విద్వేషమే ధ్యేయంగా విశా’లాంధ’ మహా’రభస’ – పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు” !

విద్వేషమే ధ్యేయంగా విశా’లాంధ’ మహా’రభస’ – పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు” !

… విశాలాంధ్ర మహాసభ వారు విషాన్నీ, తెలంగాణా పట్ల తమ విద్వేషాన్నీ రంగరించి ”రుజువులు లేని ఉద్యమం – తెలంగాణా వేర్పాటు వాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు” అన్న పుస్తకాన్ని ఇటీవల వెలువరించిన విషయం విదితమే.
దానికి ‘మూ తోడ్‌’ జవాబుగా వీక్షణం మాసపత్రిక సంపాదకుడు కె. వేణుగోపాల్‌ ”విద్వేషమే ధ్యేయంగా విశా’లాంధ’ మహా’రభస’ – పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు” అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం రేపు 11 జూన్‌ 2013 మంగళవారం నాడు సాయంత్రం 6 గంటలకు బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆవిష్కరించబడుతోంది.
అందరూ ఆహ్వానితులే.
ఈ సందర్భంగా తెలంగాణా ఆత్మగౌరవ వేదిక వారు ప్రచురించిన కరపత్రం:
”విద్వేషమే ధ్యేయంగా విశా’లాంధ’ మహా’రభస’ – పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు”

ఇటీవలి కాలంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకిస్తూ చాలా దూకుడుగా రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సీమాంధ్ర మీడియా ఆ అబద్ధాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. గత జనవరిలో ఢిల్లీలో తెలంగాణ అనుకూల నిర్ణయం ఏదో వస్తుందనే ఊహాగానాలు వచ్చినప్పుడు, ఆ నిర్ణయాన్ని ఎత్తగొట్టించడానికి పరకాల ప్రభాకర్‌ అండ్‌ కంపెనీ ఆ అబద్ధాలనే ఇంగ్లీషులో పుస్తక రూపంలో తెచ్చారు. ఆ పుస్తకంలో ప్రకటించిన అబద్ధాలన్నీ అంతకుముందు ఎన్నోసార్లు ఖండించినవే. ఆ వాదనలన్నిటికీ అంతకుముందు ఎంతో మంది తెలంగాణ మేధావులు దీటయిన జవాబులు చెప్పారు. మళ్లీ ఇంగ్లీష్‌ పుస్తకం వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల చర్చలు జరిగాయి. ఆ పుస్తకం ఎట్లా అబద్ధాలతో, అర్థసత్యాలతో, వక్రీకరణలతో నిండి ఉన్నదో అనేకమంది వివరించారు. కానీ అవేవీ పట్టించుకోకుండా మళ్లీ అదే పుస్తకపు తెలుగు అనువాదాన్ని ఏప్రిల్‌ 16న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. తన ప్రశ్నలకు తెలంగాణా వాదులు జవాబు చెప్పలేదనీ, తాను రాసినవన్నీ నిజాలని రుజువైందనీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అవే కారుకూతలు కూశాడు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆరు దశాబ్దాలుగా సాగిన దోపిడీని, పీడనను, వంచనను, నమ్మక ద్రోహాలను తగుదునమ్మా అంటూ సమర్ధిస్తూ, ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్న పరకాల ప్రభాకర్‌ రాతలకు, విశాలాంధ్ర మహాసభ పుస్తకానికి ఇప్పటికి కనీసం రెండు వందల పుస్తకాలలో, సాగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమంలో జవాబులున్నాయి. అయినా తనకు జవాబులేదని విర్రవీగుతున్న పరకాల ప్రభాకర్‌ విశాలాంధ్ర మహాసభ ప్రచురించిన ”రుజువులు లేని ఉద్యమం – తెలంగాణ వేర్పాటువాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు” పుస్తకానికి సూటిగా అసలు నిజాలు జవాబులు చెప్పదల్చుకున్నాం. మా ప్రయత్నంలో భాగమే ”విద్వేషమే ధ్యేయంగా విశా’లాంధ’ మహా’రభస’ – పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు”

ఈ పుస్తకావిష్కరణ సభకు అందరూ రండి.
సీమాంధ్ర అసత్యాలను బదాబదలు చేసే తెలంగాణ సత్యాలను ఆవిష్కరించుకుందాం రండి

అధ్యక్షత: డా. తడకమళ్ల వివేక్‌, అధ్యక్షులు, తెలంగాణ హిస్టరీ సొసైటీ.

పుస్తకావిష్కరణ: సిహెచ్‌. క్రాంతికిరణ్‌, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జర్నలిస్ట్స్‌ ఫోరం

వక్తలు:

టి.హరీష్‌రావు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు

అ ల్లం నారాయణ, సంపాదకులు, నమస్తే తెలంగాణ దినపత్రిక

ప్రొ. ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్‌, డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

జి. దేవీప్రసాద్‌, అధ్యక్షులు, తెలంగాణ ఎన్జీవోస్‌ యూనియన్‌

Advertisements
This entry was posted in Uncategorized and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s