ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణోళ్లు ఎందుకు బహిష్కరిస్త మంటున్నరు ?

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణోళ్లు ఎందుకు బహిష్కరిస్త మంటున్నరు ?

….. ఎందుకంటె …

….. భాష పేరుతోని జరిగిన ధోకాభాజీని తల్చుకుంటనే తెలంగాణోళ్ల కడుపులు కుతకుత ఉడుకుతున్నయి కాబట్టి! ”మీది తెనాలె – మాది తెనాలె” అనుకుంట ఒక తెనాలి కుటుంబానికి కాశీల పంగనామాలు పెట్టిన ‘సీన్‌’ ఏదో సినిమాల వున్నది చూడుండ్రి… సరిగ్గ గట్లనే ”మీది తెలుగే – మాది తెలుగే” అనుకుంట మీ ఆంద్ర రాజకీయ నాయకులు, పెట్టుబడిదార్లు, కాంట్రాక్టర్లు   మా తెలంగాణాను నిండ ముంచిండ్లు!! గది యాజ్జేసుకుంటెనే మా గుండెలు భగ్గుమంటున్నయి!!!

….. అరె….

….. కాకతీయుల శాసనాలను చూడుండ్రిి. బమ్మెర పోతన పద్యాలను చదువుండ్రి. పాలకుర్తి సోమన్న, మల్లినాథసూరి రచనలు తిరగేయుండ్రి… ఒకప్పుడు తెలంగాణాల ఎసొంటి తెలుగుండె!! అసలు తెలుగు భాష పుట్టిందే తెలంగాణల కదా!!

….. మా తక్దీర్‌ బాగలేక ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాను చేతుల ఓడిపోబట్టి మా భాష దెబ్బతిన్నది. ఒకటి కాదు రెండు కాదు మూడువందలేండ్లు పరాయి భాష పెత్తనం కింద సత్తెనాశనమయింది.

….. రాజు తలచుకుంటె దెబ్బలకు కొదువనా? తెలుగు మాట్లాడే ప్రాంతంల వాండ్లు తమ ఉర్దూను  చిటికెల మీద అధికార భాషగ చేసిండ్లు!! జనం ఏం జేస్తరు? తెలుగును పక్కన బెట్టి గతిలేక ఉర్దూని నేర్చుకున్నరు. అయినా తెలంగాణోళ్లు తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, బతుకమ్మ, బోనాల పండుగలను గుండెల్ల పెట్టుకుని కాపాడుకుంట వచ్చిండ్లు.

….. నైజాం రాజ్యం మటాష్‌ అయినంక హైదరాబాద్‌ రాష్ట్రం ఆరేడేండ్లన్న స్వతంత్రంగ వున్నదో లేదో మీ నాయకుల కండ్లు కుట్టి ”మీది తెలుగే – మాది తెలుగే”… ”మా తెలుగు తల్లికీ మల్లెపూదండ” అని మాయ మాటలు చెప్పుకుంట… ఫజల్‌ అలీ కమిషన్‌ నాలుగేండ్లు ఆగుండ్రి అన్నా ఇనకుంట… ఆగమాగం చేసి, ఢిల్లీల లాబీయింగ్‌ చేసి తెలంగాణాను కబ్జా చేస్తిరి.

….. పోనీ మీరు అన్న మాట మీద నిలబడ్డరా… పెద్దన్న లెక్క  మంచితనం చూపించిండ్లా?! హర్‌కీజ్‌ లేదు!! వచ్చిన తెల్లారి నుంచే ఇచ్చిన మాట తప్పితిరి, చేసిన బాసలు మర్సితిరి. చేసుకున్న ఒప్పందాలను చెత్త బుట్టల వేస్తిరి. మీదికెల్లి ”తెలంగాణోళ్లది ఏం తెలుగు… యాక్‌ థూ…” అనుకుంట ఎక్కిరించుడొకటి.

….. తెలంగాణోళ్ల బాషను, యాసను, సంస్కృతిని ఒక బనాయించుడా…!! మీ సినిమాలల్ల తెలంగాణోళ్ల భాషను పర్మనెంటుగ రౌడీలకు, చప్రాసీలకు, లంపెన్లకు ఉపయోగించి బేయిజ్జత్‌ చేస్తిరి.

