చచ్చిపోదాం రా … !!

తెలంగాణా బిడ్డల ఆత్మ బలిదానాలంటే ఈ రాజకీయ కసాయి వ్యాపారులకు ఎంత హేళనైపొయిన్ది !
పార్లమెంటులో ప్రకటించిన తెలంగాణాను అడ్డుకున్నోల్లె  సిగ్గు ఎగ్గు లేకుండా మానవత్వం లేకుండా ఈ ఆత్మహత్యలకు మేం కాదు కె సి ఆర్ కారణ మని దబాయిస్తున్నరు !
గోబెల్ ప్రచారాలు చేస్తున్నారు .
మొసలి కన్నీరు కారుస్తున్నారు
ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి మరణ వాంగ్ మూలాల్లో బిడ్డలు అంత  స్పష్టంగా రాసినా ఈ అబద్ధపు ప్రచారాలను ఆపడం లేదు .
మొన్న  బొత్స గారు కాంగ్రెస్ సమావేశం లో తెలంగాణా అమర వీరులకు/  తుఫాన్ మృతులకు మొక్కుబడిగా “కూర్చునే సంతాపం చెప్పే సంప్రదాయానికి” తెరతీసి అవమానిన్చిండు.
ఇగ ఇప్పుడైతే  కొండా  సురేఖమ్మ డైలాగులు చూడున్ద్రి ఎట్లున్నాయో ..
తూ నీయమ్మ
గాంధి పుట్టిన దేశమా ఇది
నేహృకోరిన రాజ్యమా ఇది …
ఈ కంత్రి గాల్లా  మన రాజకీయ నాయకులు ..???????????????

Konda Surekha

ChachchiPodaamRaa

Chachchipodam 2

 

 

 

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

30 Responses to చచ్చిపోదాం రా … !!

 1. akhilesh says:

  surekha cheppindantlo tappemi ledhu.. chachi poinavallu antha samanya telangana biddalu.. vallalo okka KCR ledu Oka KTR ledu, Oka kavita, OKa rajender , oka dubba nagam lene leru 🙂

  Meeru pranalani daana michi choopinchandi. andaini chaavamani usigolpedhi kadha 🙂

  • J T Bandagi says:

   అఖిలేష్ గారూ
   ఎంత హోప్లెస్ గా వుంది మీ మాట.
   మనిషి ప్రాణం అంటే అంత చులకనగా అనిపిస్తోందా.
   ఒక అమ్మాయి మీద సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన మీద డిల్లీ లో విద్యార్ధులు ఎంత వీరోచితంగా తిరుగ బడుతున్నారో చూస్తున్నారు కదా.
   ఆ స్పిరిట్ లో ఒక్క శాతమైనా మీలాంటి వారిలో ఎందుకు కనిపించడం లేదు
   తెలంగాణలో ఇంతమంది అమాయకులు అన్యాయంగా బలిదానాలు చేసుకుంటుంటే ఇంత అమానుషంగా ఎలా పిచ్చి వాదనలు చేయగలుగుతున్నారు. ఎవరైనా ఆత్మా హత్య ఎందుకు చేసుకోవాలి
   అసలు సమస్య మూలకారణాలు వదిలేసి
   ప్రజాస్వామ్య స్ఫూర్తి ని కాలరాసి ఏమిటీ దుర్మార్గపు వాదనలు
   ఛి ఛి

   • Jagan Samyool Reddy says:

    వాళ్ళ నాయకులకు అగ్గిపెట్టె కూడా ఎందుకు దొరకడంలేదో అర్థం అయ్యేంతవరకూ అమాయకుల బలిదానాలు అర్థంలేనివే అవుతాయి. కొండాసురేఖ చెప్పేది అదే, కచరా మౌనమే అందుకు తార్కాణం.

 2. J T Bandagi says:

  జగన్ శామ్యూల్ రెడ్డి గారూ ,
  కాస్త మానవత్వం తో ఆలోచించండి.
  ఇక్కడ అసలు సమస్య తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు !
  దానిని పక్క దారి పట్టించేందుకు, దెబ్బ కొట్టేందుకు వాల్లెవరో దుర్మార్గంగా
  మాట్లాడితే మీరు దానినే అనుసరిస్తారా?

  ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణాను సత్వరమే ఏర్పాటు చేస్తే ఈ అమాయకుల బలిదానాలు ఆగిపోతాయి కదా
  దాని గురించి కాస్త పట్టించుకోండి.
  గాయపడ్డ తెలంగాణా ప్రజల ను ఎందుకు మరింత రెచ్చ గొడతారు ?

  ఆనాడు కెసీఆర్ తెలంగాణాకోసం గాంధీ చూపిన బాటలోనిరాహార దీక్ష చేయకుండా అరెస్ట్ చేయడం, ఆయన స్థానం లో నిరాహార దీక్షకు కూచున్న్ హరీష్ రావు ను అరెస్ట్ చేయడానికి పోలీసులు చుట్టూ ముట్టడం వల్ల … పొరపాటు ననో , గ్రహపాటుననో మరో గత్యంతరం లేక ఆత్మ హత్య చేసుకుంటానని హరీష్ రావు బెదిరించాడు.

  కేవలం దానిని పట్టుకుని ఎప్పటికీ అవహేళన చేయడమేనా ?
  గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేసే కనీస ప్రజాస్వామిక హక్కును కూడా తెలంగాణా నాయకులకు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం గురించి ఎందుకు మాట్లాడరు ?

  రిజర్వేషన్ల వ్యతిరేకోద్యమం లో ధిల్లీ లో రాజీవ్ గోస్వామి ఆత్మహత్య కు ప్రయత్నించడం వంటి సంఘటనలు గతం లో ఎన్ని జరుగలేదు మన దేశంలో ?

  అసలు దోషులను వదిలేసి, అసలు సమస్యను వదిలేసి … అతి కిరాతకంగా
  తెలంగాణా ఉద్యమం మీద బురద జల్లే ప్రయత్నం ఇకనైనా మానండి మీరూ మీ ఆదర్శ మహిళా నేత కొండమ్మానూ !
  జై తెలంగాణా !

  • అద్వానీ ఖాన్ says:

   @ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణాను సత్వరమే ఏర్పాటు చేస్తే
   అది మాటి ఇచ్చినోళ్ళకు, తీసుకున్నోళ్ళకూ మద్య సమస్య. రెండూ కాని వైకాపా, తెదెపా లమీద రోజూ బురద చల్లడం కిరాతక పొలిటికల్ డ్రామా

   • J T Bandagi says:

    అద్వానీ ఖాన్ జీ,
    తెలంగాణా ప్రకటన వెనక్కి పోయేలా ఆనాడు సొంత పార్టీ ని ఎదిరించి పార్లమెంటులో
    తెలుగు దేశం ఎంపీలతో కలసి ప్లకార్డు పట్టుకుని తెలంగాణాకు వ్యతిరేకంగా జగన్ నినదించిన సంగతి మరచిపోయినట్టున్నారు.
    మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అని ముందు చెప్పి తీరా తెలంగాణా ప్రకటన చేయగానే తెలుగు దేశం సీమాంధ్ర ఎం ఎల్ ఎ లు , ఎంపీ లు చేసిన రాజీనామా నాటకాలు ధర్నాలు రాజకుమారి వెళ్లి నిరాహార దీక్షకు దిగిన లగడపాటిని ముద్దుపెట్టుకోవడం అన్నీ మరచిపోయినట్టు న్నారు ?

   • అద్వానీ ఖాన్ says:

    పక్కా, అది వారి అభిప్రాయం. మీ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దాలనుకోవడం అనాగరికం, సభ్యసమాజం హర్షించదు. వ్యతిరేకిస్తారు వేయి నూరైనా వ్యతిరేకిస్తారు, వాళ్ళకు ఆ ప్రజాస్వామ్య హక్కు వుంది. నిజాం చెప్పులకింద నలిగిన బ్రతుకులు కాదు వాళ్ళవి. అవసరమైన దాన్ని వదలిపెట్టి అనవసమైనవి కెలుక్కుంటున్నారు. రోజా, విజయశాంతి కాంగ్రెస్‌లో దూకే అవకాశం కోసం YSRతో మంతనాలు జరపింది నిజం కాదా? ఆయన అనుకోకుండా చచ్చాడు కాబట్టి ఈమె తెలంగాణ అని చారనాకి ఢాయీ రూపయా ఆక్షన్ చేస్తోంది అని కచరాజీకి తెలియదా? ఈవిడ రుద్రమదేవిలా అగుపిస్తోందా? ఎల్.కె.అద్వాని తెలంగాణా ఇవ్వడం కుదరదు అని నరేంద్రకు పత్రం మీద రాసిచ్చినాడు, మరి ఈ కిషన్‌రెడ్డి, సుష్మాస్వరాజ్, బండారు దత్తాత్రేయ డ్రామాలాడటం లేదూ? వాళ్ళను నమ్మినట్లు నటించడం లేదూ? అన్యాయం అన్యాయం అని నోరెత్తి అరిస్తే కాదు, అకిల పక్షానికి హాజరీ వేసుకోండి, వుద్దరగా సమోసాలు తినండి, చాయ్ పోస్తాం తాగండి, బస్. అరగనీకి లొల్లి చేసుకోండి.

