తెలంగాణా యాసను అవహేళన చెసేది మీరే – తెలుగు తల్లి బొమ్మ చూపించి తెలంగాణాను మాయ చెసేదీ మీరే !

తెలంగాణ యాస

తెలంగాణ యాసనెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు!

వాక్యంలో మూడుపాళ్లు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూ పదం దొర్లగానే
హిహీ అని ఇకిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు!

‘రోడ్డని’ పలికేవారికి
‘సడక్‌’ అంటె ఏవగింపు
ఆఫీసని అఘోరిస్తూ
‘కచ్చేర’ంటె కటువు!
‘సీరియలంటె’ తెలుగు
‘సిల్సిలా’ అంటె ఉర్దు

సాల్టు, షుగర్‌, టిఫిన్‌ …తెలుగు
షక్కర్‌, నాష్ట అంటె కొంప మునుగు!
‘టీ’ అంటే తేట తెనుగు
‘చా’ అంటే తౌరక్యము!

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటే పొక్క తెలివి
బర్రె అంటె నవ్వులాట
గేదంటే పాలు!
‘పెండ’ంటే కొంప మునుగు
‘పేడ’ంటేనే ఎరువు!

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు!!
తక్కినోళ్ల నోళ్ల యాస
తొక్కి నొక్కిపెట్టు తీర్పు

వహ్వారే సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహార్దమ్ము !!

– ప్రజాకవి కాళోజీ

KALOJI

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

5 Responses to తెలంగాణా యాసను అవహేళన చెసేది మీరే – తెలుగు తల్లి బొమ్మ చూపించి తెలంగాణాను మాయ చెసేదీ మీరే !

 1. abn says:

  approve comment if you have guts..
  మీది ఎప్పుడు చూడు ఏడుపు
  ఎల్లలు దాటి మీరు ఎక్కడైన ఉండవచ్చ్చు
  సాటి తెలుగు వాడు మీకు తగడు
  పరాయి వాడు మిమ్ములను కుళ్ళబొడుచు..

  • J T Bandagi says:

   ఎబిఎన్
   ఇంతోటి కామెంటు కు గట్స్ కావాలా.
   అవును మాది ఎప్పుడూ ఎడుపే…
   1956లొ మా అస్తిత్వాన్ని, మా స్వాతంత్రాన్ని, మా నీళ్ళని, నిధులని, ఉద్యోగాలని, భూములని కొల్పోయినప్పటినుంచీ మాకు ఎడుపే మిగిలింది.
   ఇప్పుడు ఇంకా ఎడ్చే ఓపిక లేదు .
   చావనైనా చస్తాం కానీ మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని, మా హక్కులను, వదులుకోం
   మా తెలంగాణాను మేం సాధించుకునే వరకూ … మీ ఆధిపత్యానికి, దొపిడీకి గోరి కట్టేవరకూ మా పోరాటం ఆగదు.

 2. srdhr says:

  good reply to abn by bandagi …..:)

 3. srdhr says:

  kaloji knew very well about these ‘A’fellows….people attitude not changed till date

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s