సీమాంధ్ర ప్రజలే ప్రజలా… తెలంగాణా ప్రజలు ప్రజలు కారా? చదవండి ఇవాళ్టి ఆంధ్ర జ్యోతిలో చుక్కా రామయ్య గారి వ్యాసం

Image

ప్రజలంటే ఎవరు?

 – చుక్కా రామయ్య

తెలుగుభాషా దినోత్సవం సందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మనసులోని మాటను చెప్పాడు. దానికి అభినందనలు. ప్రజలే నిర్ణేతలని చెప్పాడు. సరైన నిర్ణయాలు పార్టీలు కాదు ప్రజలే తీసుకుంటారని ఇంకో అడుగు ముందుకేసి అన్నాడు. పాలకుల నిర్ణయాలు సరిగా లేకపోతే సెలవు ప్రకటిస్తారని కిరణ్ మాట్లాడటం హితవో, హెచ్చరికో ఏమో కానీ ప్రజలే చరిత్ర నిర్మాతలని సత్యమే పలికారు. కానీ కొన్ని పదాలు ఆ సందర్భాన్నుంచి విడదీసి అవగాహన చేసుకోవటం నా లాంటి వారికి కష్టమనుకుంటా!

గత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ ఒక రణ రంగంగా మారింది. ఒక మిలటరీ జోన్‌గా మారి ంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులకు కబాడీ గ్రౌండ్ అయ్యింది. మిలటరీ, పోలీసులు ఆడపిల్లలను కూడా విడిచి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మం జరుగుతున్న సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డి ఇదే మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు తెలంగాణను ఆదరిస్తున్నారని అనుకునేవారు. ఇప్పుడు ప్రజలు ‘చరిత్ర నిర్మాతలు’ అనే మాటలో యాభై సంవత్సరాల నుంచి యమ బాధలు పడుతున్నటువంటి ప్రజలలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారా? ఉంటే ఆనాడు ఏ పాలకులూ తెలంగాణపై కనీస సానుభూతి కూడా చూపించ లేదే, తెలంగాణ సమస్యను ఆలోచించడానికి కూడా సిద్ధపడలేదే! ఈనాడు ముఖ్యమంత్రిగారు ప్రజలే నిర్ణేతలని చెప్పటం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నారా? లేక ఇప్పుడు జరుగుతున్న సంఘటలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు రగులుతున్నాయి.

1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలిపారా? లేక తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను రెండిటిని ఐక్యం చేశారా? తెలంగాణలో నివశించే ప్రజలు కూడా మనుషులే మరి! ఆంధ్రలో నివశించే వారు కూడా ప్రజలే. కానీ ఒక ప్రాంతం పరిపాలనా యం త్రాంగాన్ని రెండో ప్రాంతంపై రుద్దితే ఆ ప్రజలలో అంతస్థులు రావా? అంతరాలు పెరగవా? ఈ అంతరాల సమాజంలో సమైక్యత వస్తుందా? మానవతా దృష్టితో పాలకుల మొగ్గు పీడిత ప్రజానీకం వైపు ఉండాల్నా లేక అవకాశవాదంతో పీడిత ప్రజల రక్తం పీల్చే శక్తుల వైపు ఉండాల్నా? ఈ రెంటి మధ్యలో ఏ ప్రాంతం వారు ప్రజలుగా కనిపిస్తున్నారో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేస్తే బాగుండేది. నర్మగర్భంగా మాట్లాడితే అలాంటి మాటల్ని ఒక ప్రాంతం అపార్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దారిద్య్రం అనుభవిస్తూ, అభివృద్ధికి నోచుకోని తెలంగాణ ప్రాం తం నుంచి వనరులను తరలిస్తుంటే ఆ ప్రజల గుండె ఎలా కొట్టుకుంటుంది? వారి గుండె దడ ప్రభుత్వాలకు వినరాకుంటే ఆ ప్రజలు తమకు తాము పౌరులనుకుంటారా? లేక నైజాం దత్తతగా ఇచ్చిన బానిసలనుకుంటారా?

