్డుకుంటున్న వారిని ఇంకా మర్యాదగా సంభోదించే ఓపిక
    తెలంగాణా లో అంతకంతకూ నశిస్తోంది.

    మీతో ఈ దిక్కుమాలిన, ఫలితం లేని చర్చలు జరపాలనే
    మాకూ లేదు.

   • ఫజల్ అలీ కమిషన్ (మొదటి ఏస్ ఆర్ సి) 1954-55లోనే తెలంగాణ (హైదరాబాద్) రాష్త్రాన్ని ప్రతిపాదిస్తూ గీసిన చిత్రపటం చూసాను. దానిలో‌తెలంగాణాని విడిగా చూపటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ లేదు కదా?

    అలా బాలలో‌ప్రచురించిన పటం కూడా 1955 నాటిది. అదీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ కన్నా ముందుదే‌ కదా?

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. అది అలా అధికారికంగా ఉన్నంత కాలం మరెవరూ దేశ చిత్రపటాన్ని వేరే రకంగా గీసి ప్రకటించటం అక్రమం అవుతుంది.

    అంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందన్న విషయంలో అనుమానం ఏముంది? బూర్గుల వారి నాయకత్వంలో జరిగిన నిర్ణయం ప్రకారం తెలంగాణా అంద్రా ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా? ఇప్పుడు రాష్ట్రం విడగొట్టటం అనండి ముక్కలు చెయ్యటం అనండి అలాంటిది జరగనంత వరకూ మనం దేశపటంలో ఆంద్రప్రదేశ్‌నే చూపాలి. అదే పధ్ధతి.

    ఇకపోతో‌ప్రజలను దోపిడీదారు లనే దురదృష్టకరమైన పదప్రయోగాన్ని తెలంగాణా వాదులు మానటం అభిలషణీయం. మీ తెలంగాణా వాదులు రాజకీయనిర్ణయాలనో, రాజకీయనాయకులనో, రాజకీయవ్యవస్థనో తప్పు పట్టటం ఒక సమంజసమైన విషయం, ఎకాఎకీ సీమాంధ్రప్రజలంతా దుష్టులంటో నోరు పారేసుకోవటం అసమంజసమైన ధోరణి.

    ఇక ఈ విషయంపై వాదించ దలచుకో లేదు.

   • >కొత్త రాష్ట్రాలను ప్రతిపాదించేప్పుడు ఇట్లాగే సూచిస్తారు.
    అసంబధ్ధం. బందగిగారూ, రాష్ట్ర సరిహద్దులు నిర్ణయించేదుకు మిమ్మల్ని భారతప్రభుత్వం నియమించిందా? ఒక చిత్రపటం నమూనా అడిగిందా?

 2. 1,2,3,4,5,6: కె. చంద్రశేఖరరావు తెదేపాలో ఉండగా సభలోనూ బయటా ఏమేం మాట్టాడాడో రాసి ఉంటే ఈ వేదనకు విలువ వచ్చేది. కేవలం కొందరి గురించే రాయడం చేత ఇది వేదన కాస్తా ఉత్త వాదనగా, ఒక రోదనగా మిగిలిపోయింది.

  7) ఏ విగ్రహాలనైనా పడగొట్టడం తప్పు. ఆ తప్పు రెండు ప్రాంతాల వాళ్ళూ చేసారు. విగ్రహాలు పడగొట్టడాన్ని సమర్ధించడం – ఏ కారణం చూపైనా సరే – తప్పు. ఆ తప్పు మీరు చేసారు.

  8) న్యాయం కాదు. అదే సినిమా వాళ్ళ దగ్గర్నుంచి డబ్బులు నొల్లుకుని అవే సినిమాలను తెలంగాణలో నిర్మించనిచ్చారు, ఆడనిచ్చారు. అది మహా తప్పు. ఆ సంగతి మీ ప్రశ్నల్లో లేవనెత్తలేదు.

