గుడ్డును పగుల గొట్టొద్దు కానీ, ఆమ్లెట్‌ మాత్రం కావాలి …. అంటే ఎలా సాధ్యం కామ్రేడ్‌?

గుడ్డును పగుల గొట్టొద్దు కానీ, ఆమ్లెట్‌ మాత్రం కావాలి …. అంటే ఎలా సాధ్యం కామ్రేడ్‌?

tdpcpi

కమ్యూనిస్టుపార్టీ 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమ మప్పుడు సమైక్యవాదం వైపు నిలబడింది. నిలబడటమే కాదు
విశాలాంధ్ర పరిరక్షణకోసం తెగించి పోరాడింది. ఆతర్వాత నిన్నమొన్నటి వరకూ తెలంగాణా ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పదివేల కోట్ల ప్రత్యేక పాకేజీ ప్రకటించాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ దానిని పట్టించుకోకపోవడంతో  రాష్ట్రాన్ని డీమెర్జ్‌ చేసి ప్రత్యేక తెలంగాణాను ఏర్పాటు చేయడం తప్ప మరో పరిష్కారర లేదన్న నిర్ణయానికి వచ్చింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా విస్పష్టమైన స్టాండ్‌ తీసుకుంది. ఆ స్టాండ్‌వల్ల తెలంగాణా ప్రాంతంలో జేజేలు లభించినా ఆంధ్ర ప్రాంతంలో నష్టపోతానని సిపిఐకి తెలుసు. అయినా వెనుకడుగువేయలేదు.

మార్క్సిస్టు పార్టీ విషయమూ అంతే… భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీయడానికి వీలులేదనేది ఆ పార్టీ జాతీయవిధానం. ఆంధ్ర ప్రాంతంలో ఆదరణ లభించినా తనకు ఎక్కువ ఓటు బ్యాంకు వున్న తెలంగాణాలో వ్యతిరేకత ఎదురవుతుందని తెలుసు. అయినా విశాలాంధ్రవాదానికే కట్టుబడి వుంది. కాకపోతే గతంలో మాదిరిగా రాష్ట్ర సమైక్యతకోసం ఎలాంటి ఉద్యమాలూ చేయడం లేదు. మీరు నిర్ణయం తీసుకుంటే అడ్డుపడం అనే వైఖరి అవలంభిస్తోంది.

అదేవిధంగా బీజేపీ కూడా ఒకే విధానాన్ని అనుసరిస్తోంది. ఆంధ్ర ప్రాంతంలో అడ్డంకుల్ని లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణా కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ప్రత్యేక తెలంగాణాకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

నిబద్ధత కలిగిన పార్టీలు ఏవైనా అనుసరించే పద్ధతే ఇదే. ఒక పార్టీ ఒకే పాలసీ. ఒకేమాట ఒకే బాట. ఏ విషయమైనా కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చకపోవచ్చు. మెజారిటీ నిర్ణయానికి లోబడి పార్టీ సభ్యులంతా ఒకే పాలసీకి కట్టుబడివుండాలి. ఒక పార్టీ రెండు పాలసీలు అనేది ప్రజాస్వామిక స్ఫూర్తికే విరుద్ధం. దేశానికే నష్టదాయకం. దాని వల్ల ఆ పార్టీ విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది. రెండు ప్రాంతాల్లో ప్రజాభిమానాన్ని కోల్పోతుంది. చివరికి అది రెంటికి చెడ్డ రేవడి అయ్యే ప్రమాదం వుంటుంది.

కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో సహా తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి… ఈ మూడు పార్టీలూ తెలంగాణా విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నాయి. అక్కడొకమాట ఇక్కడొకమాట చెప్తున్నాయి. ఆ పార్టీల్లో ని తెలంగాణా ప్రాంత నేతలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నారు. అంధ్ర ప్రాంత నేతలేమో రాష్ట్రం సమైక్యంగా వుండాలంటున్నారు. మరో పక్క కేంద్రం (2009 డిసెంబర్‌ 9న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి కూడా) పార్లమెంటులో బిల్లు పెట్టి మెజారిటీ అభిప్రాయం ప్రకారం తెలంగాణా సమస్యపై నిర్ణయం తీసుకోకుండా ఏకాభిప్రాయం వస్తేనే కానీ ఏం చేయలేమంటూ తప్పించుకుంటోంది. రాష్ట్ర రాజకీయ పార్టీల పైనే నెపం వేసి తప్పించుకుంటూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది.

ఈ నేపథ్యంలో మొన్న ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. మూడేళ్లుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సమస్యను పరిష్కరించేందుకు,  కాంగ్రెస్‌ను నిలదీసేందుకు, పై మూడు పార్టీలకూ ఒక మంచి అవకాశంవుండింది. కానీ ఆ మూడు పార్టీలూ ఒకే విధానాన్ని అనుసరించలేక కేంద్రాన్ని దోషిగా బోనులో నిలబెట్టలేక చేజేతులా తాముకూడా సహదోషుల్లా బోనులో నిలబడ్డాయనే  చెప్పాలి.

అఖిలపక్ష సమావేశం కేవలం గంటన్నర పాటు సాగింది. అనంతరం కేంద్ర హోం మంత్రి అన్ని పార్టీల అభిప్రాయాలు తెలిశాయి నెల రోజుల్లో తెలంగాణా సమస్యను పరిష్కరించడం జరుగుతుందంటూ ప్రకటన చేశారు. నెల తర్వాత కానీ కాగ్రెస్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది తెలియదు.

అయితే ఆయా పార్టీల నాయకుల మాటలూ చేతలూ చూస్తుంటే పై మూడు పార్టీల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. కాంగ్రెస్‌ పార్టీలో లగడపాటి, గాదె, టిజి వంటి నేతలు ఎప్పటిలాగే సమైక్యవాద సింహ గర్జనలు చేస్తుంటే, అదే పార్టీలోని కెకె, పొన్నం, వివేక్‌ తదితర తెలంగాణా నేతలు గతంలో మాదిరిగానే తెలంగాణా తథ్యం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ”మా చేతుల్లో ఏంలేదు కేంద్రమే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి” అంటూ గో.పి. పాట పాడుతున్నారు. ఇక టీడీపీ తెలంగాణా నేతల జైకొడుతుంటే ఆంధ్ర నేతలు ఎదురుతిరుగుతున్నారు.

టీడీపీ అన్ని ఇతర పార్టీల్లాగే అఖిల పక్షానికి ఇద్దరు ప్రతినిధులను పంపించింది. కానీ ఎవరూ అడగకపోయినా ఒక అడుగు ముందుకు వేసి ఆ పార్టీ అధినేత  హోం మంత్రికి ఒక సీల్డ్‌ కవర్‌ని పంపించారు. అఖిలపక్షంలో లిఖిత పూర్వకంగా తన అభిప్రాయం తెలిపిన ఏకైక పార్టీ టీడీపీ ఒక్కటే. గమ్మత్తైన విషయం ఏమిటంటే టీడీపీ ప్రతినిధులు అఖిలపక్షంలో చెప్పిన మాట ఒకరకంగా….పార్టీ అధినేత సీల్డ్‌ కవర్‌లో పంపించిన లేఖలోని అభిప్రాయం మరొకవిధంగా వుంది.

అఖిలపక్షంలో ఆయా పార్టీల ప్రతినిధులు కచ్చితంగా ఏం చెప్పారనేది హోంమంత్రిత్వ శాఖ మినిట్స్‌ని బహిరంగ పరిస్తే కానీ తెలియదు. కానీ టీడీపీ అధినేత పంపిన లేఖ మాత్రం యథాతధంగా ప్రజల ముందుకు వచ్చింది. సహజంగానే నోటి మాటకంటే లిఖిత అభిప్రాయానికే విలువ ఎక్కువ.