   • J T Bandagi says:

    అద్వానీ ఖాన్ గారూ,
    అసలు అంశాన్ని వదిలి ఏమిటేమిటో రాస్తున్నారు.
    రాజకీయ నాయకులంతా ఇవాళ డ్రామా లాడుతున్నారు,అనే దానితో మాత్రం ఏకీభవిస్తున్నాను
    మిగతా అంటా వెకిలిగా వుంది
    వాళ్ళ లాగ మనం డ్రామాలు వెకిలి వేషాలు ఎందుకు వేయాలి చెప్పండి.
    పాయింటు మీద హుందాగా చర్చిద్దాం.

 3. jagan Samuel Reddy says:

  బలిదానాలు కత్తిలాంటి పదం. నాకూ ఓ రాజ్యం కావాలి, లేదంటే బలిదానం చేస్తా అని అంటే అది న్యాయమైన కోర్కె అవుతుందా? అరెస్టుకు భయపడి కాల్చుకుంటా అని నాటకాలు ఆడతారా? కత్తిలాంటి నాటకం. కొండా సురేఖగారే వీళ్లకి తగిన పాఠం చెప్పగల నాయకురాలు.

  • J T Bandagi says:

   జగన్ శామ్యూల్ రెడ్డి గారూ.
   అన్యాయంగా మాట్లాడటం మా జన్మ హక్కు అనుకుంటే చేయగలిగిందేమీ లేదు.
   కొండా సురేఖ ఎంత డబ్బు కుమ్మరించినా తన సీటును తను గెలవలేక పోయింది
   ఇంకా చేసేదేముంది … గుండాయిజమనా మీ ఉద్దేశం ?

   • కొండా సురేఖ విషం తాగుతా అంటూ నాటకాలు చేసిన విషయం మరిచితిరా మిత్రమా? అన్ని డ్రామాలు ఆడినా, డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టినా ఆమె గెలువలేదు. రేపు జగన్ చంచాలందరికీ ఇదే గతి పడుతుంది.

   • JaganFan says:

    తెరాసను మాపార్టీలో విలీనం చేయండి. తీర్మానానికి అనుకూలంగా రాసిస్తాము, తీర్మానం పెట్టుకోండి. కాంగ్రెస్ ఎలాగూ మీదే, తెదెపా అవసరమే లేదు. రేపే క్రిస్మస్ మంచిరోజు, ఓ ప్రకటన చేసేయండి.

  • JaganFan says:

   గొట్టి ముక్కలగారు మీవాడు తలలు నరుక్కుంటే, విషం తాగడం ఆమెకి పెద్ద పనికాదు. ముందు మీరు కానియ్యండి, హరీష్‌కి అగ్గిపెట్టె కాదు లైటర్ దానగా ఇస్తా. ఢిల్లీ పిలుపులు, సంకేతాలు వచ్చేంత పెద్ద నాయకురాలు, పార్టీ అధ్యక్షురాలు కాదు అని మరచితిరో.

 4. CBN says:

  అధికారంలో వున్న కాంగ్రెస్‌ను వదిలేసి, తెలుగుదేశంపై అతికిరాతకంగా బుర్దచల్లుడు కిరాతకం కాదా? బర్థ్డే గిFత్ ఇస్తానని వాడమ్మ చెప్పింది, తీసుకొస్తా అని ఈయన చెప్పిండు. ఇగ మధ్యలో మెజారిటీ లేని తెదెపా వద్దంటే ఆపుతరా? పబ్లిక్‌ని ఎర్రిబాగులోల్లని చేసి డ్రామాలాడింది చాలు.