తెలుగు భాష పేరిట ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పరచామని 50ఏళ్ళగా వల్లె వేస్తున్నారు. నైజాం రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు అధికార అండ లేకున్నా తెలుగుభాషను తమ కడుపులో పెట్టుకుని శిశువుని కాపాడినట్లు కాపాడలేదా? అలాంటి ప్రజలభాషను హేళన చేస్తుం టే ఆ ప్రజల మనస్సు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించండి. ఇప్పటివరకు సమైక్యత పరదాల కింద ఉంచి మమ్ములను తెలుగు ప్రజలం కాదా అనే అనుమానానికి తెలంగాణ ప్రజలను తీసుకువచ్చారు. ప్రపంచంలో అభివృద్ధి గల ప్రాంతాలు, అభివృద్ధి నోచుకోలేని ప్రాంతాలు కలిసి ఉండలేనప్పుడు మా భవిష్యత్‌ను మేం నిర్ణయించుకుంటామని అనడం వేర్పాటు వాదమా? సింగపూర్, మలేషియాలు కలిసుండేవి. ఆ రెండు దేశాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసముండటం వలన వారు వేరు పడలేదా? ఆ ఇరు ప్రజలు తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేదా? చరిత్రలో ప్రపంచంలో ఇలాంటి ఎన్నో దేశాలు విడిపోయి అభివృద్ధి చెందటం లేదా? ఒక వెనుకబడిన ప్రాంతం ప్రజలపై నిర్లక్ష్యం వహించటమే గాక తెలంగాణ గాయంపై కారం చల్లటం అన్యాయం కాదా? రెం డో ప్రాంతంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని చూసి ముఖ్యమంత్రి ప్రజలే నిర్ణేతలనటం, అంటున్నందుకు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు ప్రజలు? ఎవరు ప్రజలు కారు? ఎవరు పౌరులు? ఎవరు బానిసలు? ఎవరు పీడితులు? ఎవరు పీడకులు? అధికారంలో కూర్చున్నవారికి ధర్మం ప్రధానం. న్యాయం ముఖ్యం. ధృతరాష్ట్రునికి కౌరవులు, పాండవులు ఇరువురూ ప్రజలే. ధృతరాష్ట్రునికి ఎవరు ప్రజలో బాగా తెలుసు. ఒక కీలక నిర్ణయ సమయంలో ముఖ్యమంత్రి నర్మగర్భపు మాటలు ప్రజలు అర్థం చేసుకుంటారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వబోతున్నామని కేంద్రం ప్రకటించింది. సీడబ్ల్యూసీ తీర్మానించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, సదరు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి పార్టీ ఒక్కటే కదా! తన పార్టీని తామే నిందించుకునే అవకాశం, వెసులుబాటు కిరణ్‌కు ఉండవచ్చును. కానీ తెలంగాణ ప్రజల చరిత్ర తెలిసి కూడా ఆ ప్రజలను తక్కువచేసి మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. మా బతుకంతా పోరాటాలతోనే గడిచిపోయింది. యవ్వనమంతా నిజాంవ్యతిరేక పోరాటంలో కరిగిపోయింది. తెలంగాణ ఈ 60ఏళ్లలో నిత్యం గాయాల కుంపటిగానే ఉంది. ఈ సమస్య పరిష్కారం దగ్గరకు వచ్చే సరికి రెండు ప్రాంతాల మధ్య తూకంవేసి మాట్లాడటం పాలకుల విచక్షణకు సంబంధించినది. తెలంగాణ ప్రజల పోరాటచరిత్ర ప్రపంచానికి తెలుసు. రెండు ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికైనా ఎప్పటికైనా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడవలసిందే. రెండు ప్రాంతాల ప్రజలను ఒకరిపై ఒకరిని ఉసిగొలుపకుండగా పెద్ద మనిషిగా పాలకులు వ్యవహరించాలి.

తెలంగాణలో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు కూడా ప్రజలే చరిత్ర నిర్మాతలని కిరణ్ అని ఉంటే బాగుండేది. అప్పుడు పెదవి విప్పని నేతలు ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి ప్రజలే నిర్మాతలని కిరణ్ అనడం ఎంతవరకు సరై ంది? అవును, ప్రజలే చరిత్ర నిర్మాతలు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసులే కొత్త చరిత్ర నిర్మాతలు. ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న వాళ్లే జనం పక్షం వహించే పాలకులు అవుతారు.
– చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు

ఆంధ్ర జ్యోతి 04-09-2013 సౌజన్యం తో..

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/09/04/ArticleHtmls/04092013004007.shtml?Mode=1

 

 

.

Advertisements
This entry was posted in Telangana and tagged , , . Bookmark the permalink.

9 Responses to సీమాంధ్ర ప్రజలే ప్రజలా… తెలంగాణా ప్రజలు ప్రజలు కారా? చదవండి ఇవాళ్టి ఆంధ్ర జ్యోతిలో చుక్కా రామయ్య గారి వ్యాసం

 1. పెద్దలు చుక్కా రామయ్యగారి వ్యాసం ఎంతో ఆలోచనాత్మకంగా,ఆర్ద్రంగా సమతుల్యంగా ఉంది!తెలంగాణా ఉద్యమాన్ని తెలంగాణా ప్రజలను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసి,సీమాంధ్ర మాధ్యమాలను ఉపయోగించుకొని నోటికొచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ పట్టపగ్గాలు లేకుండా విర్రవీగుతున్నారు!సహజన్యాయాన్ని,సామాజిక ధర్మాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిసున్నారు!చివరికి న్యాయం జయించి తీరుతుంది!హైదరాబాద్ రాజధానిగా తెలంగాణా ౧౨౫ రోజుల్లో ఏర్పడుతుంది!కేంద్రం తెలంగాణా బిల్లును హోం శాఖనుంచి న్యాయశాఖకు పంపింది!వారం రోజుల్లో తన పరిశీలనను పూర్తి చేసి హోం శాఖకు పంపుతుంది!మొత్తం మీద కేంద్రం తెలంగాణా రాష్ట్ర బిల్లును వేగవంతం చేసింది! కనుక ఈ అనిశ్చితికి తెర పడి రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది!

