తండ్రీ కొడుకుల పంచ్‌ డైలాగులు !

TDP

ఎన్‌.టి.రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించిన కొత్తలో అంతవరకూ కాంగ్రెస్‌ పార్టీలో వున్న చంద్రబాబు నాయుడు ”కాంగ్రెస్‌ పార్టీ అదిష్టానం గనక ఆదేశిస్తే నేను మా మామ మీద పోటీ చేయడానికైనా సిద్ధమే” అన్నారు. ఆ డైలాగు ఆనాడు అన్ని పత్రికల్లో పతాక శీర్షికలతో వచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది.

అదేవిధంగా ఈనాడు లోకేష్‌ నాయుడు ట్విట్టర్‌లో ట్వీటిన డైలాగు కూడా అంతకంటే పెను దుమారం సృష్టిస్తోంది. ”హరీష్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అటెండర్‌ పోస్ట్‌కు మీ అప్లికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నా” ; ”కెటిఆర్‌ మీ రాజినామా ఎప్పుడు ఆశించవచ్చు?” అంటూ లోకేష్‌ టిఆర్‌ఎస్‌ నేతలను సవాల్ చేశారు.

ఈ పంచ్‌ డైలాగుల నేపథ్యం ఏమిటి? ”తెలుగుదేశం పార్టీ గనక తెలంగాణా ఇవ్వండి అంటూ కేంద్రానికి లేఖ ఇస్తే తను ఆ పార్టీ ఆఫీసులో అటెండర్‌ పనిచేయడానికైనా సిద్ధమే” అని హరీష్‌రావు , అట్లాగే ”టీడీపీ గనక తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇస్తే తను ఎంఎల్‌ఎ పదవికి రాజినామా చేసి రాజకీయాలకు దూరంగా వుంటానని” కెటిఆర్‌ లోగడ ప్రకటించారు.

నిన్న అఖిలపక్షంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం అని లోకేష్‌ పంచ్‌ డైలాగ్‌  అంతరార్థం. దీనికి హరీష్‌ రావు, కెటిఆర్‌లు దీటుగానే జవాబిచ్చారు.

మామ మీద పోటీ చేస్తానని పంచ్‌ డైలాగ్‌ కొట్టిన చంద్రబాబు ఆ తర్వాత 1983 ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ సంచలన విజయం సాధించగానే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలోకి జంపైపోయారు. ఆ తర్వాత మామగారి సింహాసనాన్నే చేజిక్కించుకున్నారు. అది వేరే విషయం.

‘ముక్కెక్కడుంది అంటె మూడు వంకర్లు తిరిగి చెవిని పట్టుకుని చూపిస్తున్నట్టున్న లేఖ’ సంగతి అ లా ఉంచి రేపు నిజంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటిస్తే చంద్రబాబు, లొకేష్‌ బాబుల రెస్పాన్స్‌ ఎలావుంటుందా అన్నదే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

2009 డిసెంబర్‌ 9 తెలంగాణా ప్రకటన వెలువడ్డ తరువాత  అంత వరకు తెలంగాణాకు తను అనుకూలం అంటూ వచ్చిన తెలుగుదేశం ఒక్కసారి ఎలా మాటమార్చిందో అందరికీ తెలుసు. రేపు అదే సీన్‌ పునరావృతమవుతుందా?

కాంగ్రెస్‌ (ఆనాడు రాజకుమారి అన్నట్టు) ‘పుసుక్కున’ తెలంగాణాను మళ్లీ ప్రకటిస్తుందా?

ఈ శేష ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరో నెల ఆగక తప్పదు.

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

2 Responses to తండ్రీ కొడుకుల పంచ్‌ డైలాగులు !

 1. Venkat says:

  Ok. I am confused about your post. Please tell whether you are a supporter of Telangana or KCR or Telangana through KCR only. If you are a supporter of KCR, I have nothing to say. If you are a supporter of Telangana, I feel bad about your comments, as you always criticize TDP whether it clears its stand on Telangana or not.

  • TDP has clearly expressed its stand on (for) Telangana during 2008 in its letter to Pranabh Committee. Later, it came into alliance with TRS and expressed clear stand on Telangana and kept the same in its election manifesto during 2009 elections. On Dec 7th, 2009 in all party meeting it said that the party is for separate Telangana state. On Dec 8th 2009, CBN challenged then CM Rosaiah to go for resolution in Assembly which he would support.

   In spite of all the above incidents, he took a U Turn on 10th Dec 2009 saying that how could a madrasee and karnatic take decision on the state. After taking clear stand on Telangana state for 5 consecutive incidents, CBN dropped his stance and gone against Telangana when the congress government has announced the state formation.

   But this time in his letter to Shinde, his stand is far from any clarity but only a desperate trial for continuation of perennial deception. In his letter, he neither has made a clear stand not he asked the center to put an end to the problem. He only has informed that he did not withdrew his letter to Pranabh committee, which is non existent even if he wants to withdraw.

   In spite of the letter, he has the history of taking U-Turn on his party decision, then how could any one believe that he would stand for formation of the state now? Now he is not even making his stand clear on Telangana saying that he wants to split the state.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s