తెలుగుతల్లి గర్భ సంచిలోంచి పుట్టిన ఉద్యమమట…!

Image

ఏ ఉద్యమమైనను ఎచటినుంచి ఉద్భవించును?
సాధారణముగ అన్యాయమునుంచి ఉద్భవించును.
దోపిడీ దుర్మార్గములనుంచి ఉద్భవించును.

కొండకచో అపోహలనుంచి, అబద్ధపు ప్రచారములనుంచి, ఉన్మాదమునుంచి ఉద్భవించును.
కానీ ఒక స్త్రీ మూర్తి గర్భ సంచి నుంచి ఉద్యమము ఉద్భవించునా?
అది సంభవమేనా?!

కృష్ణవేణీ నదీతీరమున ఒక ఘనాపాటి గారు
సీమాంధ్ర ఉద్యమము పెట్టుబడిదార్ల డబ్బు సంచులలోంచి ఉద్భవించినది కాదు-
తెలుగుతల్లి గర్భ సంచి నుంచి ఉద్భవించిన ఉద్యమము అని ఢంకా భజాయించి వాకృచ్చినాడు.
పైత్యము ప్రకోపించినప్పుడు నోటినుంచి ఇటువంటి మాటలే వెలువడును. .

నిజమునకు తెలుగు తల్లి అనునది ఒక భావన.
తెలుగు భాషకు ఒక అందమైన ప్రతీక.
దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగువారు గొప్పలు చెప్పుకుందురేగానీ
తమిళులు, కన్నడిగులు, మరాఠీలు తదితర ఇరుగుపొరుగు భాషలవారికి వున్నట్టి భాషాభిమానము తెలుగువారికి లవలేశము కూడా లేదు.

తొలి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రమని ఊరక జబ్బలు చరచుకొనిన నేమి ప్రయోజనము?
ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఆరు దశాబ్ధములు కావస్తున్ననూ తెలుగును అధికార భాషగా అమలు చేసుకోలేకపోయిన అర్భకులు తెలుగువారు.
తమిళనాడును, కర్ణాటకమును, మహరాష్ట్రమును చూసియైనను తెలుగువారు తెలివిడి తెచ్చుకొనలేదు.

తెలుగు తల్లి అ లంకారప్రాయంగా మల్లెపూ దండలు సమర్పించి ఆంధ్రదేశమును ఆంగ్లభాషలో పరిపాలించుట ఎంతటి దౌర్భాగ్యము.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకొనేవాడిని ఎవరు మేలుకొల్పగలరు?

ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రములు ఏకమై షష్టి పూర్తి కావస్తున్ననూ ఇరు ప్రాంతముల మధ్య ఏమాత్రము భావ సమైక్యత ఏర్పడకపోవుటకు కారకులెవ్వరు?

తెలుగు తల్లిని చీల్చకూడదట.
తెలుగు తల్లిని ముక్కలు చెక్కలు చేయకూడదట.
తెలుగు తల్లికి గర్భశోకం కలిగించకూడదట.
వహ్వా తెలుగువాడా ఎంత తెలివైనవాడవురా నీవు!
తెలుగు తల్లి భాషకు ప్రతీక కదా.

ఆంధ్ర ప్రదేశ్‌ రెండు రాష్ట్రములుగా విడిపోయినంత మాత్రమున తెలుగు తల్లి చీలిపోతుందా?
తెలుగు భాష అంతరించి పోతుందా? తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందా?
తమిళనాడులో వున్న తెలుగువారికి తెలుగు తల్లి తల్లి కాదా?
కర్ణాటకలో, ముంబయిలో, ఢిల్లీలో, ఖరగ్‌పూర్‌లో, కలకత్తాలో, అమెరికాలో దేశ దేశాలలో వుండే తెలుగు వారికి తెలుగు తల్లి తల్లి కాకుండా పోతుందా?
తెలుగుతల్లి కేవలం ఆంధ్రప్రదేశలో వున్నవారికే తల్లా?
ఏమి ఈ వింత వాదన.

ఆమె గర్భ సంచిలోంచి ఉద్భవించిన ఉద్యమము తెలంగాణలోని తెలుగువారి ఆకాంక్షను చిదిమివేయాలని చూడడం న్యాయమేనా?
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు 1956కు ముందు వేరువేరుగా లేవా?