  9) తమ సభలో రౌడీయిజాన్ని ప్రదర్శించినపుడు, తమపై రాళ్ళు చెప్పులూ విసిరినప్పుడు ఉద్యోగులు ఎదుర్కొన్నారు. ఆ రౌడీలను నిరసించడం పోయి, అ రౌడీయిజాన్ని ఎదుర్కొన్నందుకు ఉద్యోగులను మాత్రం విమర్శించడం మీ సౌజన్యాన్ని, మీ నిష్పక్షపాతాన్నీ చాటుతోంది.

  10) మేం విడిపోతామని తెవాదులు అని ఉంటే బహుశా తెలంగాణ ఎప్పుడో ఏర్పడి ఉండేది. మీరు అవతలికి పోండి అని సీమాంధ్రులను అనడంతోటే సమస్య వచ్చింది. మేం అడుగుతున్నాం కాబట్టి కోస్తా సీమలను విడదీసెయ్యాల్సిందే అని చిందులు శివాలూ వేసినంత మాత్రాన, అవతలి వాళ్ళు నోరు మూసుకుని పోరు. తమకు రావాల్సినదాన్ని గురించి ప్రశ్నిస్తారు. బుల్డోజర్లకు ఎదురు నిలిచి నిలబడ్డారు సీమాంధ్రులిప్పుడు. వాళ్లను తొక్కించేసి, రాష్ట్రాన్ని విడదీసి, తియనాన్మెన్ స్క్వేర్ ను సృష్టిస్తారో, లేక వాళ్ల సమస్యలను పరిష్కరించి ఆ తరవాత ప్రజాస్వామ్యయుతంగా విభజిస్తారో చూడాలి.

  • naveen says:

   మిమ్మలీ వెల్లిపొవాలని ఎవరు అన్నారు మిత్రమా ?

   • అదేం మాట! రోజుకు పది మంది తెలంగాణా వాదులు పెద్దా చిన్నా నాయకులు ప్రత్యక్షంగానూ పరోక్షంగా సీమాంధ్రులను ఆ మాట అంటూనే ఉన్నారే!

   • J T Bandagi says:

    ఇది దారుణం శ్యామలరావు గారూ.
    ఇలాంటి రంధ్రాన్వేషణల వల్ల,
    ఏనుగును వదిలేసి ఉద్దేశపూర్వకంగా తోకను ముఖ్యమైన చర్చనీయాంశం గా చేయడంవల్ల
    ఏం ప్రయోజనం వుంటుంది?
    సమస్య ను ఇంకా మురగబెట్టడం తప్ప!

    మీకు అన్నీ తెలుసు …
    ఆనాడు Rajaji 24 గంటల్లో మద్రస్ ను వదిలి వెల్లిపొమ్మని అల్టిమేటం జారీ చేసారు. కానీ ఇప్పటికీ అక్కదె 40 lakshala మంది ఆంధ్రులు వున్నారు.
    తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం మొన్నటి వరకూ మద్రాస్ లోనే వుంది. ఈప్పటికీ ఇంక ఎంతో మంది కళాకారులు అక్కద వున్నారు. వారి ఆస్తులూ అక్కడే భద్రం గా వున్నాయి.
    కాదంటారా?

    ఎవరేం అన్నా రేపు ఇక్కడా అదే జరుగుతుంది.
    భారత రాజ్యాంగం తెలంగాణ lo paniki రాకుండా పోతుందా… మీగొబెల్స్ ప్రచారం కాకపోతె.

    సహజంగానే …
    మీ ముఖ్య మంత్రి, మీ డీజీపీ , మీ సక్రటేరియెట్ మాత్రం పోక తప్పదు.
    ఇదంతా వాళ్లు,
    హైదరాబాదులో అక్రమ ఆస్తులు సంపాదించుకున్న వాల్లు chEstunna దుర్మార్గపు ప్రచారం.
    ఇరు ప్రాంతాల సామాన్యుల బతుకులతో ఆ స్నార్ధపరులు చెలగాట మాడుతున్నారు.

    ఇప్పటికైనా న్యాయం గా ధర్మంగా ఆలోచించండి

 3. Answer is simple,
  Chameleon Congress is Clueless as it wants to have Cake and Eat it too..
  Only a decisive leader, who can speak only the language of constitution and deliver the rights to people in all three region and execute the commitment made by the President and Parliament to the people of Telangana and the announcement made in both houses of Parliament..

