ఒక ఉద్యమం – పది కుట్రలు…….!

telangana-map

ఒక ఉద్యమం పది కుట్రలు…….!

ఆ మధ్య ఒకాయన ”ఒక ఉద్యమం పది అబద్ధాలు” అన్న శీర్షికతో తెలంగాణా ఉద్యమం మీద తన బ్లాగులో ఒక సీరియల్‌ రాసిండు. దానిని పుస్తకంగ కూడా అచ్చేసిండనుకుంట.

ఫజల్‌ అ లీ కమిషన్‌ అబద్ధం, పెద్ద మనుషుల ఒప్పందం అబద్ధం, ముల్కీ నిబంధనలు అబద్ధం, 610 జీఓ అబద్ధం, 14 ఎఫ్‌ రాష్ట్రపతి ఉత్తర్వులు అబద్ధం, నీళ్లూ ఉద్యోగాలూ వనరుల దోపిడీ పచ్చి అబద్ధమంటూ, మొత్తం తెలంగాణా ఉద్యమమే అబద్ధాల పునాదిమీద నడుస్తోందంటూ అందులో రాసుకొచ్చాడు.

ఆంధ్ర కంటె, రాయలసీమ కంటే తెలంగాణాయే ఎక్కువ డెవలప్‌ అయిందన్నడు, నీళ్లూ, ఉద్యోగాలూ, వనరుల విషయంలో తెలంగాణకు అస్సలు అన్యాయమే జరగలేదన్నడు.

అసలు సమైక్యంగ ఉందామని తెలంగాణోల్లే ఆంధ్రోళ్లను ఎగేసిండ్లట. మొదటి ఎస్‌ఆర్‌సి జర్ర ఆగుండ్లి అన్నా ఆగకుంట హైదరాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీయే తీర్మానం చేసి ఆంధ్రోళ్లను బలవంతంగ రామసక్కని కర్నూలునుంచి ఎన్కబడ్డ హైద్రాబాద్‌కు ఈడ్చుకొచ్చిండ్రట. ఆంధ్రాలున్న తమ ఆస్తులన్నీ అమ్ముకొనితెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి, పగలనక రేయనక ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణాను డెవలప్‌మెంట్‌ చేస్తె ఇప్పుడు మనం దుర్మార్గంగా వాళ్లను ఎళ్లిపొమ్మంటున్నమట. తెలంగాణా ఉద్యమాన్ని వాళ్లు ఎంత అవహేళన చేసిండ్లో.

”ఉల్టా చోర్‌ కొత్వాల్‌కొ డాంటే”, ”దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు” అన్న సామెతలు ఎందుకు పుట్టినయో అప్పుడర్థమయింది.

ఇప్పుడు ఆ లెక్కలన్నీ బట్టబయలైనయి. తెలంగాణాకు జరిగిన అన్యాయం, ఆంధ్ర నాయకుల చాల్బాజితనం, తెలుగుతల్లి పేరుతోని చేసిన మోసం, వాళ్ల రెండు నాల్కల ధోరణి, డిసెంబర్‌ 9 ప్రకటన రాకముందు ఎట్ల మాట్లాడిండ్లు, వచ్చినంక ఎట్ల మాట్లాడిండ్లు, ఇఫ్పుడెట్ల మాట్లాడుతున్నరు, ఎన్నికలప్పుడు ఎట్ల మాట్లాడతరు, ఎన్నికలైనంక ఎట్ల మాట్లాడుతరు వాళ్ల ఒప్పందాలు, జీవోలు, వాగ్దానాలు మొత్తం వాళ్ల గోత్రాలు తెలంగాణల చిన్న పోరనకి కూడా అర్ధమైపోయింది.

సమైక్యత పేరుతోని తెలంగాణా మీద ఎన్ని కుట్రలు, ఎన్ని కుంతంత్రాలు, ఎన్ని ద్రోహాలు, ఎంత నయవంచన.

అయినా అవన్నీ తెలంగాణా ప్రజల పోరాట స్ఫూర్తి ముందు బలాదూర్‌ అయ్యాయి.

సమైక్యవాదం తరపున ”ఓయి తెలుగు వాడా తగదింటి నడుమ గోడ…” అనే పాటను కమర్షియల్‌గా రాయించి, సుప్రసిద్ధ గాయకమణ్యుని చేత పాడించి లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి అన్ని చానల్స్‌లో అదరగొట్టారు. కానీ తెలంగాణా పోరాట పాటల ముందు అది ఒక దిష్టిబొమ్మలా వెలవెలబోయింది. డబ్బు మదం ప్రజా బలం ముందు ఎక్కువ రోజులు నిలబడదని తేలిపోయింది.

ఆంధ్ర పెట్టుబడిదారీ నాయకులు ఎన్ని కమిటీలను లోబరచుకున్నా, ఎంత లాబీయింగ్‌ చేసినా, ఎందర్ని కొనుగోలు చేసినా, ఎన్ని ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు పన్నినా ఫలితం లేకపోయింది. దేర్‌ హుయీ మగర్‌ అంధేర్‌ నహీ. చివరికి సత్యమే గెలవబోతోంది.

సత్యమేవ జయతే అన్న నినాదం సార్థకం కాబోతోంది.

తెలంగాణా ప్రజల ఆరు దశాబ్దాల కల సాకారం కాబోతోంది.

ఆంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణా మాత్రం ఆంధ్ర (సీమాంధ్ర అనాలేమో ఇప్పుడు) ప్రజల పట్ల సహృదయతనే చూపుతోంది. ”అన్న దమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం” అంటోంది. ”మీకూ, మీ ఆస్తులకు తెలంగాణాలో, హైదరాబాద్‌లో ఎలాంటి హానీ వుండదని హామీ యిస్తోంది. తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు వుంటే తప్పేంటి అంటోంది. నిత్యం కలహించుకుంటూ వుండటం కంటే విడిపోయి అభివృద్ధిలో పోటీపడదాం అంటోంది.

ఆంధ్ర సోదర సోదరీమణులారా మీరేమంటారు?

T Talli

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s