సమైక్యత అనగా నేమి? సమైక్యత అనగా ఒక్క చేతితో చప్పట్లు కొట్టు ఒకానొక వింత ప్రక్రియ. సీమాంధ్ర ప్రాంతములో తప్ప ఈ ప్రక్రియ ప్రపంచములో మరెక్కడనూ కానరాదు.

సమైక్యత అనగా నేమి?

సమైక్యత అనగా ఒక్క చేతితో చప్పట్లు కొట్టు ఒకానొక వింత ప్రక్రియ.
సీమాంధ్ర ప్రాంతములో తప్ప ఈ ప్రక్రియ ప్రపంచములో మరెక్కడనూ కానరాదు.
అదియే దీని విశిష్ట లక్షణము.

పూర్వకాలమున సమైక్యతకు గల అర్థము వేరు – ప్రస్తుత కాలమున గల అర్థము వేరు.
కాలమును బట్టి అర్థములు మారుచుండును.
మార్పు ప్రకృతి సహజము.
ఆంధ్రదేశమున మార్పు వికృతి సహజము.

పూర్వకాలమున దేనిని సమైక్యత అనెడివారు?
అందరు కలసి మెలసి సంతోషముగ వుండుటను సమైక్యత అనెడివారు.
ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సమూహములు లేదా రెండు ప్రాంతములు పరస్పర అభిమానముతో, పరస్పర గౌరవముతో, ఐకమత్యముతో వుండుటను సమైక్యత అని వ్యవహరించెడివారు.

కాలము మారినది అని ముందే చెప్పుకుంటిమి కదా…
కాలముతో పాటు సమైక్యతకు అర్థము కూడా మారినది.
ఇప్పుడు సమైక్యత అనిన ఒక ప్రాంతము మరొక ప్రాంతము మీద ఆధిపత్యము చెలాయించుటగా…
ఒక ప్రాంతము వారు మరొక ప్రాంతము వారి భూములను, నిధులను, నీళ్లను, ఉద్యోగములను, వనరులను యధేచ్ఛగా దోచుకొనుటగా.
ఒక ప్రాంతము వారు మరొక ప్రాంతము వారిని బానిసలవలె చూస్తూ, అవహేళన చేస్తూ, అవమానిస్తూ, అనాగరికులు అని నిందిస్తూ పైకి మాత్రము శ్రీరంగ నీతులు వల్లించుటయే సమైక్యతగా మారినది…

ఆడి తప్పుట, మడమ తిప్పుట, ఒప్పందములు చేసుకుని ఉల్లంఘించుట, జీవోలు తీసి అమలు పరచకపోవుట, దొంగ మాటలు చెప్పి వంచించుట, దుడ్డున్నోడిదే రాజ్యము అన్న చందాన ఇష్టారాజ్యముగ వ్యవహరించుట మొదలైనవన్నీ సమైక్యతకు పర్యాయపదములుగా మారినవి.

అందువలననే తెలంగాణమున ప్రజలు సమైక్యత అన్న పదము వినగానే బెంబేలు పడిపోవుచున్నారు.
సమైక్యత అన్న అరుపు వారికి బండబూతుగా వినిపించుచున్నది.
సమైక్యతకు పిలుపునిచ్చువారు వారికి మిత్రులవలె గాక ఆగర్భ శత్రువులవలె కనిపించుచున్నారు.

అయినను సీమాంధ్రులు తమ ప్రాంతమున ”జై సమైక్యాంధ్ర” అని ఇంకనూ నినాదములు చేయచునేవున్నారు.
ఆ నినాదములో తెలంగాణము లేదు.
తెలంగాణ ప్రజల ఆమోదముతో, ఆవేదనతో, ఆక్రోశముతో, 57 సంవత్సరములుగా వారికి జరిగిన అన్యాయముతో, వారి ఆత్మగౌరవముతో,బానిసబంధాలనుంచి బయటపడి స్వతంత్రముగా జీవించాలన్న వారి ఆకాంక్షతో సీమాంధ్రులకు నిమిత్తము లేదు.

ఏక పక్షనినాదములు ఎంత దిక్కులు పిక్కటిల్లునట్లు చేసిన నేమి ప్రయోజనము?
ఒక్క చేతితో చప్పట్లు మోగవు కదా.
మోగించి చూపిస్తాం అని ప్రగల్భములు పలుకుచున్నారు.
అదియును చూచెదముగాక.

ఇంకొక్క ఆరు నెలలు వేచియున్నచో
సత్యము గెలచునో అసత్యము గెలచునో తేలిపోవును.

ఆంధ్ర ఆధిపైత్య ధృతరాష్ట్ర కౌగిలి నుంచి తెలంగాణ బయట పడునో
లేక సీమాంధ్రమే  తెలంగాణను తిరిగి తన శాస్వత బానిసగా మర్చుకొనునో స్పష్టమగును .

తొందరేల?