  I doubt this Govt and the party behind it has
  Neta with Neeti and Niyyat to do it..

  Carry on with life and tell the verdict in next elections is all that I can foresee happening..as I foresee activities but not conclusion before the next elections..

  If there was any will power by now Sonia G, MMS or Rahul G should have been in the state and speak to people with clarity..

  They can’t because they don’t have what it takes with them..

 4. J T Bandagi says:

  1,2,3,4,5,6 లను ఎంత తేలికగా,, కొట్టిపారేసారు చదువరి గారూ. నువ్వు గడ్డి తింటే మేం ఇంకేదో తింటాం అన్నట్టుంది. కేసీఆర్ ని అడ్డం పెట్టి తప్పుకోడం కంటే మీరు చెప్పగలిఘేది ఏమీ లేదా? రాజకీయ దివాళాకోరుతనాన్ని ఇంత పచ్చిగా ఎలా సమర్ధించగలుగుతున్నారు?

  7) తప్పొప్పులు సరే …. టాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం అప్పుదు ఎడతెరిపి లేకుండా ఖండించిన , నీతులు వల్లించిన వాళ్ళూ , మీడియా కనీసం కూడా స్పంధించ లేదు , ఖండించ లేదు కదా దానికేమంటారు అని ?

  8) మధ్యలో ఈ డబ్బులు ఒల్లుకోడం ఎమిటి? ఒల్లుకోడం తప్పే ….. మరి ఇవ్వడం కూడా తప్పే కదా…… ఊరికే ఆరోపణలు చెయడం కాదు ఎవడెవడు ఏంత ఇచ్చారో బయట పెట్టండి . ప్రభుత్వం మీదే కదా … వారి మీద కేసు పెట్టి శిక్షించండి. ఊరికే బట్ట కాల్చి మీదవేసి చంకలు గుద్దుకోవడం కాదు.

  9) తమ సభలో రౌడీ ఇజాన్ని ప్రదర్షించినప్పుడు … <<<<< ఇంతకంతే దుర్మార్గమైన ఆరోపణ, దబాయింపు మరొకటి లేదు. కానిస్టెబుల్ శ్రినివాస్ "జై తెలంగాణా " అని నినాదం చేయదం తప్ప ఎం రౌడీయిజం చేసాడు? "ఉల్టా చోర్ కొత్వాల్ కొ డాంటె " అంటె ఇదే మరి. . శ్రినివాస్ ని, అతన్ని కాపాడబోయిన మరో ఎస్ ఐ నీ, బాలరాజ్ అనె విద్యార్ధి నాయకుడినీ చితక బాదడమే కాక పీక కొస్తాం అని సైగ చెసి మరీ బెదిరించడం సౌజన్యంగా … నిష్పక్షపాతం గా అనిపించి సమర్ధిస్తున్నారా? చెప్పులు జార్జ్ బుష్ అంతటి వాడి మీద కూడా విసిరారు. ప్రపంచం అంతా అప్పుడు అతన్ని మెచ్చుకుంది. ఇప్పుడు తెలంగానా అంతా శ్రినివాస్ ని కీర్తిస్తోంది.

  10) మేం విడిపోతామని తెవాదులు అని ఉంటే బహుశా తెలంగాణ ఎప్పుడో ఏర్పడి ఉండేది. <<<< వాళ్ల సమస్యలను పరిష్కరించి ఆ తరవాత ప్రజాస్వామ్యయుతంగా విభజిస్తారో చూడాలి <<<
  తెలంగానా నీళ్ళను, నిధులను ఉద్యోగాలను తేరగా తినమరిగిన మీరు అంత తేలిగ్గా విభజనకు ఒప్పుకుంటారా?
  ఆనాడు మద్రాస్ లొ రాజాజీ నుంచి ఎదురైన పరాభవం కోసమే మీరు ఎదురుచూస్తున్నారు.
  వాళ్ల సమస్యలను పరిష్కరించి ఆ తరవాత <<<<
  ఏంటా సమస్యలు,???
  రాష్త్రం విభజించక ముందే వాటిని ఎట్లా పరిష్కరిస్తారో
  కాస్త వివరించండి. .
  " సమన్యాయం చెయ లెక పోతె రాష్త్రాన్ని సమైక్యంగా వుంచంది "
  ఇదే కదా మీ జిత్తులమారి , తేనెపూసిన కత్తి లాంటి వాదన.