  • J T Bandagi says:

   సి బీ ఎబ్ జీ ,
   >>>> అధికారంలో వున్న కాంగ్రెస్‌ను వదిలేసి, తెలుగుదేశంపై అతికిరాతకంగా బుర్దచల్లుడు<<<
   వాహ్ క్యా బాత్ హయ్ ! క్యా డెమాక్రాటిక్ స్పిరిట్ హయ్ !
   అడ్వాన్ ఖాన్ జీకి ఇచ్చిన సమాదానమే మీకూ !

   • నాలుగు సార్లు (పాలిబ్యూరో తీర్మానం, ప్రణబ్ కమిటీకి రాసిన లేఖ, ఎన్నికల వాగ్ధాన పత్రం & డిసంబరు 7 అఖిల పక్షం తీర్మానం) చెప్పిన మాట మీద నిలబడే దమ్ము లేనోడు చంద్రబాబు.

    “మీరు తీర్మానం పెట్టండి, మేము మద్దతిస్తాం” అనే పదేపదే చెప్పిన చంద్రబాబు తీరా కేంద్రం తీర్మానం పెట్టమనే సరికి చెయ్యిచ్చిండా లేదా?

    తెదేపా (& ప్రరాపా) సభ్యులు అనుకూలంగా వోటు వేస్తె అసెంబ్లీలో తెలంగాణా తీర్మానం నెగ్గుతుంది. ఈ మాత్రం లెక్కలు కూడా రావా ఈ తెగులు తుమ్మలకు?

   • JaganFan says:

    మా కాళ్ళు పట్టుకోని బ్రతిమలాడితే ఓటు వేస్తాము, నరుకుతం ,గోరీలు కడతం అని పోతరాజుల్లా డాన్సులు వేస్తుంటే చేస్తే ఇదేదో బాగుందే అని చూసుకుంటూ ఓటేయడం మర్చిపోయాం. బిజెపి పక్కలో పడుకున్న కాంగ్రెస్ ఎస్కార్టులని తెర పడిపోయింది. మావోట్లే కావాల్సి వస్తే అదిగో అమ్మ పలికింది, ఇద్గిగో తెలంగాణ తెస్తాతెస్తా అని ఢిల్లీ పోయేటోళ్ళా? మెజారిటీ వుంది కాంగ్రెస్‌కా తెదెపా, వైకాపకా? గవర్నమెంటు ఎవరిది? నషాలో వుండి మాట్లాడుతున్నారా?

 5. JaganFan says:

  చంద్రబాబు, తీర్మానానికి మద్దతిస్తాం అనివుంటే అనివుంటారు. ‘ఆంధ్రావాలో భాగో’, సంక్రాంతికి వెళ్ళినోళ్లను రానీయం, గోరీలు కడతాం, నరుకుతం, రక్తాలు పారిస్తాం, సునామి తెప్పిస్తాం అని భయపెట్టే సరికి అదేదో చూద్దాం అనే వుత్సాహంతో, వుత్సుకతో మాట మార్చుకునివుంటారు. ఒక్కటీ చేయలేదు, మాట తప్పింది ఎవరు? తెరాస. ఇప్పటికైనా మాట నిలుపుకోండి, అదే అభిమానవతి అయిన మన కొండా సురేఖ ‘సచ్చిపోదాం రా, అని గుర్తు చేశారు. అది తప్పా? త్వరగా కానీయండి, ఎలక్షన్లొచ్చేస్తున్నాయ్. బలిదానాల విషయానికి వస్తే రాజన్నరాజ్యం జగనన్న తేవాలని పగిలిన గుండెలు ఎన్నో ఎన్నెన్నో. అమానుషంగా ఓదార్పు యాత్రలను అడ్డుకున్నారు. వారి బలిదానాలు మిమ్ములను కరిగించలేదా? అవి బలిదానాలు కావా? మీవేనా బలిదానాల లెక్కలు? మీరేనా అమరులు?

  • J T Bandagi says:

   జగన్ ఫాన్ గారూ
   మీ వెటకారపు స్పందనను మీరే మరో సారి చదువుకుని చూడండి .
   ఆ అభిమానవతి ఏమిటో
   రాజన్న రాజ్యం ఏమిటో దానిని జగనన్నతేవడం ఏమిటో
   అందుకు ఎన్నో ఎన్నెన్నో గుండెలు పగలడం ఏమిటో
   వాళ్ళుకాదా అమరులు …. మీరేనా అమరులు అని దబాయించడం ఏమిటో
   మనం ఎ కాలంలో ఉన్నామో అంటా అయోమయంగా వుంది

 6. K.Ramesh says:

  Mr.Badangi,
  Give one sensible reason, why should Samaikhyandhra people support you? Why should they support resolution? Just because some uneducated and under educated idiots committed suicide?

