“నేనెరుగ నేనెరుగ కేంద్రాన్ని అడుగు”- రాష్ట్రం ! “నేనెరుగ నేనెరుగ రాష్ట్రాన్ని అడుగు” – కేంద్రం !!

“నేనెరుగ నేనెరుగ కేంద్రాన్ని అడుగు”- రాష్ట్రం ! “నేనెరుగ నేనెరుగ రాష్ట్రాన్ని అడుగు” – కేంద్రం !!

గాంధీ, నెహ్రూ, సుభాస్‌ చంద్రబోస్‌, అంబేడ్కర్‌ అసొంటి నాయకులు పుట్టిన భారతదేశం గతి ఆఖరికి ఎట్లయిపోయింది!
ఎన్నికలప్పుడు నోరువిప్పుడు, ఎన్నికలకోసం ఏషాలు ఏసుడు తప్ప దేశానికి ఒక దిశా నిర్దేశం చేసెటోడు, ఒక
స్ఫూర్తినిచ్చెటోడు, ఒక మాటమీద నిలబడెటోడు ఒక్కడు కూడా లేకుండ పోయిండ్లు.
అంత నాశనగాలానికే వచ్చినట్టున్నది.
”గాంధి పుట్టిన దేశమా ఇది… నెహ్రు కోరిన సంఘమా ఇది…” అని జుట్టు పీక్కుంట కూసునుడు తప్ప ఏం జేయాల్నో సమజైతలేదు.

తెలంగాణ సమస్య వచ్చి ఇప్పటివరకు సొక్కం పూసల్లా కనిపించిన నాయకుల నాలిముచ్చుతనమంతా
బట్టబయలైంది. వాళ్ల ముసుగుల్ని ఎక్కడికక్కడ చింపి పారేసింది.
ఏం అబద్ధాలు… ఏం దొంగ మాటలు… ఏం లత్తకోరు ఏషాలు… ఏం రెండు నాల్కల డైలాగులు… తలచుకుంటెనె
ఒంటికి కారం రాసుకున్నట్టు అయితది.
గింత అన్నాలమా, గింత ఛండాలమా ?
గిదేం ప్రజాస్వామ్యం, గిదేం సావుతంత్రం, గిదేం మానవత్వం ?
థూ థూ థూ థూ థూ ….

తెలంగాణ సమస్యకు పరిష్కారం రాష్ట్రంల లేదు కేంద్రంల వున్నది అంటది రాష్ట్రం!
కాదు కాదు మాచేతుల్ల ఏమున్నది మీలో ఏకాభిప్రాయం వస్తనే మేం ఏదైన చేయగలుగుతం అంటది కేంద్రం.
పార్టీలన్నీ ప్రాంతాలుగ రెండుగ చీలిపోయినయట.
పులులు ఒప్పుకుంటెనే మేకలకు విముక్తి కల్పిస్తరట.
తాగుబోతు, తిరుగుబోతు మొగుడు దయతలిస్తెనే – వాని చేతిల రోజూ తన్నులు తింటున్న పెండ్లానికి
ఇడుపుగాయితం ఇస్తరట.
అసలు ఏకాభిప్రాయం అంటె ఏంటిది.
ఆ బ్రహ్మపదార్థం గురించి ఒక్కడు వివరిస్తలేడు.

ఎఫ్‌డిఐలకు లేని ఏకాభిప్రాయం తెలంగాణాకు ఎందుకో, అది ఎట్ల సాధ్యమో ఎవ్వడు చెప్పడు.

సమైక్యంగ ఉండెటానికి ఎకాభిప్రాయం అవసరం లేదుగని విడిపోవడానికి కావాల్నా?
గిదేం బద్మాష్‌గిరి?

ఎఫ్‌డిఐల మీద చర్చించినట్టు పార్లమెంటుల బిల్లు పెట్టి తెలంగాణ మీద చర్చించరట.
అసెంబ్లీల కూడ తెలంగాణా మీద చర్చించి తీర్మానం చెయ్యరట. ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి
సమావేశంల కూడ చర్చించరట.
పుణ్యానికొచ్చిన టీవీ ఛానెళ్లల్ల, గల్లీలల్ల తప్ప – ఏ ప్రజాస్వామిక వేదిక మీదా చర్చించరట.

ఇగ ఈ సమస్య ఎట్ల పరిష్కారం కావాలె.
1956 తర్వాత కొత్తగ పద్నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డయి. ఎక్కడ గిసొంటి సమస్య రాలేదు.
ఎన్నాళ్లీ భాగోతం.
దమాఖ్‌ ఖరాబ్‌ అయితాంది.

telangana

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

3 Responses to “నేనెరుగ నేనెరుగ కేంద్రాన్ని అడుగు”- రాష్ట్రం ! “నేనెరుగ నేనెరుగ రాష్ట్రాన్ని అడుగు” – కేంద్రం !!

 1. దేశం, ముఖ్యంగా తెలుగు తల్లి ముక్కలుకాకుండా ఈ రాజకీయ సన్నాసులకు మంచి బుద్ధి ప్రసాదించమని తెలుగు ప్రపంచ మహాసభ సాక్షిగా సవినయంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ……

  • J T Bandagi says:

   @ Swandana Swandana
   తెలుగు తల్లి ముక్కలు కావడం ఏమిటండీ ?
   ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిందే రెండు ముక్కలను (ఆంద్ర – తెలంగాణాలను ) సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, బలవంతంగా, దురాశతో అతికించి ఏర్పాటు చేశారన్న విషయం మరచి పొతే ఎలా?
   భాషా ప్రయుక్త రాష్ట్రం అంటూ ఫస్ట్ ఎస్ ఆర్ సి (ఫజల్ అలీ కమిషన్) సిఫారసులకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ఈ రాష్ట్రం లో అరవై ఏళ్ళు కావస్తున్నా తెలుగు ను అధికార భాషగా అమలు పరచని వాళ్లకి హటాత్తుగా ప్రపంచ తెలుగు మహాసభలు గుర్తుకురావడం వెనక దురుద్దేశం మీకు కనిపించడం లేదా ?
   ఎన్నాళ్ళీ నయవంచన.
   తెలుగు వాళ్లకి రెండు రాష్ట్రాలు వుంటే తప్పేంటి ? తెలంగాణ కు తన రాష్ట్రాన్ని పునరుధ్ధరించమనే హక్కు లేదా ?
   ఎందుకు ఈ పాపం లోకి దేవుణ్ణి లాగుతారు ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s