….. తెలంగాణాను కబ్జా చేసే దాక ”భాషా ప్రయుక్త రాష్ట్రం” అని బద్మాష్‌ మాటలు చెప్పి రాష్ట్రం ఏర్పడ్డంక ”తెలుగు తల్లి”ని తీస్కపోయి అట్కమీద పారేస్తిరి…! తెలుగు భాషను తీస్కపోయి తుంగల తొక్తిరి….!! అరవై ఏండ్లయినా ఇంకా అధికార భాషగ గా పరాయి ఇంగ్లీషునే కొనసాగిస్తుండబట్తిరి!! తెలుగోళ్ల రాష్ట్రంల ఇంగ్లీషులో పరిపాలన….!! గిదేనా భాషా ప్రయుక్త రాష్ట్ర మంటే !?వారెవా మీ తెలివి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలను చూసి సిగ్గన్న రాకపాయె…!!

….. ఇప్పుడేమో ఏం జర్గనట్టు, ఏం ఎర్గనట్టు మల్ల “తెలుగు పాట” పాడ్తనంటె ఎవడు నమ్ముతడు…?? అందుకనే తెలంగాణోళ్లు ”మా తెలుగు మాది… మీ తెలుగు మీది… మా తెలంగాణ తల్లి వేరు … మీ తెలుగు తల్లి వేరు” అంటున్నరు.

….. మీకు మీ సోపతికి, మీ సహోదరభావానికి ఖుదా హఫీజ్‌ అంటున్నరు.

….. ప్రపంచ తెలుగు మహా సభలకు పోం పోం అంటున్నరు.

….. ఆంధ్ర రాష్ట్రానికి “రాం రాం” అంటున్నరు.

….. జై తెలంగాణ … జై జై తెలంగాణ అంటున్నరు.

….. తప్పా????????

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

9 Responses to ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణోళ్లు ఎందుకు బహిష్కరిస్త మంటున్నరు ?

 1. తెలుగుతల్లి, తెలంగాణాతల్లి అంటూ మీరు ప్రచురించిన బొమ్మలు బాగున్నాయి.
  గమనించారా? వాటి ప్రక్కన ఇంకా చాలా చోటు మిగిలే ఉంది.

  జిల్లాలవారీగా తల్లుల్ని రూపకల్పన చేసి ప్రచురించితే బాగుండేదేమో ఆలోచించండి. అలాగే, వాటితో బాటుగానే ముఖ్యమైన పట్టణాలపేర్లతో హైదరాబాదు తల్లి, కరీంనగర్ తల్లి, వరంగల్ తల్లి వగైరా తల్లుల బొమ్మలూ ప్రచురించ వచ్చును.

  ఇలా వ్రాస్తున్నందుకు మీకు నా మాటలు అథిక్షేపణగా అనిపించవచ్చును.

  తెలుగుభాష మన అందరికీ సామాన్యమైన ఉనికికి గుర్తు కాబట్టి తెలుగుతల్లి అన్నది ఒక మాతృభావన సబబుగా ఉంటుంది అని నా ఉద్దేశ్యం. ప్రాంతాలవారీగా తల్లుల్ని మనమే సృష్టించుకోవటం అసహజం అని మీకు అనిపించకపోవటం నాకు వింతగానే ఉన్నది మరి.
  మీకలా అనిపించపోతే పోనీయండి. ఆవేశంలో ఉన్న మీకు నా మాటలు చేదుగా అనిపిస్తాయని గ్రహించగలను. కాని చెప్పాలనిపించి చెప్పాను. ఎవరినీ అథిక్షేపించాలని కాదని గ్రహించగలరు.

  • jtbandagi says:

   తాడిగడప శ్యామలరావు గారు
   ఇలాంటి వెటకారాలు, అవహేళనలు మాకు బాగానే అలవాటయ్యాయి లెండి, అధిక్షేపించాలని కాదంటూనే అధిక్షేపించడం మీకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు తల్లి బొమ్మను చూపించే కదా తెలంగాణాను అణగ దొక్కి అన్యాయం చేసింది. విజయం సాధించారు కాబట్టి- అరవై ఏళ్లయినా తెలుగును అధికార భాషగా అమలు చేయకపోయినా మీకు తల్లి భావనే కలుగుతుంది. మాకు మాత్రం సవతి తల్లే. అసలు మీరు మా తెలుగును గౌరవించింది ఎప్పడు.? మీకు మా నీళ్ళు, మా భూములు, మా ఉద్యోగాల మీదే వల్లమాలిన ప్రేమ. మా మీద కనీస సహోదర భావం మీ కెక్కడిది??

