సమైక్యవాదుల నోట తాలిబన్ల మాట !

సమైక్యవాదుల నోట తాలిబన్ల మాట !

ముసుగులు తొలిగిపోతున్నయ్‌! కప్పుకున్న ఆవుతోళ్లు, కట్టుకున్న గోముఖాలు జారిపోతున్నయ్‌! వేషాలు వెలిసి అసలు రంగు బయటపడుతోంది!

ఇన్నాళ్లు తెలంగాణా ఉద్యమకారుల్ని ”తెలబాన్లు” అంటూ అవహేళన చేస్తూ వచ్చినవాళ్లు పక్కా ”తాలిబన్ల” మాదిరిగా రంకెలు వేస్తున్నారు!

నాలుగు బస్సుల్ని తగుల బెడితే, పది విగ్రహాలను ధ్వంసం చేస్తే రాష్ట్రాన్ని ఇవ్వాల్నా అని సన్నాయి నొక్కులు నొక్కినవాళ్లు – కేంద్రం గనక తెలంగాణా రాష్ట్రం ఇస్తే విధ్వంసం సృష్టిస్తాం, ప్రభుత్వ ఆస్తుల్ని తగులబెడతాం అని బాహాటంగా ప్రకటిస్తున్నారు.

నిన్న గాక మొన్న అఖిలపక్ష సమావేశ సందర్భంగా –

1) ”అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడివుంటాం” అని అధికార పార్టీ నేతలు ప్రకటించారు.

2) ”తెలంగాణాకు మా పార్టీ వ్యతిరేకం కాదు. తెలంగాణాను అడ్డుకోబోము, ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి మా అభిప్రాయాన్ని ఎప్పుడో లిఖిత పూర్వకంగా తెలియజేశాం, ఆ లేఖను మేం వెనక్కి తీసుకోలేదు” అని ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రమాణాలు చేశారు.

3) ”కేంద్రమే రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 3 ప్రకారం తెలంగాణా నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని మా పార్టీ వ్యతిరేకించదని” మరో కొత్త ప్రతిపక్షం స్పష్టం చేసింది.

కానీ –
తెలంగాణా ఏర్పాటు దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న సంకేతాలు అందగానే ఈ మూడు పార్టీల సీమాంధ్ర నేతలూ ఒక్కసారిగా ప్లేట్లు ఫిరాయిస్తున్నారు.
తమ పార్టీ అధిష్ఠానాలను, అధినేతలను ధిక్కరిస్తూ హింసాత్మక ప్రకటనలు గుప్పిస్తున్నారు.

హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సదస్సులు, సభలు నిర్వహించి గొడవలు సృష్టించి ఎలాగైనా సరే తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవాలని తహతహలాడుతున్నారు.

ఈ సందర్భంగా హైదారాబాద్‌ రాష్ట్ర రాజధాని కాబట్టి అక్కడ సభలు పెట్టుకునే హక్కు తమకు వుందనీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చనీ నీతిసూత్రాలు వల్లిస్తున్నారు. సుష్మా స్వరాజ్‌ వంటి ప్రతిపక్ష నేత తెలంగాణాకు అనుకూలంగా హైదరాబాద్‌లో ఒక సభను నిర్వహించేందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు ఈ ప్రజాస్వామిక వాదులంతా ఏమై పోయారో.

హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సదస్సు! ఎవరు నిర్వహిస్తారు? సీమాంధ్ర నేతలు.

సమైక్యత అనేది కేవలం సీమాంధ్రులకు సంబంధించిన వ్యవహారమా? వాళ్లు అనుకుంటే రాష్ట్రం సమైక్యంగా వుంటుందా? సమైక్యతకు తెలంగాణా నేతల, ప్రజల ఆమోదం అవసరం లేదా? తెలంగాణా వాళ్లను అణచివేస్తే చాలు సమైక్యత సజావుగా కొనసాగుతుందా?

సమైక్యత అంటే సీమాంధ్ర ప్రజలు, తెలంగాణా ప్రజలు కలసిమెలసి వుండటం.
అంతేకానీ సీమాంధ్ర ప్రజలు ఒక కూటమిగా, తెలంగాణా ప్రజలు మరో కూటమిగా ఎవరి పాట వాళ్లు పాడుకుంటూ శాశ్వతంగా జుట్లు పీక్కోవడం కాదు.
తెలంగాణా ప్రజలు అంగీకరించకుండా సమైక్య రాష్ట్రం బతికిబట్టకట్టలేదు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డంత మాత్రాన భూమ్యాకాశాలు ఏమీ బద్దలైపోవు.
హైదరాబాద్‌లో రాజకీయ పలుకుబడితో అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న కొందరు సీమాంధ్ర నాయకులే ఈ విధ్వేషాలను సృష్టిస్తున్నారు.

వ్యాపారకీయాలుగా మారిన రాజకీయాలు రాష్ట్ర ప్రజల జీవితాలను ఎంత ఛిన్నాభిన్నం చేస్తున్నాయి!
ప్రధాన పార్టీల రెండు నాల్కల మాటలు, ప్రాంతాల వారీ విధానాలు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నాయి.

సామాన్య జనం, బుద్ధి జీవులు గనక ఇప్పుడు మౌనం వహిస్తే – ఈ దుర్మార్గ రాజకీయాలు, ఈ నిబద్ధతలేనితనం, ఈ అబద్ధాలు, దొంగ వాగ్దానాలు, నయ వంచక మానిఫెస్టోలు, ఈ బెదిరింపులు, ఈ కుట్రలు మొత్తం వ్యవస్థను ఇంకా భ్రష్టు పట్టిస్తాయి.

తస్మాత్‌ జాగ్రత్త!

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

2 Responses to సమైక్యవాదుల నోట తాలిబన్ల మాట !

  1. shayi says:

    వాళ్ళు “సాలె”బాన్లు బయ్! వాళ్ళకు మనం జెప్పేది సమఝ్ గాదు.

  2. sri says:

    samavesam pettukuntene lolli chestunte inka telanganalo evari abhiprayamayina swetchaga ekkada cheppanicharu. swetchaga andari abhiprayalu cheppanichi unte telisipoyedi evaru nijanga telangana korukuntunnaro

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s