హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఇటుకలు మోసిన కూలీలెవ్వరు?

Imageహైదరాబాదును ఎవరు అభివృద్ధి చేశారు ?
చెన్నయ్‌ నగరమును ఎవరు అభివృద్ధి పరిచారు ??
భారత రాజధాని ఢిల్లీ అభివృద్ధికి కారకులెవ్వరు ???
ఎవరి అవిరళ కృషి వలన అమెరికా అభివృద్ధి పథమున పయనించుచున్నది ????
ఈ నాలుగు ప్రశ్నలకూ ఒకే సమాధానము:
”సీమాంధ్రులు!”

సీమాంధ్రులు తమ రక్తమాంసములు ధారవోసి ధారవోసి….
తమ చెమటతో సిమెంటును తడిపి తడిపి….
ఇటుక ఇటుకను పేర్చి పేర్చి హైదరాబాదు నగరమును అభివృద్ధి పరచినారు !!
ఆనాడు ఇటులనే చెన్నయి మహా నగరమును వారే అగ్రగామిగ తీర్చిదిద్దినారు !!!
అదేవిధముగ వారు చెల్లించు కప్పములతోనే హస్తినాపురము అ లవికానంతగా అభివృద్ధి చెందినది !!!
సీమాంధ్రులు పెద్ద మనసుతో సప్త సముద్రములు దాటి వలస పోయి –
అహోరాత్రములు శ్రమించుట వలననే అమెరికా నేడు యావత్‌ ప్రపంచమున అగ్ర రాజ్యముగ అ లరారుచున్నది !!!
కాదందురా?!
ఎవరో కాదనిన సీమాంధ్రులు ఒప్పుకొందురా?
అసంభవము.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన నాటి నుంచి హైదరాబాదు అభివృద్ధి అత్యంత ప్రాధాన్యతాంశమైనది.
అసలు అభివృద్ధి అనగా నేమి?
అభివృద్ధి అనగా డవలప్‌మెంటు !
డవలప్‌మెంటు అనగా అభివృద్ధి !!

సీమాంధ్రులు అడుగుపెట్టకముందే హైదరాబాదు ఎంతో అభివృద్ధి చెందిన నగరమని…
అందుకే సీమాంధ్రులు లాబీయింగ్‌ చేసి తమ గుడారముల రాజధాని కర్నూలును విసర్జించి హైదరాబాదుకు తరలి వచ్చినారనేది
తెలంగాణ ప్రజల వాదన!
తాము రాకముందు హైదరాబాదు రాళ్లు రప్పలతో, దుబ్బ ధూళితో కళావిహీనముగ వున్నదని తామే ఇటుక ఇటుక పేర్చి దానిని అభివృద్ధి పరిచినామనేది సీమాంధ్రుల వాదన!

ఇందులో ఏది వాస్తవము? ఏది అవాస్తవము?
రెండింటిలోనూ వాస్తవమున్నది. అయితే

1956కు ముందు జరిగిన అభివృద్ధి ప్రభుత్వ రంగ అభివృద్ధి, ప్రజలపరంగా జరిగిన అభివృద్ధి.
1956 తరువాత జరిగిన అభివృద్ధి ప్రైవేటు రంగ అభివృద్ధి, వాణిజ్యవేత్తల పరంగా జరిగిన అభివృద్ధి.
1956 తరువాత జరిగిన అభివృద్ధికి తార్కాణంగా కార్పొరేట్‌ అసుపత్రులు, హైటెక్‌సిటీ, కార్పొరేట్‌ కాలేజీలు మాత్రమే కనిపిస్తాయి.
ఆరోగ్యవంతమైన వేసవి విడదిగా, చెరువులు తోటలతో అ లరారే నగరంగా పేరు గాంచిన హైదరాబాదు కాలుష్య కాసారముగ మారినది.

ఈనాటి అన్ని ప్రజా సౌకర్యములు 1956కు ముందునుంచి వున్నవే. ఆనాడు ఈనాడు కూడా హైదరాబాదు యావత్‌ భారత దేశంలో ఐదవ పెద్ద నగరం.

ఈ కింద పొందుపరచిన కొన్ని అంశములను పరిశీలించినచో సత్యము బోధపడును:

1870లో హైకోర్టు ఏర్పాటు 1920లో ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణం
1882 చంచల్‌గూడా జైలు నిర్మాణం
1874 నిజాం స్టేట్‌ రైల్వేస్‌ ఏర్పాటు
1883 నాంపల్లి స్టేషన్‌ నిర్మాణం
1873 పబ్లిక్‌ గార్డెన్‌
1892 అసఫియా స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ
1919 విఎస్‌టి ఫాక్టరీ
1920 ఉస్మాన్‌ సాగర్‌
1929 డి.బి.ఆర్‌ మిల్లు
1932 దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వరంగంలో ఆర్టీసీ ఆవిర్భావం
1942 హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంకు
1942 హైదరాబాద్‌ ఆల్విన్‌ మెటల్స్‌
1946 హైదరాబాద్‌ ఆస్బెస్టాస్‌
1943 హైదరాబాద్‌ ప్రాగా టూల్స్‌
1890 యునానీ హాస్పిటల్‌
1894 మెడికల్‌ కాలేజ్‌
1897 ఎర్రగడ్డ మెంటల్‌ హాస్పిటల్‌
1905 జిజ్గి ఖానా ప్రసూతి హాస్పిటల్‌
1916 హోమియోపతి కాలేజ్‌
1927 చార్మినార్‌ యూనాని, ఆయుర్వేదిక్‌ ఆసుపత్రులు
1925 ఉస్మానియా హాస్మిటల్‌, గాంధీ హాస్పిటల్‌, టీబీ హాస్పిటల్‌, నిమ్స్‌,
కోరంటి హాస్పిటల్‌ (అన్నీ ప్రభుత్వ వైద్యశాలలే)
1874 నిజాం కాలేజ్‌
1920  సిటీ కాలేజ్‌
1920 ఉస్మానియా యూనివర్సిటీ
1921 ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌
1923 హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (జాగిర్దార్‌ కాలేజ్‌)
1926 హిందీ విద్యాలయ

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
కావున సీమాంధ్రులు హైదరాబాదు నగరము విషయమున మడతపేచీ పెట్టి సమస్యను సాగదీసి ఇరు ప్రాంతముల మధ్య విద్వేషములు పెరుగనివ్వకుండా సత్వరమే కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి ప్యాకేజీ కోసం పోరాడి తమదైన ఒక గొప్ప అత్యాధునిక నగర నిర్మాణమునకు నడముబిగించుట ఉభయ ప్రాంతములకు శ్రేయస్కరము.

ఏమందురు?

Advertisements
This entry was posted in Telangana and tagged , , , . Bookmark the permalink.

6 Responses to హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఇటుకలు మోసిన కూలీలెవ్వరు?

 1. nagarjuna says:

  http://en.wikipedia.org/wiki/List_of_institutes_funded_by_the_Central_Government_of_India

  9/9 central govt institutions in AP are placed in telangana. Brother , plz dont spread hatred. we can have many states, blaming others is not the way.

 2. nagarjuna says:

  if you have patience plz see this : http://www.youtube.com/watch?v=TWHZ42bOtdk

  let there be 2 states, but not hatred.

  • J T Bandagi says:

   నాగార్జున గారూ
   ఆంధ్రాతో కలవక ముందే సర్వతోముఖంగా అభివృధ్ధి చెందిన హైదరాబాద్
   ప్రత్యేక రాష్ట్రంగా వుంటె మరింత బ్రభ్మాండంగా అభివౄధ్ధి చెంది వుండేది.
   ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ అప్పుడూ వచ్చి వుండేవి.
   లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి, భౌగోళికంగా సురక్షిత ప్రదేషం కావదం వల్లనే
   అందరూ హైదరాబాద్ ను ప్రిఫర్ చెస్తున్నారు.
   ఇక మీ ప్రాంతం లో దొరికిన వజ్రాలతోనే హైదరాబాదు, భారత దేషం, సమస్థ భూమండళం
   అభివౄధ్ధి చెందిందనె వాదన హాస్యాస్పదం, అదొక ఆధిపత్య పైత్యం.

 3. veeraiah says:

  అవును. మీరు అభివృద్ధి చేశారు కాదా.
  అమెరికా ను రాజధాని పెట్టుకొండి, లేదా ఢిల్లీ , లేదా చెన్నయ్‌.

  హైదరాబాదును ఎందుకు కాదా ? ?

 4. J T Bandagi says:

  ఇది “తెలుగు జాతి ఆత్మ గౌరవం” నవీన్ కుమార్ సంపత్ గారి కామెంట్:
  ఎందువల్లనో కామెంత్ బాక్స్ లొ రాలేదు:

  హైదరాబాద్ అందరి సొత్తంటున్నారు.
  హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు.
  మిగిలిన తెలంగాణ జిల్లాలు సమైక్యంలో భాగం కాద?.
  అసలు సమైక్యమంటే ఏమిటి? కేవలం హైదరాబాద్‌ను కోరుకోవటం సమైక్యమవుతుందా?
  ఒక వెళ హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమాంధ్రలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో భావోద్వేగాలు లేవూ.వుందల్లా హైదరాబాద్ కాద? మరి ఎది తెలుగు జాతి సమైక్యత?

  – తెలుగు జాతి ఆత్మగౌరవం.
  naveenkumarsampath@gmail.com

 5. Reblogged this on Words of Venkat G and commented:
  Very Well Said about Hyderabad Past and the stretched thinking and argument of Seemandhra about Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s