  • J T Bandagi says:

   కె రమేష్
   ఇంత అహంకారం మంచిది కాదు.
   తెలంగాణలో చచ్చిపోయిన వాళ్ళు చదువురాని మూర్ఖులా .
   ఇంత అమానుషంగా మాట్లాడే మీరు గొప్ప సంస్కార వాంతులూ, విద్యావంతులా ?
   మీరు సపోర్ట్ చేస్తారో జిడ్డులా పట్టుకుని వేళ్ళాడుతారో మీ ఇష్టం.
   మీ పీడను ఎలా వదిలించుకోవాలో తెలంగాణా ప్రజలకు తెలుసు.

   • K.Ramesh says:

    It is okay if you have no sensible answer than usual rhetoric and emotional blaha blahs. You cleverly tried to divert as expected. May be you are not clear for yourself.

   • J T Bandagi says:

    రమేష్
    అసలు మీ ప్రశ్నేంటి?
    సమైక్యాంధ్ర ప్రజలు (!) మాకు ఎందుకు సపోర్ట్ చేయాలి, తీర్మానానికి ఎందుకు సపోర్ట్ చేయాలి?
    ఇదేనా మీ ప్రశ్న …
    దీనికి మాదగ్గర సమాధానమే లేదా ?
    అరె బాబూ
    చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి తెలంగాణా నీళ్ళను, నిధులను, ఉద్యోగాలను, వనరులను, భూములను దోచుకున్తున్నదే మీరు …
    మీరు మాకు సపోర్ట్ చేస్తారని…. తీర్మానం చేస్తారని ఎవరు ఆశిస్తున్నారు.
    పోరాటం , కంపల్స్హన్ ద్వారా తప్ప ఈ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి ,
    ఈ దోపిడీ పీడలనుంచి బయటపడమని మాకు తెలుసు.
    మీలో సెన్స్ , మానవత్వం ఉన్నవాళ్ళు సపోర్ట్ చేస్తారు,
    లేనివాళ్ళు చేయరు. అంతే
    ఇదో లా జవాబ్ ప్రశ్నా …?!

   • K.Ramesh says:

    Why did you say that they didn’t keep up their PROMISE? Did they promise that they would support your claims that they robbed your great jobs, water, land? Did they promise you that they will provide you a dagger to stab them? and like an idiot you trusted those politicians? If ‘yes’ you will not get wishes fufilled, even after 100years of such stupid struggle.

 7. K.Ramesh says:

  You agreed that it is your stupidity to ask all parties to vote in favour of resolution to seperate, right?
  Coming to your so called sacrifices, are you not using at least 10fold jacked up figures of the suicides? Is this correct to use the dead people (if it is true, how far it is true, we all know) for propaganda?
  Why don’t you follow them who gave up their great life, as you are glorifying that act?

  • Bandagi says:

   అరవై ఏండ్ల ప్రజాస్వామ్యం , పార్లమెంటరీ వ్యవస్థ, భారత రాజ్యాంగం , చదువులు ఎంత గొప్ప ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రసాదించాయో మీకు.

 8. K.Ramesh says:

  Stop this culture of using dead for your false propaganda

 9. K.Ramesh says:

  Better take challenge of a Tg women, K.Surekha and sacrifice for Telangana.
  See you in heaven,
  Ramesh

 10. @K. Ramesh

  We are not asking Seemandhra people to support Telangana demand (though most of the common public from Seemandhra actually support the demand).

  We are only asking Seemandhra political leaders to stick to their promises they gave before elections, follow their election manifestos, stick to their party’s common minimum program. Why we ask is because in demacracy it is the right of the people to demand political parties to abide to their promised policies. Irrespective of whether a party comes into power or not party has to stick to their election manifesto. Hope you understand.

  If for some reason they cannot stick to their own manifesto, we are asking them to now let the people know what is their current stand on the issue so that people can decide their fate in next election. What we don’t agree is to talk differently in different places at that same time and deceive people with two eyed theory.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s