తెలుగుదేశం పార్టీ ఆ లేఖను ఇంగ్లీషులో రాసింది. కేంద్ర హోం మంత్రికి తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీషులో రాయడం తప్పేమీ కాదు. కానీ తెలుగు ప్రజల కోసం దాని తెలుగు అనువాదాన్ని కూడా పత్రికలకు విడుదల చేసివుంటే యావత్‌ తెలుగు ప్రజలకు సౌలభ్యంగా వుండేది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఆ పనిచేయాలి.

తమ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిందని  టీడీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. నిజమేనా?  వాస్తవానికి ఆ లేఖలో ఏముంది?

” మా పార్టీ అప్పటి విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ప్రణబ్‌ ముఖర్జీ గారికి 18-10-2008 నాడు ఇచ్చిన లేఖ ఇప్పటికీ మీ ప్రభుత్వం వద్దనే వుంది. దానిని మేము వెనక్కి తీసుకోలేదు”

”అప్పటి హోం మంత్రి శ్రీ పి.చిదంబరం గారు 03-5 -2012 నాడు పార్లమెంటులో స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ తన  అభిప్రాయం ఇప్పటికీ తెలియజేయలేదు అన్నారు.”

”కావున ఈ అనిశ్చితిని తొలగించేందుకు సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవాలసిందిగా భారత ప్రభుత్వాన్ని మా పార్టీ అభ్యర్థిస్తోంది”

కాలయాపనకు వేసిన, కాలగర్భంలో కలసిపోయిన  ప్రణబ్‌ముఖర్జీ కమిటీని తెలుగుదేశం పార్టీ ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటోంది. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి తను ఇచ్చిన లేఖలోని అంశాలను తనే బేఖాతరు చేసింది కదా. డిసెంబర్‌ 9 ప్రకటన వెలువడిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర నేతలతో చేతులు కలిపిి టీడీపీ రాజినామాల అస్త్రం ప్రయోగించింది. అసెంబ్లీలో పార్లమెంటులో ద్వంద్వ వైఖరితో సమైక్యవాద,  తెలంగాణావాద నినాదాలు చేసింది. శ్రీృష్ణ కమిటీకి కూడా ప్రణబ్‌ ముఖర్జీ కమిటీలోని అంశాలకు విరుద్ధంగా సమైక్య అనుకూల, తెలంగాణా అనుకూల నివేదికలు వేరువేరుగా ఇచ్చింది. ఇన్ని చేసిన తరువాత ఇంకా ఆ లేఖకు ప్రామాణికత ఎక్కడుంటుంది? మేం వెనక్కి తీసుకోలేదు వెనక్కి తీసుకోలేదు అంటే మరి ఈ మూడేళ్లలో జరిగిన తతంగమంతా ఏమిటి? తనే ధిక్కరించిన ఆ లేఖను ప్రస్తావించాల్సిన అవసరం వుందా. వెనక్కి తీసుకోలేదంటే… అసలు ఇచ్చిన లేఖలను ఏ పార్టీ అయినా వెనక్కి తీసుకుందా?

ఇప్పుడు కేంద్ర హోంమంత్రి షిండే అడుగుతున్నప్పుడు ”మా పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం. లేదా మా పార్టీ సమైక్యతనే కోరుకుంటోంది” అని స్పష్టంగా ఒక్క వాక్యం రాయక ఈ డొంకతిరుగుడంతా ఎందుకు? ఇంత గందరగోళం ఎందుకు? ఎవర్ని ఏమార్చడానికి?

ఇది స్పష్టమైన లేఖా? ఇదేనా స్పష్టత అంటే. 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను ప్రస్తావించడం అంటే 2009/2010లో మాదిరిగానే మళ్లీ దానిని ఉల్లంఘిస్తాం అని అన్యాపదేశంగా సూచించడమే? అసలు ఇద్దరు ప్రతినిధులను పంపించిన తరువాత మళ్లీ ఇంత గందరగోళపు లేఖను పార్టీ అధ్యక్షుడు స్వయంగా సీల్డ్‌ కవర్‌లో పెట్టి పంపాల్సిన అవసరం ఏమిటి? తన ప్రతినిధుల మీద నమ్మకం లేకనా? ప్రతినిధుల మాటలనా లేఖనా దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి? అన్నీ శేషప్రశ్నలే.