……………………………………………………………………

మొదటి ఎస్ ఆర్ సీ (ఫజల్ అలీ కమిషన్) సిఫారసు చేసిన తెలంగాణ రాష్త్ర చిత్ర పటము .ఇది.
కర్నూలు గుడారములలొ రాజధానిని నడుపుతూ  అష్ట కష్టములు పడుతున్న
ఆనాటి ఆంధ్ర రాష్త్ర నేతలు సకల సౌకర్యములు కలిగిన హైదరాబాదు నగరము పై కన్నేసి
ఢిల్లీలో తమ పలుకుబడి ఉపయొగించి లాబీయింగ్ చేసి, దొంగ మాటలు చెప్పి, పెద్ద మనుషుల ఒప్పందాలు చెసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొగ్గలోనె తుంచేసి
ఆంధ్ర లొ కలుపుకున్నారు.
ఇన్నాల్లకు అనాటి తెలంగాణ కల సాకారము కాబొతున్నది

First SRC Telangana

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

9 Responses to సమైక్యత అనగా నేమి? సమైక్యత అనగా ఒక్క చేతితో చప్పట్లు కొట్టు ఒకానొక వింత ప్రక్రియ. సీమాంధ్ర ప్రాంతములో తప్ప ఈ ప్రక్రియ ప్రపంచములో మరెక్కడనూ కానరాదు.

 1. Kiran says:

  super post…. good one…

 2. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రనిర్ణయం కాంగ్రెస్ పార్టీ తొందరపడి హడావిడిగా ఆగమాగం తీసుకున్న నిర్ణయం కాదు!అన్ని రాజకీయ పక్షాలతో,అన్ని స్తాయులలో,పూర్తి సంప్రదింపులు పూర్తి చేశాకే ఈ నిర్ణయం జరిగింది!ఎన్నో ఏళ్లుగా eloctronic media లో హాట్ హాట్ గా వేడివేడి చర్చలు పుంఖానుపుంఖంగా సాగాయి!పది తెలంగాణా జిల్లాలలో లేకుండా పదమూడు జిల్లాలలో పెట్టుబడిదారుల ప్రేరేపిత కృత్రిమ సమైక్య ఉద్యమం ఎలా సమైక్య ఉద్యమ మౌతుంది!?చివరికి సత్యం గెలుస్తుంది!తెలంగాణా రాష్ట్రం ఏర్పడితీరుతుంది!

 3. aditya says:

  samaikya vudyamam ane ninaanadam ante rastranni vidagottaddani, ante kani oka chetto chappatlu kottadam ani kaadu.

  • J T Bandagi says:

   ఆదిత్య గారూ
   పేరులో నేమున్నది ?
   హైదరాబాదే తెలంగాణము … తెలంగాణమే హైదరాబాదు.
   మదరాసే తమిళనాడు. తమిళనాడే మదరాసు ఎటులనో అటుల

   నైజాము సంస్థానము భారత దేశములొ 17 సెప్టెంబర్ 1948 న విలీనమైన తరువాత
   హైదరాబాదు పేరిట నొక రాష్ట్రము 1956 వరకు కొనసాగినదని మీకు తెలియదా ?
   అట్టి రాష్టమున కన్నడ మరాఠీ జిల్లాలు పోగా మిగిలిన ప్రాంతమునే తెలంగాణము అందురని మీకు తెలియదా ?
   దానినె “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని మహాకవి దాశరధి అభివర్ణించుట మీకు తెలియదా ?
   మీకు అన్నియునూ తెలుసును
   కానీ ఏమీ తెలియనటుల ప్రశ్నించుచున్నారు.

   మొదటి ఎస్ ఆర్ సీ (ఫజల్ అలీ కమిaషన్) సిఫారసు మరియు ప్రతిపాదిత మాప్ విషయమున
   మీకున్న సందెహము నివృత్తి చేసుకొనుటకు అనెక మార్గములున్నవి ప్రయత్నించుడు.

   ఇక ..
   ” సమైక్యత – విభజన వ్యతిరేకత ” అను వితండ వాదము కూడా మీరు గడుసుతనము తొ చేయుచున్నారు
   గానీ న్యాయాన్యాయములు మీ అంతరాత్మకు స్పష్టముగానె తెలుసును.

   నీతి లేని ఒక ఎయిడ్స్ రోగి నుంచి విడాకులు కోరుకొను హక్కు భార్యకు వుటుంది కానీ ….
   విడాకులు వద్దు, నెను బలవంతంగా కాపురaమునే చేసెద, నా భార్యతో సదా సమైక్యముగనే
   వుండెద నను హక్కు ఆ దుర్మార్గపు భర్తకు వుందునా ఆదిత్య గారూ….?

   వాడికి ఎంత ధన బలము, పలుకుబడి ,
   మీడియా మద్దతు , అధికార ప్రభుత్వ అండదండలు వున్ననూ
   ఈ అన్యాయము చెల్లునా ఆదిత్య గారూ….??