 2. ఈ చుక్కా రామయ్య అనబడే వ్యక్తి ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులుగా చెలామణీలోకి రావటానికి కారణం ఆయన ట్యూషన్ల మీద సొమ్ములు సంపాదించుకుంటూ ఎదగటమే. ఎలాగో‌ అలా పేరొచ్చిన ప్రతీవ్యక్తీ మేథావియే కదా మనదేశంలో! వాళ్ళేం‌ మాట్లాడుతున్నా రన్నది పక్కన బెట్టి, వాళ్ళేం‌ మాట్లాడినా అది పత్రికలు కళ్ళకు అద్దుకుంటాయి – సేల్స్ వాల్యూ ఉంటుందని. అంతే. ఈ‌యన ఒక్కరే‌కాదు ఇలా చాలామందికి ఇదే కారణంగా చెలామణీ.

  ఈ‌ వ్యాసంలో అలోచించదగ్గ విషయాలూ ఉన్నాయి. అభ్యంతరకరమైన మాటలూ ఉన్నాయి. సీమాంధ్రప్రజలను తప్పుపట్టటమూ ఉంది. నిర్ణయం జరిగిపోయింది – అది మాకు నచ్చింది కాబట్టి ఇంకెవరూ‌ మాట్లాడటం ఒప్పుకోం అన్న పధ్దతీ ఉంది. వెరసి ఒక సాధారణ రాజకియ వ్యాసం. కొత్త విషయాలేం‌ లేవు.

  ఏదో‌ఒక వైపు మొగ్గు ఉన్న మసస్తత్త్వంతో చదివితే, మనకి అనుకూలంగా వ్రాసిన ప్రతీదీ అద్భుతంగా ఉండటం, కాని పక్షంలో దరిద్రంగా ఉండటం వింత కాదు.

  ఈ‌ వ్యాసం ప్రయోజనం‌అల్లా తన పక్షానికి గళం అందిచటమే ఐతే అది ఆయన బాగానే చేసారు. నిష్పాక్షికంగా విశ్లేషించటం ఐతే అది ఆయన చెయ్యలేదు – చెయ్యగలరో‌ లేదో అన్నది వేరే విషయం. ఈ‌ వ్యాసం మీదా బోలెడు చర్చ చేయవచ్చును. కాని అనవసరం, అందరూ గోల గోలగా తమ వాదాలు వినిపించటం తప్ప ఎదుటివాడి మాట వినేందుకు సిధ్ధంగా లేని వాతావరణంలో ఇలాంటీ ప్రయత్నాలు నిరుపయోగం.

 3. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశాలు అనుమానాస్పదమో కాదోగానీ, చుక్కా రామయ్య గారి ఉద్దేశాలు మాత్రం అనుమానాస్పదంగానే ఉన్నాయి.

  రాష్ట్రాన్ని విభజిస్తే, ఇరు ప్రాంతాల్లోను ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో, వాళ్ళకు ఏయే సమస్యలు వస్తాయో, వాటిని ఎలా పరిష్కరిస్తామో చెప్పాల్సిన బాధ్యత, అవసరం ప్రభుత్వాలకు లేవా? అది తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు లేదా? వాటి సంగతి ఏమీ మాట్టాడకుండా చీల్చేస్తాం అని తేల్చేస్తే ప్రజలూరుకుంటారా? వాళ్ళ గుండెచప్పుడు వినాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? రామయ్యగారు వీటి గురించి మాట్టాడరేంటి? తెలంగాణ ప్రజలకు మాత్రమే గుండె ఉంది, సీమాంధ్రులకు గుండె లేదని చుక్కారామయ్య గారు భావిస్తున్నట్టున్నారు.

  “..అభివృద్ధికి నోచుకోని తెలంగాణ ప్రాంతం ..” అని కూడా రామయ్య గారు అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో వెనకబడిలేదని శ్రీకృష్ణ కమిటీయే తేల్చి చెప్పింది. గణాంకాలు చెబుతున్నై. అలాంటిది రామయ్యగారు తెలంగాణ అసలు అభివృద్ధికి నోచుకోనేలేదని (వెనకబడ్డం కూడా కాదు) చెప్పెయ్యడం చూస్తుంటే వారి పక్షపాత వైఖరి తెల్లమౌతోంది.

