ఏ రోటికాడ ఆ పాట పాడుతూ రెండు ప్రాంతాలను బుట్టలో వేసుకోవడం అంత వీజీ కాదని చాటిన ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు!

TSRTC ASRTC

ఏ రోటికాడ ఆ పాట పాడుతూ రెండు ప్రాంతాలను బుట్టలో వేసుకోవడం అంత వీజీ కాదని చాటిన ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు!

కోటలు కూలినయ్‌.
దశాబ్దాల అహంభావానికి బీటలు వారినయ్‌.
అబద్ధాలు, అడ్డగోలు మాటలు, జిత్తులమారి ప్రచారాలు అన్నీ ”గాలి”కి కొట్టుకపోయినయ్‌.
ఇది అసొంటి ఇసొంటి గాలి కాదు, తెలంగాణ గాలి…!
రేపటి ప్రభంజనాన్ని సూచిస్తున్న గాలి…!
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని చాటుతున్న గాలి…!

ఆర్టీసీలో ఊడల మర్రిలా పాతుకుపోయిన ఎన్‌ఎంయూ (నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌) తెలంగాణా గాలి ప్రభావానికి కూకటివేళ్లతో సహా కుప్పకూలింది.

ఎన్‌ఎంయూ తెలంగాణాలో నక్క జిత్తులతో జై తెలంగాణా అని గొంతుచించుకుంటూ, సీమాంధ్రలో ”సకలజనుల సమ్మెను విచ్ఛిన్నం చేసిన నికార్సయిన సమైక్యవాదులం మేమే. టిఎంయూ, ఎంప్లాయీస్‌ కూటమిని గెలిపిస్తే రాష్ట్రం ముక్కలైపోతుంది” అంటూ విషప్రచారం చేసింది.

అయినా ఆర్టీసీ కార్మికుల ముందు దాని పప్పులేం ఉడకలేదు. రెండు ప్రాంతాల్లో రెండు నాలుకలతో మాట్లాడే ఎన్‌ఎంయూకు ఛీ కొట్టారు.
నిజాయితీగా ఒకే స్వరంతో మాట్లాడిన టిఎంయూ (తెలంగాణా మజ్దూర్‌ యూనియన్‌) ఇ.యు. కూటమికి జై కొట్టారు.

ఎంప్లాయీస్‌ యూనియన్‌ సిపిఐ కి అనుబంధ సంస్థ.
సిపిఐ నిర్ద్వంద్వంగా ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇవ్వడమే కాదు అందుకు పోరాటం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణాలో టిఎంయూ గెలవడం విశేషం కాదు.
కానీ సీమాంధ్రలో తెంగాణాకు మద్దతు పలికే పార్టీ యూనియన్‌ గెలుపు నిస్సందేహంగా విశేషమే.

రేపటి సాధారణ ఎన్నికలలో కూడా ఇదే పునరావృతమవుతుంది.
ఇక్కడ జైతెలంగాణా అంటూ
అక్కడ జై సమైక్యాంధ్ర అంటూ డబుల్‌ గేమ్‌ ఆడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా రెండు గుర్రాల స్వారీ మానేసి ఒక నిర్ణయం తీసుకుని దానికి నిజాయితీగా కట్టుబడివుంటే మంచిది.

లేకపోతే రెంటికి చెడ్డ రేవడి అవడం ఖాయం.

Jodu Gurraala Svaary 2

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

9 Responses to ఏ రోటికాడ ఆ పాట పాడుతూ రెండు ప్రాంతాలను బుట్టలో వేసుకోవడం అంత వీజీ కాదని చాటిన ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు!

 1. chandra says:

  ante siddhipetalo samaikyavaadam, vijayawaadalo vibhajana vaadam gelichindantaaraa??

  • Bandagi says:

   చంద్ర గారూ,
   టెక్నికల్ గా అంతే కావచ్చు
   కానీ ప్రజాస్వామ్యం లో మెజారిటీ యే డిసైడింగ్ ఫాక్టర్.
   మెజారిటీ ని బట్టే ఇప్పుడు వీస్తున్న గాలిని అంచనా వేయాలి .
   ఎన్ ఎం యూ కి జంటనగరాలు, బస్ భవన్ కంచు కోటలు.
   ఇంతవరకూ ఎన్ ఎం యూ తప్ప అక్కడ మరో యూనియన్ మెజారిటీ సాధించలేదు.
   అలాంటి చోట కూడా అది కుప్ప కూలిపోయింది.
   ఎన్ ఎం యూ జిత్తుల మారితనం తో అక్కడ సమైక్యాంధ్ర , ఇక్కడ జై తెలంగాణా నినాదం చేసినా పనికి రాలేదు.
   డబుల్ గేమ్ లు రెండు కళ్ళ సిద్ధాంతాలు ఎంతో కాలం నిలబడవు, మెజారిటీ జనాన్ని మోసం చేయలేవు
   కొందరు మోసపోతే పోవచ్చు అంతే .