  • In the human history no beneficiary voluntarily forgoes the benefit there is invariably opposition which in itself is evidence there was undue benefit in the arrangement.
   To cover it up the loss of undue benefit is portrayed as loss and seek justice..

   This is not a matter that can ever reach consensus, inherently its not possible..
   The problem can only be solved by Govt of India following the Constitutional Process..

  • chandu says:

   super reply anna

  • రాజకీయ దివాలాకోరుతనం.. కేసీయారుతో సహా అందరిదీ అని చెబుతున్నాను.

   డబ్బులు నొల్లుకోవడం గురించి.. రఘునందనరావు చెప్పాడు గదా!

   ఒక సభలో ఆ సభకు వ్యతిరేకంగా “జై తెలంగాణా ” అని నినాదం చేయడాన్ని ఎలా మర్ధిస్తారు మీరు? తెలంగాణ జై సమైక్యాంధ్ర అంటే ఎలా ఉంటుంది మీ స్పందన? ఆ విద్యార్థి నాయకులే గదా.. ఉద్యోగులపై రాళ్ళేసింది, వాళ్ళేగా చితక తంతం, చావగొడతం అని బెదిరించింది, ఇందుకు వ్యతిరేకంగానే గదా.. ఉద్యోగులు స్పందించింది.

   “ఏంటా సమస్యలు,??? ” – ఈ ప్రశ్న వేసేపాటి విజ్ఞత కేంద్రం ఎప్పుడూ ప్రదర్శిస్తుందో చూద్దాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎలా గుర్తించారో అలాగే మిగతా ప్రాంత ప్రజల ఆకాంక్షలను కూడా పట్టించుకోవాలి. తెవాదంతో సీమాంధ్రులను, వాళ్ల ఆకాంక్షలనూ బుల్డోజు చేసి రాష్ట్రాన్ని చీల్చొద్దనే నేనంటున్నది. “రాష్త్రం విభజించక ముందే వాటిని ఎట్లా పరిష్కరిస్తారో.” – ముందు సమస్యను గుర్తిస్తే, ఎలా పరిష్కరిస్తారో కూడా వాళ్ళు చెప్పొచ్చు.

   “తేరగా తినమరిగిన”, “రాజాజీ నుంచి ఎదురైన పరాభవం కోసమే మీరు ఎదురుచూస్తున్నారు” –
   “..మీ జిత్తులమారి , తేనెపూసిన కత్తి లాంటి వాదన” – 🙂 ఇలాంటి మాటలు బ్లాగుల్లో మామూలే, పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మనకున్న కోపం కసి, మనచేత ఇలా రాయిస్తూ ఉండి ఉండవచ్చు -రెండు వైపులా. కానీ నాయకులు (రెండు ప్రాంతాల వాళ్ళూను) కూడా ఇలాంటి మాటలే మాట్టాడుతూ ఉన్నారు. అలా మాట్టాడితే, ఈ చిక్కుముడి ఎలా విడుతుంది? అసలు సమస్యల్లా అదేనని నా ఉద్దేశం. నాయకులు తిట్టుకోడం ఆపి, ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్టాడుకుంటారో అప్పుడు సమస్య పరిష్కారం సులువౌతుంది.

   • J T Bandagi says:

    మీ దివాళాకోరుతనం కప్పిపుచ్చుకోడానికి కూడా కేసీఆరే కావాలా? అందరిదీ దివాళాకోరుతనమే అని చేతులు దులుపుకుంటే సరిపోతుందా?
    ఘజనీ మహ్మద్ కు బాలచంద్రుడిలా మీకు రఘునందనుడు ప్రామాణికమన్న మాట.