తెలుగుతల్లిని ఉత్సవ విగ్రహంగా మార్చి, తమ రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాలకు దిష్టిబొమ్మగా చేసుకుని పెట్టుబడిదార్లు ఎంత కాలం ఈ దొంగ నాటకాలు ఆడగలరు, ఆడించగలరు?

అమ్మా తెలుగు తల్లీ,
ఈ రావణ కాష్టాన్ని చల్లార్చి …
రెండు ప్రాంతాలు స్నేహపూర్వకంగా విడిపోయి,
సోదరభావంతో కలసి వుంటూ రెండు రాష్ట్రాల్లో తెలుగు వెలుగులు విరాజిల్లేలా…
రెండు రాష్ట్రాల్లోనూ తెలుగును అధికార భాషగా అమలు పరిచేలా ఆశీర్వదించు తల్లీ.

తెలుగు జాతి మనదీ
రెండుగ వెలుగు జాతి మనదీ…!

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

8 Responses to తెలుగుతల్లి గర్భ సంచిలోంచి పుట్టిన ఉద్యమమట…!

 1. తెలుగు జాతి మనదీ
  రెండుగ వెలుగు జాతి మనదీ…!

  బాగుందండీ, అవసరాన్ని బట్టి మాటలూ మారతాయి, పాటలూ‌మారతాయీ అంటున్నారు.
  రేపు మరొకరు

  పన్నెండుగ వెలుగు జాతి మనదీ

  అనరని నమ్మకం లేదు!

  • J T Bandagi says:

   నిజమేనండి శ్యామలరావు గారూ
   రేపటి తరాలు పన్నెండు అనొచ్చు
   ఇరవై రెండు అనొచ్చు.
   లేదంటే ఒకటే దేశం ఒకటే రాష్ట్రం అని అన్ని రాష్ట్రాలనూ రద్దు చేయవచ్చు.
   రేపటి సంగతి ఇప్పుడేందుకు కానీ
   ప్రస్తుతానికి ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలు
   1956 నవంబర్ 1కి ముందరి లాగా
   డీ మెర్జర్ (విలీనం రద్దు) అయితే
   రెండు ప్రాంతాలకూ మంచిది .
   ఏమంటారు?

 2. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెట్టుబడిదార్ల డబ్బుసంచుల్లోంచి కాదు తెలంగాణాతల్లి గర్భసంచిలోంచి పుట్టింది —అని తెలంగాణా బిడ్డలు కూడా అనవచ్చును కదా!అంతేకాదు రాయలసీమ తల్లి గర్భసంచినుంచి—అని సీమ బిడ్డలు అనరని గ్యారంటీ ఉందా?గత పదమూడేళ్ళుగా తెలంగాణా అట్టుడుకుతోంది!ఎన్ని సమ్మెలు,ఎన్నెన్ని ఆత్మబలిదానాలు!!తెలంగాణా ఉద్యమం కడుపునిండిన ఉద్యమం కాదు కడుపు మండిన ఉద్యమం!విలీనం రద్దు (DE MERGER )ఉద్యమం!తమది కానిది ఏదీ తమకు వద్దు!తమదైనది ఏదీ ఊపిరిపోయినా వదలుకోని ఉద్యమం!న్యాయబద్ధమైన ధర్మసమ్మతమైన మహోద్యమం!హైదరాబాద్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు తెలంగాణా బిడ్డలు!తెలంగాణా రాజధాని హైదరాబాద్!తెలంగాణా గుండెకాయ హైదరాబాద్!కర్నూల్ కంటే పచ్చపచ్చగా ఉందని అక్కడి గుడారాలన్నీ పీకేసుకొని తగుదునమ్మా అని హైదరాబాద్ వచ్చింది ఎవరు? సీమాంధ్ర పెట్టుబడిదారులు తాము పుట్టిన జిల్లాలోనే పెట్టుబడులు పెట్టుకొని అభివృద్ధి చేసుకోవలసింది!హైదరాబాద్ లో ప్రభుత్వం ఇవ్వజూపిన రాయితీలకు,భూవసతికి ఆశపడి కొంతమంది పెట్టుబడులు పెట్టారు కాని తెలంగాణా ప్రజలను ఉద్ధరించడానికి దీక్షాక౦కణబద్ధులై రాలేదుకదా!ఆంధ్రసీమ రాజధాని ఏర్పడీ ఏర్పడగానే పెట్టుబడి సంచులు పట్టుకొని మళ్ళీ అక్కడ భూములు రాయితీలు మొట్టమొదట పొందేది సీమాంధ్ర పెట్టుబడిదారులేకదా!కర్నూల్ రాజధానిగా ఒకవేళ అల్లాగే కొనసాగి ఉంటే తెలంగాణా వాళ్ళు అది మాకేకావాలని అడిగేవారు కానేకాదు!మీరు వ్రాసిన టపా ఉదయరాగమే కాదు హృదయరాగం కూడా!

