తేనె పూసిన కత్తిలాంటి డైలాగు : “అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం!”

తేనె పూసిన కత్తిలాంటి డైలాగు : “అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం!”

‘సత్యం తో నా ప్రయోగాలు’ అన్నాడు ఆనాటి గాంధీ (మై ఎక్స్‌పరిమెంట్‌ విత్‌ ట్రూత్‌).
‘అసత్యం తో ప్రయోగాలు’ చేస్తున్నారు ఈనాటి గాంధీ శిష్యులు (అవర్‌ ఎక్స్‌పరిమెంట్‌ విత్‌ లైస్‌).

ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక జవాబుదారీతనం, ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షల పట్ల కనీస గౌరవం, ఇచ్చిన మాటకు కట్టుబడివుండాలనే ఇంగితం ఏమీ లేవు వీళ్లకి.

ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు!
ఎంత సులువుగా అన్న మాటలను మరచిపోతున్నారు!
ఎంత దుర్మార్గంగా ప్లేట్లు ఫిరాయిస్తున్నారు!
ప్రజాస్వామ్య వ్యవస్థని ఎంత కిరాతకంగా అపహాస్యం చేస్తున్నారు!

ఇన్నాళ్లు ఈ కపటనాయకులు మాటల్లోని డొల్లతనాన్ని చాలామంది గమనించలేదేమో
కానీ మలి తెలంగాణా ఉద్యమం మొదలైన తరువాత వీళ్ల నగ్న స్వరూపాలన్నీ నడిబజార్లో బట్టబయలవుతున్నాయి.
సామాన్య ప్రజలకు కూడా వీళ్ల అసలు రంగు స్పష్టంగా అర్థమవుతోంది.

నీళ్లను పాలను వేరు చేసే హంస నా తెలంగాణా.

తేనె పూసిన కత్తిలాంటి ఈ డైలాగు దాని వెనకున్న కుతంత్రం ఒక్కసారి చూడండి:

”తెలంగాణాపై అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం”

”తెలంగాణాపై ఏకాభిప్రాయం వస్తేనేకానీ ఏ నిర్ణయమూ తీసుకోలేం”

ఏంటా కృషి?
ఎప్పటినుంచి చేస్తున్నారు?
ఈ తతంగం ఎన్నాళ్లు సాగుతుంది?
ప్రజాస్వామ్య వేదికలైన అసెంబ్లీ, పార్లమెంటుల్లో కాకుండా ప్రైవేటుగా కృషి చేయడం ఏమిటి?
మీరు నిర్ణయం తీసుకునేసరికి ఇంకా ఎంత మంది అమాయకులు బలికావాలి?

అసలు ఆనాడు అన్ని పార్టీలను అడిగి సరేనంటేనే కదా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నా మంటూ పార్లమెంటులో ప్రకటించారు?

24 గంటల్లో పార్టీలన్నీ మాటమార్చడం న్యాయమేనా?

ఇట్లా ఇష్టారాజ్యంగా ప్లేట్లు ఫిరాయించే పార్టీల బెదిరింపులను, దొంగమాటలను పట్టుకుని వేలాడకుండా నేరుగా ప్రజల్నే ఎందుకు అడగరు? ప్రజాభిప్రాయ సేకరణ జరిపి సత్వర నిర్ణయం తీసుకోవచ్చు కదా?

అన్యాయం చేసేవారికీ అన్యాయానికి గురయ్యే వారికీ మధ్య ఏకాభిప్రాయం ఎలా వస్తుంది?

విడిపోయేందుకు మాత్రమే ఏకాభిప్రాయం అవసరమా?
కలసి వుండేందుకు ఏకాభిప్రాయం అవసరం లేదా?

తెలంగాణా ప్రజలు ఒప్పుకోకపోయినా బలవంతంగా పోలీసుల అణచివేతతో వారిని ఆంధ్ర ఆధిపత్యం కింద సమైక్యంగా వుంచుతారా?

ఇదేం ఏకాభిప్రాయం? ఇదేం ప్రజాస్వామ్యం?
కీలకమైన అంశం ఎఫ్‌డిఐల మీద ఏకాభిప్రాయం లేకపోయినా ఎలా నిర్ణయం తీసుకున్నారు?

వీటికి ఎవరైనా జవాబు చెప్పగలరా?

ఈ డ్రామాలను ఇలాగే కొనసాగిస్తే …
రేపు కోటి రతనాల వీణ తెలంగాణాయే మీ భరతం పడుతుంది.

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s