ఇదేం సమైక్య వాదం !?

Rabandulu

ఇదేం సమైక్య వాదం !?

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పెరిగిపోతారట,
మతోన్మాదం పెచ్చరిల్లుతుందట.
అందుకని మావోయిస్టులను అణగదొక్కాలన్నా,
మతోన్మాదాన్ని అదుపులో వుంచాలన్నా రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలంట.

ఎంత దుర్మార్గమైన,
ఎంత కుట్రపూరితమైన వాదన ఇది!

అసలు మావోయిస్టులకు, తీవ్రాదానికి
జన్మ నిచ్చిందే సమైక్య రాష్ట్రం కదా.
నక్సలైట్‌ ఉద్యమం మోదలైందే శ్రీకాకుళంలో కదా. దానికేమంటారు?

సమైక్య రాష్ట్రం ఏర్పడ్డంకనే,
సీమాంధ్ర నుంచి అనేక ఐరన్‌ లెగ్గులు అడుగుపెట్టినంకనే
హైదరాబాద్‌లో మతకలహాలు మొదలయ్యాయి.
కాదంటారా?

మూడువందల సంవత్సరాల నైజాం పాలన చరిత్ర తిరగేయండి.
ఎక్కడా మతకలహాలు కనిపించవు.
దొరలనీ, ఆ దొరలతో పాటు నిజాం పాలనను కూల్చాలని తెలంగాణా ప్రజలు సాయుధ తిరుగుబాటు లేవదీసినప్పుడు తప్ప రజాకార్లు, మతోన్మాదులు తెలంగాణాలో ఎప్పుడూ లేరు.

ఇప్పుడు ఆంధ్ర రజాకార్లు మోపై తెలంగాణాను తమ కబ్జాలో పెట్టుకోడానికి రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.
తెలంగాణాను పర్మనెంట్‌ కల్లోలిత ప్రాంతంగా చేస్తున్నారు.

ఆనాడు కూడా తెలంగాణా రాష్ట్రాన్ని కొనసాగిస్తే కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిపోతుంది, దేశ భద్రతకే ముప్పు ఏర్పడుతుంది అని ఇట్లాగే దుష్ప్రచారం చేసి, లాబీయింగు చేసి
మొదటి ఎస్‌ఆర్‌సి సిఫారసును ఉల్లంఘించి మరీ తెలంగాణాను ఆంధ్రలో కలుపుకున్నారు.

ఇప్పుడు మళ్లీ అవే వాదనలు,
అవే దుష్ప్రచారాలు,
అవే బెదిరింపులు!

తెలంగాణాను బతకనిచ్చెటట్లు లేవు ఈ రాబందులు !

తెలంగాణా తన బతుకేదో తను బతుకుతానంటే వీళ్లకి
(మొత్తం ఆంధ్ర ప్రజలకు కాదు, కేవలం రాజకీయాలను వ్యాపారంగా మార్చి దోచుకుతింటున్న కొద్దిమంది రాజకీయనాయకులకు)
ఎందుకు అంత ఏడుపు.

మీ బతుకు మీరు బతకొచ్చు కదా. మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కదా.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్ని రాష్ట్రాలు ఏర్పడలేదు?
దేశంలో తెలంగాణా కంటే ఎన్ని చిన్న రాష్ట్రాలు లేవు?
ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడైనా ఇంత దగుల్భాజీ వాదనలు వచ్చాయా.

తెలంగాణా ప్రజలు ఒప్పుకోకపోయినా రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాల్నా?

తెలంగాణా ప్రజలు మీ దోపిడీకి, మీ అణిచివేతకు శాశ్వతంగా బలవుతూ వుండాల్సిందేనా?

అది సాధ్యమవుతుందా?
ఇదేనా సమైక్యత అంటే?

..

This entry was posted in Telangana. Bookmark the permalink.

One Response to ఇదేం సమైక్య వాదం !?

  1. No Name says:

    How should samaikyatavaadam, you feel that should be?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s