  • J T Bandagi says:

   ధన్యవాదాలు సూర్యప్రకాష్ గారూ,

   ఈ పోలిక కొంత హార్ష్ గా ఉండొచ్చు కానీ –
   వాళ్ళ అభివ్రుధ్ధి వాదన వింటుంటే ఇదే గుర్తుకొస్తోంది:
   వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం ఒక కుక్క నీడ కోసం ఎడ్ల బండి కింద చేరి
   చల్లగా నడుస్తూ ఆ ఎడ్ల బండి ని తానే లాగు తున్నట్టు ఆపసోపాలు పడిపోయిందట.
   బతుకు దెరువు కోసం వచ్చి తెగ బాగు పడి
   తెలంగాణాను ఉధ్ధరించడానికి ఏదో త్యాగాలు చేసినట్టు
   దాంబికాలు పలకడం వీళ్లకే చెల్లింది.
   తెలంగాణా సమాజం చైతన్య వంతమయింది
   ఇక ఈ అన్యాయాలు, నఖరాలు ఎంతోకాలం నడవవు.

 3. sreerama says:

  same adhae abhddaalu. oka vaipu sodarulu antunae, visham, vidwesham. paapam, ippudu inthaga pogudutunna Nizam ni vantaadi, vedinchi himsala paalu chaesaaru. ippudu same treatment for co andhra people. this is your naijam.thats why Nizam never allowed you into the Hyderabad. Dont forget that. you were limited o the fringes. You could not talk in your language. Now you are boasting your culuture of biryani, sherwani, khawwali only. does that mean you did not have naything before that.you cant live in the State of Hyderabad of pre1956. You know pretty well what was your status then for 300 years.Slavery, nothing but slavery.

  • J T Bandagi says:

   ఏం జెప్పినవ్ తమ్మీ !
   వాహ్.. వారేవా… ! ఏక్దమ్ జబర్దస్త్ గున్నది పో !!
   మా సంగతి సరే నువ్వేం భాషల మాట్లాడుతున్నావ్.
   నీ తెలుగు తల్లి కల్చర్ గిదెనా?
   నిజమే
   నిజాంను, రజాకార్లను, దొర లను జమీందార్లను
   ఎదిరించిన తెలంగాణా బిడ్దలం మేం.
   వాళ్ళను వదిలించు కొంగనే
   ఇగో భాయి భాయి అనుకుంట వచ్చిన
   ఈ ఆంధ్ర రజాకార్లు మొపయిమ్ డ్లు.
   గీ బానిసత్వం ను వదిలించుకోడానికే మా పోరాటం .
   మీ సొమ్ము దొబ్బ డానికి మాత్రం కాదు. !!

  • Pradeep says:

   yes ra bhai, we were under slavery and we fought for our freedom. there is nothing wrong in fighting to protect your things. any one with minimal sense would understand how Hyderabad is related to Telangana. only mindless goons like you think that a place which is at the center of a region doesn’t belongs to the region. we were ruled badly by Nizams but before that itself Hyderabad and Telangana were together. go and get some life instead of crying and eyeing on other’s things.
   if a guy fights for his rights or his own things, there is dignity in it and if a guy cries or wants other’s things that either called begging or cheating.
   one thing is final ra bhai, we don’t want to live with the people who have b..l s..t traditions like recording dance.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s