 2. JaganFan says:

  తెలంగాణ రోటి పాటతో తెలంగాణాలో గెలిస్తే ఏమైన్సి? గెలుస్తుంటారు, ఓడుతుంటారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓడితే హిమాచల్‌లో గెలిచింది. ఇందుకు చంకలు గుద్దుకోవడం, మిడిసిపడటం దేనికి? పరకాలలో చావు తప్పి కన్నులొట్టపోయినట్టు అంత తక్కువ మెజారిటీ ఎందుకొచ్చింది? రాజన్నరాజ్యం కావాలనుకునే ప్రజలు వుండబట్టే కదా.
  జై జగన్
  జైజై సురేఖమ్మ

 3. JaganFan says:

  ప్రజాస్వామ్యం లో మెజారిటీ యే డిసైడింగ్ ఫాక్టర్. అంటే అసెంబ్లీలో తీర్మానం వీగిపోతే తెలంగాణ లేనట్లే.

  • Bandagi says:

   జగన్ ఫాన్
   ముందు ఇది చెప్పండి
   మీ సురేఖమ్మ తెలంగాణా కొసమే రాజినామా చెసాను జై తెలంగాణా జై తెలంగాణా
   మీ విజయమ్మ, షర్మిలమ్మ మేం కెంద్రం తెలంగాణ ఇస్తే అద్దు చెప్పం. తెలంగాణా ప్రజల మనో భావలను గౌరవిస్తున్నాం అని పదె పదె పరకాలలొ ప్రచారం చేసారు నిజమేనా
   ఆ మాటల్లో నిజాయితీ వుందా. ? దానికి కట్టుబది వుంటారా ?
   ఇక తర్వాత అంశం :
   ఆ సీటు కొందా సురేఖమ్మది దానిని ఆమె నుంచి టీ ఆర్ ఎస్ గెలుచుకున్నది. చావు తప్పి కన్ను లొట్ట పోవడం ఎమితి ఎవరికి.
   మీరు ఎ ముసుగులు లెకుందా సమైక్యవాదం జగనన్న రాజ్యం అని ప్రచారం చెసి అప్పుదు వాదించండి
   కొత్త రాష్త్రాల ఎర్పాటుకు బిల్లు పెట్టాల్సింది అసెంబ్లీలొ కాదు పార్లమెంటులొ.
   అక్కద ఒదిపొతే రాష్త్రం రాదు.
   అసెంబ్లీలొ నిజాయితీగా చర్చించె, ఒక మాట మీద నిలబడే ధైర్యం ఏ పార్తీకి వుంది.
   అన్నీ పైకి ఒకటి లొపల ఒకటి.

   • JaganFan says:

    దొంగ నిరాహార దీక్షలో నిబద్ధత వుందా?
    అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలాడటంలొ నిబద్ధత వుందా?
    మజగాన్ డాక్‌లో షిప్పింగు పెట్టుబడులు డిక్లేర్ చేయడానికి నిబద్ధత వుందా?
    పోలవరం టెండర్లలో మన భాగమెంత? ఇందులో నిబద్ధత వుందా?
    సురేఖమ్మ మీద మీ మెజారిటీ ఎంత? మీకు పోలైన ఓట్లెంత శాతం? మీ వేర్పాటువాదానికి కనీసం 50% ప్రజల మద్దతు లేదా?
    సినిమ వాళ్ళ దగ్గర వసూళ్ళకు నిబద్ధతతో కూడిన లెక్కలున్నాయా?
    రాజన్న రాజ్యంలో బొక్కిన తెలంగాణా మంత్రులు పొన్నాల, సబితారెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్ళకు విశ్వాసముందా?
    తీర్మానానికి సీమాంధ్ర పార్టీలు ఎందుకు మద్దతివ్వాలి మొత్తుకుంటున్నారు? మెజారిటీ మద్దతులేకుండా మీరు ఆడినట్లు ఆడాలా? మీకనుకూలంగా లేకపోతే తిరగనీయం అనడం ప్రజాస్వామ్యంలో డిసైడిగ్ ఫాక్టరా?
    వీటన్నిటికి సమాధానం గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పండి.
    రాజన్న రాజ్యంలో మీ కోరికలు తీరుతాయి. మీ పార్టీలను వైకాప్‌లో విలీనం చేయండి.
    జై కొండా సురేఖమ్మ
    జై విజయమ్మ
    జై జగనన్న రాజన్న రాజ్యం

   • J T Bandagi says:

    ఇలాంటి వితండ వాదాలు వృధా మిత్రమా.
    సురేఖమ్మది ఏ వాదమో,
    తెలంగాణాలొ ఏ పార్టీ సమైక్య వాదంతొ పోటీ చెసిందో చెప్పండి .
    ముందు మీరు సమైక్యవాదంతో పోటీ చెసి అప్పుడు టీ ఆర్ ఏస్ ని అనండి..
    ఎన్నికలప్పుదు మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదని దొంగ మాటలు చెప్తూ తర్వాత ఈ డబుల్ గేం ఎంతకాలం
    అరిగిపోయిన రికార్డులు ఎంతకాలం

   • JaganFan says:

    అసెంబ్లీలొ నిజాయితీగా చర్చించె, ఒక మాట మీద నిలబడే ధైర్యం ఏ పార్తీకి వుంది.
    అన్నీ పైకి ఒకటి లొపల ఒకటి.
    =================================================
    రాజీనామా ఆటలాడిన తెరాసకే వుంది.
    మీకు లోపలా బయటా ఒకటే కుళ్ళే.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s