“నమో ఆంద్ర మాత” పాట పోయి “మాతెలుగు తల్లి” పాట ఎప్పుడు వచ్చింది?

“నమో ఆంద్ర మాత” పాట పోయి “మాతెలుగు తల్లి” పాట  ఎప్పుడు వచ్చింది?

చాలా కాలం క్రిందట “నమో ఆంద్ర మాతా … మాతా నమో దివ్య తేజా ..” అనే పాట మారు మ్రోగుతుండేది. చాలా నాటక సమాజాల వారు తమ నాటకం మొదలు పెట్టేముందు ఆ పాట ను ఆలపించేవారు.  దానిని ఎవరు రాసారో తెలియదు.
శంకరం బాడి సుందరాచారి తెలుగు తల్లి పాత వచ్చిన తర్వాత “నమో ఆంద్ర మాతా …”
పాట ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు.
ఎవరి దగ్గరైనా దాని స్క్రిప్ట్ ఉంటె దయచేసి తెలియజేయగలరు.
అలాగే తమిళ తల్లి, మరాటీ తల్లి, హిందీ తల్లి మొదలైన కాన్సెప్ట్ ల మీదా ఏమైనా పాటలున్నాయా ? తెలపండి ప్లీజ్

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

4 Responses to “నమో ఆంద్ర మాత” పాట పోయి “మాతెలుగు తల్లి” పాట ఎప్పుడు వచ్చింది?

 1. నాటకాలప్రాభవం తగ్గిపోయాక 1950తర్వాత, నమో ఆంధ్ర మాతా’ పాట వినిపించడం తగ్గిపోయింది.సంకరంబాడి రచన ‘మా తెలుగుతల్లికి ‘,టంగుటూరి సూర్యకుమారి పాడిన గ్రామొఫోన్ రికార్డు తో మంచి ప్రచారం లభించింది.తరవాత తెలుగుమహాసభలో ఆధికారికంగా తెలుగువారి జాతీయగీతంగా గుర్తింపబడింది.ఐనా ‘ తెలుగు ‘, ‘ఆంధ్ర ‘ ,’తెలంగాణా ‘ అన్నీ ఒక అర్థాన్నే సూచిస్తాయని మనం తెలుసుకోవాలి.
  2.నాకు తెలిసి కన్నడ,మళయాళ ,బెంగాలి ప్రజలకు వారి జాతీయ గీతాలు ఉన్నవి .మిగతా భాషలవారికి కూడా ఉంటాయనుకొంటాను కాని నాకు తెలియదు.

  • J T Bandagi says:

   @ యం వి రమణారావు గారూ
   ధన్యవాదాలు
   రాష్ట్రాలకు, దేశాలకు జాతీయ గీతాలు వుండడం సహజమే.
   ఆంద్ర మాత లోని “ఆంద్ర ” శబ్దం భారత మాత లో మాదిరిగా ఒక ప్రాంతాన్ని/ప్రదేశాన్ని సూచిస్తుంది, ఆంధ్రము అంటే తెలుగు అనే అర్ధం ఉన్నాసరే..!
   అలాగే తెలంగాణా అంటే తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతం అనే తప్ప తెలుగు భాష అని కాదు కదా.
   మాత్రు భాష అంటే తల్లి మాట్లాడే భాషే తప్ప భాషే తల్లి అనే భావన కాదు.
   భాషను తల్లిగా చేసి ఒక రూపం కల్పింఛి (తెలుగు తల్లి అని ) విగ్రహాన్ని ప్రతిష్టించి ఆరాధించడం దేశంలో మరెక్కడా ఏ భాషలోనూ లేదనే వాదన వుంది.
   అందులోని నిజా నిజాలు తెలుసు కోవాలని అడిగాను.

   • కన్నడ భాషకు ఎ రకమయిన “జాతీయ గీతం” లేదు. ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ (జయ భారత జననియ తనుజాత) అనే పాట కర్నాటక రాష్ట్రానికి అధికార గీతం. మహాకవి కువెంపు ಕರ್ನಾಟಕ ಮಾತೆ (కర్నాటక మాత) ఈ పాటను గురించి రాసారు. ఎక్కడా కన్నడ భాష ప్రస్తావన కనిపించదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే కర్ణాటకను భరతమాత కుమార్తెగా పోల్చడం.

    నిజానికి భాషలను తల్లిగా భావించే కుసంప్రదాయం తెలుగులో తప్ప ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడయినా ఒక భూభాగాన్ని పూజించిన దాఖలాలు ఉన్నాయి కానీ భాషను కాదు.

    సుందరంబాడి గారు ఒక సినిమా కోసం రాసిన పాటను తెలుగు దురభిమానులు ఆకాశానికి ఎత్తుకున్నారు తప్ప ఈ పాటకు వేరే ప్రత్యేకత లేదు.

    మలయాళం, బాంగ్లా, తమిళం లాంటి భాషలకు “జాతీయ గీతాలు” ఉన్నాయనేది నిజం కాదు. రమణారావు గారు ఆధారాలు ఇస్తే చదివి తరించగలను.

    ఇక ఆంద్ర తెలంగాణా పదాలు రెండూ ఒకటే అర్థాన్నే సూచిస్తాయనే పుక్కిటి పురాణానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇటీవలి కాలంలో కొందరు చేస్తున్న గొబ్బెల్స్ ప్రచారంలో భాగమే ఈ పిడి వాదన.

   • Bandagi says:

    @ Jai Gottimukkala
    ధన్యవాదాలు.
    చాలా విలువైన సమాచారం అందించారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s