తెలంగాణా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కుట్రే ప్యాకేజి !

మిగులు బడ్జెట్‌తో పటిష్టంగా వున్న రాష్ట్రాన్ని …
సకల సౌకర్యాలతో కూడిన రాజధానిని కలిగివున్న రాష్ట్రాన్ని …
తీసుకెళ్లి-
తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వున్న రాష్ట్రంతో…
రాజధాని లేక డేరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నడుపుకునే దౌర్భాగ్యపు రాష్ట్రంతో
అన్యాయంగా కలపడమే పెద్ద కుట్ర!
పైనుంచి ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కొ డాంటే’ అన్నట్టు
మమ్మల్ని దోచుకునేందుకు రండి బాబూ రండి అని తెలంగాణా ప్రజలే కాళ్లావేళ్లా పడితేనే
ఆంధ్ర తెలంగాణాల విలీనం జరిగినట్టు ఒక దుర్మార్గపు ప్రచారం.

ఈ విలీనం వల్ల ఏం ఒరిగింది తెలంగాణా ప్రజలకు?
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు అన్ని విషయాల్లో అన్యాయమే.
అడుగడుగునా అవమానాలూ, అవహేళనలే!
తెలంగాణా నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా పట్టుమని ఐదేళ్ల పూర్తికాలం పరిపాలించకుండా కూలదోశారు.
అవును మరి వాళ్లది బ్రూట్‌ మెజారిటీ కదా మరి. 175 -119 ఎవరిమాట చెల్లుతుంది. ఎవరి పెత్తనం నడుస్తుంది?
పైగా అటువైపు తెల్లదొరల పాలనలో ఆరితేరిన నాయకులు దండిగా వుంటే
ఇటువైపు నిరంకుశ భూస్వామ్య వ్వస్థలో సరైన ప్రజానాయకులే అప్పటికి తయారుకాలేరాయె.
నిజాం కాలంనాటి ప్రజాకంటక దొరలే ఇక్కడ నాయకులైతిరి.
ప్రజల హక్కులను వాళ్లెందుకు కాపాడుతారు?
అందుకే తెలంగాణాలో సీమాంధ్ర పాలకులది ఆడింది ఆట పాడింది పాట అయ్యింది.

ఇప్పుడు ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. కొత్తతరం నాయకులు ఆవిర్భవించారు.
సీమాంధ్ర కుట్రలు, కుతంత్రాలు ఇకపై ఇక్కడ సాగే పరిస్థితి లేదు.
మీరు మమ్మల్ని అభివృద్ధి చేసేదేంది… మాకు మేమే అభివృద్ధి చేసుకుంటాం అంటున్నారు.
మా నాయకులు మీ దయా ధర్మాలతో ముఖ్యమంత్రి పీఠం మీద
బిక్కు బిక్కు మంటూ కూచోవాల్సిన ఖర్మ మాకెందుకు?
తెలంగాణా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రులే మమ్మల్ని పాలిస్తారు.
మాకు ఎవడి బిచ్చం, ఎవడి దయాధర్మం అక్కరలేదు.
మేం ఎవరి వనరులను దోచుకుని పైకి రావాలనుకోవడం లేదు.
మా వనరులతో, మా శ్రమతో మేం సగౌరవంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం.

ప్యాకేజీలతో తమను శాశ్వత బానిసలుగా చేసే కుట్రల్ని
తెలంగాణా ప్రజలు సహించరు గాక సహించరు.
లంచాల, స్కాముల బురదలో మునిగి తేలేవాళ్లకు సహజంగానే
ప్యాకేజీలు పంచరంగుల రామచిలుకల్లా కనిపిస్తాయి.
కానీ –
ఆత్మాభిమానం వున్న తెలంగాణా ప్రజానీకానికి ప్యాకేజీ అంటే లంచం,
ప్యాకేజీ అంటే ముష్టి,
ప్యాకేజీ అంటే మరో దుర్మార్గపు కుట్రగా కనిపిస్తుంది.
ప్యాకేజీ పప్పులు ఇక్కడ ఉడకవు. ఏ దొంగ ఒప్పందాలూ ఇక కుదరవు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారం!

Advertisements
This entry was posted in Uncategorized and tagged , , . Bookmark the permalink.

2 Responses to తెలంగాణా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కుట్రే ప్యాకేజి !

  1. tapaa నిజాయతీగా రాశారు!మమ్మల్ని మేము స్వయంగా సవ్యంగా పరిపాలించుకుంటామంటే వద్దనడానికి కేంద్రానికి ఏమి అధికారం ఉంది!ప్రత్యెక తెలంగాణా వాదులే వచ్చే ఎన్నికలలో గెలిస్తే అప్పుడు కేంద్రం నాలుక కోరుక్కుంటుంది!

  2. deepak says:

    vileenam chesinappudu unna naayakulu evvaru ippudu leru.aa paniki ippudu unna vallani baadhyulani cheyyadam entha varuku correct???

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s