    తెలంగాణా లో తెలంగాణా వాల్లు ఒక సభ పెట్టుకోవాలన్నా, ఒక ఊరేగిపు తీయాలన్నా ఎంత దారుణమైన నిర్భందం ఎదుర్కోవలసి వస్తోందో మీకు తెలుసు.
    అయినా ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య పుండు మీద కారం చల్లినట్లు ఆంధ్రా ఉద్యోగులు ప్రభుత్వ అండదండలతో పోలీసుల సం రక్షణ లో హైదరాబాద్ నడిబొడ్డున సభ ఫెట్టుకోవచ్చు. నోటిదాకా వచ్చిన కూడును కాలితో తన్నొచ్చు., తెలంగాణా కు వ్యతిరేకంగా తెలంగాణాలోనే కుట్రలు పన్నొచ్చు. నినాదాలు చేయొచ్చు.
    మీకు అంతా సజావుగానే ప్రజాస్వామ్య యుతంగానే కనిపిస్తుంది కదా.
    >>>
    “ఏంటా సమస్యలు,??? ” – ఈ ప్రశ్న వేసేపాటి విజ్ఞత కేంద్రం ఎప్పుడూ ప్రదర్శిస్తుందో చూద్దాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎలా గుర్తించారో అలాగే మిగతా ప్రాంత ప్రజల ఆకాంక్షలను కూడా పట్టించుకోవాలి.
    <<<
    ముందు ఆ సమస్యలేంటో వాటికి మీ దృష్టిలోని పరిష్కార మార్గాలేమిటో చెప్పే విజ్ఞత మీకుందా?
    ఇప్పుడే టీవీ లో చూసాను. సమైక్యవాది కావూరి "ఇంటిమీద" సమైక్యవాదులే పడి ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు. ఇంకా ఈ ఉన్మాదం ఎక్కడికి దారితీస్తుందో.

 5. J T Bandagi says:

  Shyam Kumaar
  నాకు అనిపిస్తుంది తెలంగాణా ఇప్పట్లో రాదనీ, ఎందుకంటే ఆ ఊపు ఇంకా కనిపించటం లేదు .
  వాలు 31 వరకు సరిగ్గా ప్రణాళికలు వేసుకున్నారు కాని మన వాళ్ళు మాత్రం ఒకరిపై ఒకరు తిట్టుకోవటం , అన్ని చాన్నేల్స్ లో ముఖ్య వ్యక్తి అవ్వాలని ఆరాటం తప్పితే ఒక్కరికి సిగ్గు లెదు.

  తెలంగాణా అంటారు మల్లి ఖైరతాబాద్ వినాయకుడి ని ఎవ్వరు పెడుతున్నారు,లాడ్దేమో సమైక్య ఆంధ్రా వారిది. వుంటే నిజాయితీగా ఉండండి లేదంటే అదిగో తెలంగాణా, ఇదిగో తెలంగాణా అని మాట్లాడకండి
  Reply:
  శ్యాంకుమార్ భయ్యా
  తెలంగాణ ఇప్పట్లో రాదు అనిపిస్తే పర్వాలేదు
  కని ఎప్పటికీ రాదు అని అయితే అనిపిస్త లేదు కదా.
  తెలంగాణా పక్కా .
  ఆంధ్ర వైపు తెగ బలిసిన నాయకులు, కాంట్రాక్టర్లు, లాబీయింగ్ గుంటనక్కలు. మీడియా ఉన్నది, పత్రికలు ఉన్నయి, అన్నింటికి మించి ముఖ్యమంత్రి డీజీపీ పోలీసులు వున్నరు.

  తెలంగాణ వైపు ఏమున్నది?
  న్యాయం ఉన్నది.
  ధర్మం ఉన్నది
  కలేజా ఉన్నది.
  ఎన్నటికైనా విజయం మనదే.