   ఇడేమి కలికాల వైపరీత్యము.
   అకటా … ఆంధ్రులను చూసి యావత్ ప్రపంచము నవ్వుకును రోజులు వచ్చినవి కదా….!!!

 4. aditya says:

  paina chupettina maps lantivi chalaa dorukutai, Ina paina chupinchina map lo telangana ani ekkada vundi?

 5. తెలుగు జాతి ఆత్మగౌరవం. says:

  హైదరాబాద్ అందరి సొత్తంటున్నారు.
  హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు.
  మిగిలిన తెలంగాణ జిల్లాలు సమైక్యంలో భాగం కాద?.
  అసలు సమైక్యమంటే ఏమిటి? కేవలం హైదరాబాద్‌ను కోరుకోవటం సమైక్యమవుతుందా?
  ఒక వెళ హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమాంధ్రలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో భావోద్వేగాలు లేవూ.వుందల్లా హైదరాబాద్ కాద? మరి ఎది తెలుగు జాతి సమైక్యత?
  తెలుగు జాతి ఆత్మగౌరవం.

  • J T Bandagi says:

   తెలంగాణ నినాదం : “మా రాష్ట్రం మాగ్గావలె, మా నిధులు, మా నీళ్ళు, మా వనరులు, మా ఉద్యోగాలు మాకు దక్కాలె” అని
   సమైక్య నినాదం: ” మాది మాకె గావాలె, మీదీ మాకే గావాలె. మీ నీళ్ళు, ంఈ ఉద్యోగాలు, మీ హైదరాబాదు అన్నీ మాకె గావాలె”

   • ఒకరి నినాదం: “మీరు బాగా అభివృద్ధి అయిన్రు, మేం ముక్కలేకపోతున్నం. మీరు పెద్దగీత, మేమేమో చిన్నగీత. మీలాగా పెద్ద కాలేకపోతున్నం. పెద్దగీతను చెరిపేసి చిన్నగీతను చెయ్యాలి. గప్పుడు మేం పెద్దగీతలాగా అగుపిస్తం. గంద్కని హై. నుండి మిమ్మల్ని ఎల్లగొట్టి మొత్తంగ మేమే కబ్జ చేసుకుంటం. గప్పుడు ఆటోమాటిగ్గ పెద్దగీత చిన్నదైపోతది. మేం పెద్దగీతై పోతం.”

    రెండోవారి నినాదం: “అందరం కలిసి అభివృద్ధిచెందాం. మీరూ అభివృద్ధి చెందారు. మాకంటే మీరే ఎక్కువ అభివృద్ధి చెందారు. కాకపోతే కాలేదని అబద్ధాలు చెబుతున్నారు. సరే, అయితే లెక్కలు చూసుకుందాం రండి అని మేం అంటున్నాం. ఇక మీ అబద్ధాలు ఆపండి. మీరు పొమ్మనగానే పోడానికి మేం సిద్ధంగా లేం. మీరు పోతామంటే పోండి. మమ్మల్ని పొమ్మనే అధికారం మీకు లేదు”

   • J T Bandagi says:

    చదువరి భయ్యా.
    బాగనే నేర్సినవ్ తెలంగాణ భాష.
    ఎంత న్యాయంగ చెప్పినవే నీ కడుపు సల్లగుండ.
    ఆంధ్రోళ్ళంత గింతేలే.
    గింత చాల్బాజితనం ఎట్లొచ్చిందే మీకు.?
    మీరేమొ మమ్మల్ని అభివౄధ్ధి చెయనీకి హైదరాబాదుకు ఒచ్చి, మా బాగు కోసమె మా భూముల్ని కబ్జ చేసినారు?
    గిప్పుడు మిమ్మల్ని ఈడినుంచి ఎల్లగొట్టి – మల్ల మా భూముల్ని మేం కబ్జ చేయాలని చూస్తున్నాం?
    మద్రాసు నుంచి విడిపోయినంక ఆంధ్రోల్లందరు మద్రాసుల భూములు జాగలు ఇడిచిపెట్టి కట్టుబట్టలతోని ఆంధ్రాకు ఒచ్చిండ్లా?
    గట్లనె రేపు తెలంగాణ ఒచ్చినంక మీ ఆస్తులు, భూములు అన్ని మాకు ఇడిచిపెత్తి పొతరా?
    రాష్ట్రం ఏర్పడుడంటె ఇండియ పాకిస్థాను విడిపోయినట్టు విడిపోవుడు కాదు కదా.
    కాదని మీకు బగ్గ తెల్సు.
    అయినా చాల్బాజి తనం తోని గిట్ల మాట్లాడుతున్నరు.
    ఎంత జిత్తులమారి సమైక్యతే మీది !
    ఎంత బూటకపు తెలుగు జాతీ అత్మ గౌరవమే మీది. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s