ఆనాటి నాయకులు ఏమి చేశారు… ఈనాటి నాయకులు ఏమి కూశారు…!

Delhi

”ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగి క్షేమంగా ఇంటికి  రాగలిగిన రోజే మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు
భావిస్తాను” అన్నాడు గాంధీ.

మరి ఈనాటి నాయకులు ఏం అంటున్నారు?
తలచుకుంటేనే కంపరంగా వుంది.

ఇవాళ దేశానికి దిశానిర్దేశం చేయగలిగిన నాయకులు…
ప్రజలకు భరోసా ఇవ్వగలిగిన నిజాయితీ నిబద్ధత వున్న నేతలు ఒక్కళ్లూ కనిపించకపోవడం…
మొత్తం సమాజమంతా యధా రాజా తథా ప్రజా అన్నట్టు తయారు కావడం
చాలా నిరాశను కలిగిస్తోంది.

దుర్భరమైన, దుర్మార్గమైన మౌనం… క్రిమినల్‌ సైలెన్స్‌…
లేదంటే పుండుమీద కారం చల్లినట్టుండే మాటల్ని జనాలమీదకు వదలి పరిస్థితిని ఇంకా దిగజార్చడం…ఇదీ ఈనాటి మన ప్రజానాయకులు అనుసరిస్తున్న విధానం .

తెలంగాణా సమస్య మీద అయితే ఈ రాజకీయ దివాళాకోరుతనం పతాకస్థాయికి చేరుకుంది.

యువతలో కెరీరిజం పెరగడం వల్ల దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పట్టించుకునేవాళ్లే లేకుండాపోయారని
నిరాశపడుతున్న తరుణంలో…
ఇన్నాళ్లకి మళ్లీ ఢిల్లీ యువత కారుచీకటిలో కాంతికిరణాల్లా ముందుకురావడం
దేశ భవిష్యత్తుకు ఢోకా లేదన్న ఆశల్ని తిరిగి చిగురింపజేస్తోంది.

”కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు
పేర్లకీ ఫకీర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు
నేటినిజం చూడలేని కీటక సన్యాసులు
మరికొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు
పావన నవ జీవన బృందావన నిర్మాతలు
వారికి నా ఆహ్వానం వారికి నా శాల్యూట్‌ ” (శ్రీశ్రీ)

.

Advertisements
This entry was posted in Nadustunna Charitra. Bookmark the permalink.

2 Responses to ఆనాటి నాయకులు ఏమి చేశారు… ఈనాటి నాయకులు ఏమి కూశారు…!

  1. K.Ramesh says:

    The separation is not a issue at all, it can be shelved for another 50years. Other issues like crime, law&order, FDI, Corruption take paramount importance. Congress handling Telangana issue appropriately, the way it deserves. Unless AP assembly passes a resolution with 2/3 majority, center should keep it in cold storage. In case of problem, indefinite His excellency Narasimhan’s rule may be imposed on the disturbed emotionally spiked regions may it be Seema, Coastal or Tgn. He can handle, nicely.

  2. K.Ramesh says:

    You have mixed-up so many unrelated issues, a clear state of confusion.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s