తెలుగుదేశం పార్టీ గతంలో తెలంగాణా విషయంలో తీసుకున్న యూటర్న్‌ని, చేసిన మోసాన్ని దృష్టిలో పెట్టుకునే
ఇప్పుడెవ్వరూ ఈ లేఖను నమ్మడం లేదు. సందేహం వ్యక్తంచేస్తున్నారు

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ నారాయణ మాట్లాడుతూ ”ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇంతకంటే స్పష్టంగా చెప్పాలని ఆశించడం తగదు” అన్నారు.  ”ఆంధ్ర ప్రాంతంలో వాళ్లకుండే ఇబ్బందులేవో వాళ్లకున్నాయి.” అంటూ తెలుగుదేశాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు.

ఏం ఇబ్బందులు? ఇక్కడ తెలంగాణా వాదం అక్కడ సమైక్యవాదం వల్ల, రెండు కళ్ల సిద్దాంతం వల్ల ఏ ఇబ్బందీ వుండదా? ఆ విధానంతోనే అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణాలో అనేక ఉపఎన్నికలకు వెళ్లారు కదా. ఎలాంటి ఫలితాలు వచ్చాయి? అక్కడా ఇక్కడా అనేక చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు కదా. ఈ డబుల్‌ గేమ్‌, ఈ ముసుగులో గుద్దులాట ఇంకా ఎంతకాలం, ఏం ప్రయోజనం కోసం.

తెలుగుదేశం పార్టీ 2004 లో సమైక్య వాదంతో ఎన్నికలకు వెళ్లింది. వర్కవుట్‌ కాలేదు. 2009లో తెలంగాణాకు అనుకూల పంథాతో టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకుని మరీ ఎన్నికలకు వెళ్లింది. అదీ వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత ఉపఎన్నికలలో అక్కడ సమైక్యవాదం ఇక్కడ తెలంగాణా వాదంతో అనే రెండు కళ్ల సిద్ధాంతంతో ఎన్నికలకు వెళ్లింది అదీ ఫలితాలనివ్వలేదు.

విశ్వసనీయత కోల్పోవడం సులువు కానీ తిరిగి పొందడం చాలా కష్టం అనేది టిడిపి విషయంలో మరింత స్పష్టంగా
రుజువయింది..

నిజానికి తెలుగుదేశం పార్టీ తన సభ్యులందతో విస్తృతంగా చర్చించి, వారిని ఒప్పించి సిపిఐలాగా కచ్చితంగా ఒకలైన్‌ తీసుకుని దానికి కట్టుబడి వుంటే ఇంత సంకట స్థితి ఏర్పడేది కాదు. తప్పించుకోడానికి కాంగ్రెస్‌కు అవకాశం వుండేదికాదు.
తెలంగాణా సమస్య కూడా ఎప్పుడో పరిష్కారమై వుండేది.