  మన నాయకులకు ప్రజల పట్ల నిబధ్ధత వుంటే అసలు 1956 లో తెలంగాణ గీ ఆంధ్ర ఊబిలో చిక్కుకునేదే కాదు.
  ఆ కంత్రి గాల్లతోనేంది. ప్రజలు పోరాట శీలురు
  రేపు నిజమైన నాయకులను వారే తయారు చేసుకుంటారు.
  మిగతా చిన్న చిన్న విషయాలను పట్టించుకుని
  పరేశాన్ కావద్దు
  జై తెలంగాణ

 6. @Vasu:

  “భారతదేశ చిత్ర పటంలో కాష్మీర్ ను, అరుణాచల్ ప్రదేశ్ ను ఇష్టమొచ్చినట్లు చూపిస్తే, దేశ ప్రజలు భావోద్రేకానికి లోనై నిరసన తెలుపలేదా?”

  Those maps attack India’s sovereignty. Unlike in US, Indian states have zero sovereign rights. There is no law against depicting internal boundaries differently.

  If anyone believes the map in this blog violates law, let *him* file a case instead of spewing venom at the blogger.

 7. “మీ దివాళాకోరుతనం కప్పిపుచ్చుకోడానికి కూడా కేసీఆరే కావాలా? ” – లేదు, మీ దివాలాకోరు తనాన్ని కప్పిపెట్టుకునేందుకు.

  “ఇప్పుడే టీవీ లో చూసాను. సమైక్యవాది కావూరి “ఇంటిమీద” సమైక్యవాదులే పడి ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు. ఇంకా ఈ ఉన్మాదం ఎక్కడికి దారితీస్తుందో.” – వాళ్ళు తమను పట్టించుకోని నాయకుడి మీద చూపిస్తున్నారు, తెవాదులు సెప్టెంబరు ఏడున సమైక్యాంధ్ర ఉద్యమకారుల మీద చూపించారు. మీరు దాన్ని ప్రజాస్వామికం అని అన్నారు. దీన్ని ఉన్మాదం అని అంటున్నారు 🙂

  • J T Bandagi says:

   ఎవరో ఒకరిద్దరు శాడిస్టులు వుంటారు కానీ
   ఒక ప్రాంతానికి చెందిన మెజారిటీ వ్యక్తులు ఇట్లా పరమ శాడిస్టులు కావడం
   బహుశా ప్రపంచంలోనే మరెక్కడా వుడదు.
   ఇంక మాటల వల్ల లాభం లేదు
   మరో కురుక్షేత్ర సంగ్రామమే గతి మనకు.

   • మీ‌ ప్రాంతమంతా అజాతశత్రువులైన ధర్మరాజులేనా? ఆవలి ప్రాంతమంతా శాడిష్టులేనా? అద్భుతం!
    మిగిలిన ప్రపంచం అంతా శాడిష్టు లనుకోవటం ఎటువంటి వింత!
    మీకే చెల్లింది పొండి!

   • “ఒక ప్రాంతానికి చెందిన మెజారిటీ వ్యక్తులు ఇట్లా పరమ శాడిస్టులు కావడం బహుశా ప్రపంచంలోనే మరెక్కడా వుడదు.”ఎక్కడా ఉండదు. ఇక్కడా ఉండదు. ఆ విధంగా ఉన్నట్టు ఎవరైనా భావిస్తే, అది సదరు మనిషి యొక్క మానసిక స్థితిని, అతడి ఆలోచనా స్థాయినీ సూచిస్తుందే తప్ప, మరోటి కాదు.

   • Viswaroop says:

    @బందగీ

    ఈశాడిస్టులేం మెజారిటీ కాదండి, ఒక వర్గానికి చెందినవారే. కాకపోతే మీడియా, పోలిటిక్స్, సినిమా అన్నింటా ఈవర్గానిది పైచేయి కావడం వల్ల యెల్లో రాతలు రాస్తుంటారు. విడిపోతే ఎక్కడ వీల్ల పెత్తనం తగ్గిపోతుందేమోనని భయం.

  • chandu says:

   @ చదువరి britishers entha shadistulu kakpothe prapanchamanthaa maa adhinamulo vundalani korukunnaru . mummatiki andhraa vallantha shadistulo kado teliyadu kani nuvvumu mathram shadist ve brother

   • chandu: భలే, అందితే మెజారిటీ సీమాంధ్రులు, అందకపోతే చదువరి ఒక్కడే! అయినా, నన్నొక్కణ్ణీ అంటే ఏం పర్లేదులే, ఎవరూ పట్టించుకోరు, పట్టించుకోనక్కర్లేదు కూడా.