  ’చుక్కా రామయ్య’ అనేది ఐఐటీలో చదవాలనుకునే కుర్రాళ్లకి ఒక బ్రాండు. వ్యాపార ప్రయోజనాల కోసం ఆ బ్రాండును వాడుకోవచ్చు. కానీ, అబద్ధాలను ప్రచారం చేసేందుకు వాడుకుంటే ఎలా?

  • chandram says:

   అయ్యా చదువరి గారు , శ్రీ కృష్ణ కంమిట్టే హైదరాబాద్ ని కలుపుకుని తెలంగాణా లో అభివ్రుది వుంది అని చెప్పింది, అదే కంమేట్టే TG ప్రజల స్వయం పాలన ఆకాంక్షని కూడా చెప్పింది.
   అసలు సీమంద్రులకు తెలంగాణా అనే పదమే నచాడు. TG ప్రజల ఆకాంక్షకు విలువే లేదు. TG ప్రజల ని తొక్కి పెట్టి ఉంచే నేతలకే మీ వోట్ . అక్కడే తెలుస్తుంది మీకు మీ సహా తెలుగు జాతి మీద ఎంత గౌరవమో.
   TG రాష్ట్రము ఏర్పడితే కోస్త కు వాటర్ రావు అనే భ్రమ లో తెలుగు జాతి అనే ప్రేమ ఒలకబోసి సమైఖ్యాంధ్ర అనే బూతు పదాన్ని సృష్టించారు . నేను ప్రెమించను మొర్రో అనే యువతీ ని వెంటపడి ఎదిపిస్తున్నట్లు గ వుంది మీ ఉద్యమం. ఆంధ్ర రాష్ట్రం కొరకు పోరాడిన పొట్టి శ్రీ రాములు గారిని మొత్తం యావత్ AP కి మహనీయుడు గ మార్చారు. AP లో TG ప్రజలకి సమన్యాయం అనేది మిధ్య అని అనేక సార్లు నిరూపితమైంది. అందుకే TG అనేది చారిత్రక అవసరం.

   • 1. అత్యుత్తమ పరిష్కారం సమైక్య రాష్ట్రమని అదే కమిటీ చెప్పింది.
    2. తెలంగాణ అనే పదమే సీమాంధ్రులకు నచ్చదని ఆరోపించారు. సమైక్యాంధ్ర అనేది బూతు పదమనీ అన్నారు. అవతలి వాళ్ళ మీద గౌరవం లేనిదెవరికో మీ మాటతోటే తెలుస్తోంది.

  • chandu says:

   aksham meedha vummivesthe emthundhi

   • chandu says:

    srikrishnaa ne oppukunadu kada Kendram ela ivvamante ala itchananni …. inkaa dantlo emundhi chepukovadaniki … telangana venuka baddadhi eppudu kadu ( adbuthamina rendu nadulu pravahisthunna nela ,, aparaa kanijalu …adbuthaminaa nela vundagaa maa thathalu rakthamu tho nijam kattina hyderabad vundagaa )…. telangana prajalu venukubaddaru telangana sampadha meedha eppudu telangana prajalalku hakku ledu , adikaram ledu
    telangana sampdha meedha gabbilala vale appudu nijamode ippudu semmandhrodu anubavisthunnadu

  • chandu says:

   రాష్ట్రాన్ని విభజిస్తే, ఇరు ప్రాంతాల్లోను ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో, వాళ్ళకు ఏయే సమస్యలు వస్తాయో, వాటిని ఎలా పరిష్కరిస్తామో చెప్పాల్సిన బాధ్యత, అవసరం ప్రభుత్వాలకు లేవా? అది తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు లేదా? వాటి సంగతి ఏమీ మాట్టాడకుండా చీల్చేస్తాం అని తేల్చేస్తే ప్రజలూరుకుంటారా? వాళ్ళ గుండెచప్పుడు వినాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? రామయ్యగారు వీటి గురించి మాట్టాడరేంటి? dhani gurunchi evaru matldavaddu annaru thappakundaa matladavachu… telangana vadulu dhaniki siddam gaa vunnaru ,, kendra prabuthvam kudaa pade pade adhe cheputhundhi …….. no memu mee matalu vinnamu maa kinda telangana vadu padi vundale ani meeru antunnaru .. kani telangana vallu kani kendram kani andam ledu … malli malli prajalu antaru meeku seemadhru le prajala telangan vallu prajalagaa kanipinchraaa oaknitho balvantha gaa kalupukone hakku meeku evaru itcharu

 4. Vishwam says:

  seemandhra prajala durahankaraniki idoka nidarshanam. Jai Telangana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s