వస్తున్నా మీకోసం పాదయాత్ర తెలంగాణాలో ప్రవేశించిన దగ్గరనుంచీ చంద్రబాబు ”నేను తెలంగాణాకు వ్యతిరేకంగా గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు, ఇకముందు మాట్లాడబోను. తెలుగుదేశం తెలంగాణాకు వ్యతిరేకంకాదు” అని పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ అదే స్ఫూర్తితో అనుమానాలకు తావులేకుండా అఖిలపక్షానికి మాత్రం సూటిగా చెప్పలేకపోయారు. సిపిఐ చేసినట్టు చిత్తశుద్ధితో ఒక నిర్థిష్ట నిర్ణయం తీసుకోలేకపోయారు. మరో పక్క పాదయాత్ర సమయంలో జైతెలంగాణా అనేందుకు, తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తించి బలపర్చేందుకు విముఖత చూపారు. పైగా తెలంగాణా నినాదాలు చేసిన, తెలంగాణా అంశంపై ప్రశ్నించిన వారిపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం, ద్వితీయ సంతకం, తృతీయ సంతకం ఫలానా ఫలానా ఫైళ్లమీద చేస్తాను, ఇంకా అదీ ఇదీ చేస్తాను అంటూ అనేక  వాగ్దానాలు చేశారు. కానీ దాదాపు తొమ్మిదివందల మంది బలిదానాలు చేసుకున్న  తెలంగాణా అంశం పైమాత్రం ఎలాంటి వాగ్దానం చేయలేకపోయారు. తెలంగాణా సాధనకు నేనున్నానని భరోసా ఇవ్వలేకపోయారు. తత్ఫలితంగా ఆయన పడ్డ శ్రమకు తగిన ప్రతిఫలం పొందలేకపోయారనే చెప్పాలి. ఈ పాదయాత్ర సందర్భంగా గనక ఆయన జై తెలంగాణా అంటూ కాంగ్రెస్‌ని ఎండ గడుతూ తిరిగివుంటే  ఆయనే అన్నట్టు  టీఆర్‌ఎస్‌ గుండెల్లో నిజంగానే రైళ్లు పరుగెత్తి వుండేవి.

ఈ అస్పష్ట విధానంతో, డబుల్‌ గేమ్‌తో రేపు ఎన్నికలకు వెళ్తే గత ఉప ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి?
సమైక్యవాదం అంటే తెలంగాణాలో నష్టం, ప్రత్యేకవాదం అంటే ఆంధ్రాలో కష్టం అని ఎంత కాలం భయపడతారు?

గుడ్డును పగలగొట్టకుండానే ఆమ్లెట్‌ కావాలనుకుంటే సాధ్యమవుతుందా?
తమ పార్టీకి లేని ఇబ్బంది టీడీపీకి ఎలా వుంటుందో కామ్రేడ్‌ నారాయణ గారే వివరించాలి.

 

.

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

2 Responses to గుడ్డును పగుల గొట్టొద్దు కానీ, ఆమ్లెట్‌ మాత్రం కావాలి …. అంటే ఎలా సాధ్యం కామ్రేడ్‌?

 1. Venkat says:

  Hi, you can not compare CPI, cpm, BJP with TDP and congress. Even though all those 3 parties are present before TDP was formed, they never got more than 10 percent votes, whereas TDP always got at least 30percent votes in all elections. But I strongly agree with you about one party one stand on Telangana. I think TDP cleared its stand now for separate Telangana state. Now why can’t KCR leave the decision to people to understand the contents of letter. TDP got complete opposition in seemandhra after all party meeting. Ironically, TRS also wants to blame TDP. TRS never blame congress even it didn’t tell its stand on Telangana. You mentioned about the TDP stand after December 9. Yes, MLAs from TDP in seemandhra have resigned. But, TDP never said no to Telangana, even at that time and never told centre that they are against their letter to Pranab mukherjee after Dec 9. I strongly believe that all parties MLAs will resign again if centre announces Telangana. Please don’t misunderstand my post, but that is what present in most of seemandhra people’s mind. I also want to tell you that all this negativism towards Telangana in the minds of seemandhra people is developed due to the scoldings on andhra people by KCR on several occasions. I support Telangana but not KCR.

  • Srikantha Chari says:

   @Venkat,

   The question here is whether TDP has clarified its stand or not. As per Narayana, it is not. And he has also given his reasons for that. This post here clarifies that the reasons are not substantial.

   Since TDP has not clarified its stand, but just tried to make an impression to T people that has talked to the side of Telangana. No one in Andhra side are actually concerned about this stand except few leaders who have already made their decisions to jump into Jagan party and just searching for reasons.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s