   • chandu says:

    majority prajalu shadist avuthe andaniki nake bayam kadu kabatte analedu boss ( blog lokam lone chudu entha mandhi seemandrullu telangana support chesthunnaru )…inkaa nigurinchi antavaa adhi neeke baga telusu

 8. Srikanth says:

  A: నా మానాన నన్ను వదిలేసి వెళ్ళు, లేదంటే నిన్ను తంతాను.
  B: నీకిష్టం లేకపోయినా నాదగ్గర పడుండు, లేదంటే నిన్ను తంతాను.

  పై రెండిటిలో ఏది శాడిజం చదువరి గారు?

 9. Atal says:

  One thing is clear with the 2nd map. ఆంధ్రోళ్లు వస్తు వస్తూ హైదరాబాద్ తేలేదు కానీ, భద్రాచలం మరియు గోదావరి వెంట ఒక రెండొందల కిలోమీటర్లు భూమి తెచ్చి కలిపారు. భద్రాచలం దివిసీఒన్ అండ్ మునగాల డివిజన్ ఆంధ్ర కి కావాలి.

  నమస్తే తెలంగాణా పత్రికలో ఇంకా ఎక్కువ సమాచారం ఇచ్చారు, భద్రాచలం చర్ల దగ్గర డెబ్బయి శాతం క్వాలిటీ తో ఉన్న బొగ్గు ఉన్నాడట, ఇది అన్ద్రోల్లాడే.

  • Raj says:

   What about bellary? How about losing state capital to hyderabad for 60 years? who is going fill that loss?

   • Atal says:

    Yes, Bhallari rayachur krishnagiri, dharmapuri… all should be added to greater rayalaseema. Rayalaseem guys should get 200TMC from krishna for demerger.

 10. “ఈశాడిస్టులేం మెజారిటీ కాదండి, ఒక వర్గానికి చెందినవారే” -మీ మానసిక స్థితి, ఆలోచనా స్థాయీ నాకు బాగానే తెలుసులెండి.

  • Viswaroop says:

   >>>”మీ మానసిక స్థితి, ఆలోచనా స్థాయీ నాకు బాగానే తెలుసులెండి.”

   హి.హి..పిచ్చాసుపత్రిలో పేషంట్లు కూడా మేమే డాక్టర్లమనుకుంటారుట. రెండుకళ్ళ సిద్ధాంతంలో నీతిని జూసినోడుగుడ స్థాయిలగురించి మాట్లాడ్డమే!! అసలే మనమదో టైపు, అందులో తెలంగాణ అనుకూలనిర్ణయంతో దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయినట్లుంది.

   • సారీ, మీ మానసిక స్థితి నాకు బాగానే తెలుసనుకున్నాను. నాకు తెలిసింది చాలా తక్కువని మీ ఈ వ్యాఖ్యతో అర్థమైంది. 🙂

 11. chandu says:

  chaduvari koncham thedaa boss athanni vadileyandi

  • 🙂 ప్రస్తుతం ఈ స్థాయికి దిగజారారు. ముందు ముందు రాయబోయే వ్యాఖ్యల్లో బహుశా నాగరికులకు అందనంత లోతుల్లోకి కూరుకుపోతా రనుకుంటా. కానీండి,

 12. అయ్యా! చదువరి గారు! దేశం లోనే సంపన్న రాజ్యం గా ఉన్న హైదరాబాద్ రాజ్యంలో జీవించి,కొందరు స్వార్ధ,నపుంసక రాజకీయ నాయకుల కుట్రలతో మోసకారి,దోపిడీ,టక్కరి నక్కలాంటి ఆధ్రుల చేతచిక్కి,అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను, ఉపాధిని కోల్పోయి, సాంస్కృతికంగా, సామాజికం గా అవహేళన చేయబడిన, పెద్దమనుషుల చే దగాపడిన సగటు తెలంగాణా జీవి కడుపు మంట స్వరూపమే జై తెలంగాణా! వాదనలు ఎందుకు సార్, విడిపోదాం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s