   • @తాడిగడప శ్యామలరావు:

    ఆంద్ర ప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. ఇక్కడ అన్ని భాషలు వారూ ఉండొచ్చు. తెలుగు వారికేమీ ఈ రాష్ట్రం పై గుత్త పెద్దరికం లేదు. అదే రకంగా కర్నాటక, తమిళనాడు, ఒడీశా తదితర రాష్ట్రాలలో నివసించే తెలుగు వారికి ఆంద్ర ప్రదేశ్ పై ఎ రకమయిన హక్కులు లేవు.

    ఉరుదూ, హిందీ, మరాథీ, కన్నడ, తమిళం, లంబాడా, గోండీ, కోయ, చెంచు ఇత్యాది భాషలు మాట్లాడేవారు రెండో తరగతి పౌరులగా ఉండాల్సిన అగత్యం లేదు. తెలుగు భాషా దురభిమానాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం మానాలి.

 2. “మా తక్దీర్‌ బాగలేక ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాను చేతుల ఓడిపోబట్టి మా భాష దెబ్బతిన్నది. ఒకటి కాదు రెండు కాదు మూడువందలేండ్లు పరాయి భాష పెత్తనం కింద సత్తెనాశనమయింది.” – మీ ’భాష’ నాశనమైందని మీరెందుకు అనుకుంటున్నారు? దానికుండే లయ, సొగసు దానికుంది. అది బాగాలేదని మీరే అనుకోవడం ఆత్మన్యూనత!

  • jtbandagi says:

   మీరన్నది నిజమే.
   యాభై ఆరేళ్ళ ర్యాగింగ్ ప్రభావం అది.
   ఆత్మన్యూనత నుంచి బయట పడాలి
   షుక్రియా.

 3. తెలుగు తల్లి అంటే ఒక ప్రాంతాన్ని సూచిస్తోంది అనుకొనే అమాయకుడు ఈ బ్లాగరి. వీరికి కచరా ఒక భీష్మాచార్యుడుగానూ, అల్లం నారాయణ శ్రీకృష్ణుడు గానూ వాని నమస్తే తెలంగాణా భగవద్గీత. అర్థాలు పదాలు తెలియకుండా మీరు మా భాషని వెక్కిరిస్తున్నారనడం తెలబాన్లకి అలవాటు. ఇంక భాషకి యాసకి తేడా తెలియని వాళ్ళలో ముందువరసలో నిలబెత్తవచ్చు ఈ తెలబాన్లని.

  • J T Bandagi says:

   రాళ్ళబండి రవీంద్రనాథ్ భాయ్ సాబ్ .
   ఈ పోస్ట్ ల మీకు ఎక్కిరించాడానికే తప్ప చర్చించడాని గివి తప్ప ఒక్క పాయింట్ కూడ దొర్కలేదా? … “వాని ” నమస్తే తెలంగాణా నా?” , “తెలబాన్లా ” తెలంగాణా-
   తాలిబాన్ మాటలు లయ కల్వంగానే కొత్త పదం పుట్టించి మీ కుతి దీర వాడుడేనా? తెలబాన్లు అంటే ఏంటిదో జెర జెప్పు. మీ రక్తం ల నే ఉందా గీ బనాయిన్చుడు… గీ
   శాడిజం ! గాయం చేసేది మీరే అది మానకుండా ఇంకా గెలికేది మీరేనా…!! “తెలుగు తల్లి” తమిళ తల్లి నుంచి వేరు పడటానికి మీకు పనికొచ్చిందేమో గానీ ఆ తల్లి
   మమ్మల్ని మాత్రం దారుణంగా వంచించింది. అందుకే తెలుగు తల్లి ఆంద్ర కు ప్రతీకగా మారింది. నిజంగా మీకు తెలుగు తల్లి మీద ప్రేమే వుంటే … తెలంగాణా ఆంద్ర అంత ఒక్కటే అన్న భావనే గనక వుంటే ఇవాళ పరిస్థితి ఇంత దిగాజారేది కాదు. మన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం యావత్ దేశంల ఇంత నవ్వుల పాలయ్యేదే కాదు.

   • రవీంద్రనాథ్ గారూ, తెలుగు భాష ఒక ప్రాంతానికి పరిమితం కానప్పుడు, ప్రపంచ తెలుగు మహాసభలు ఒక రాష్ట్రం ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తున్నారు? మీకు భాషాభిమానం ముదిరిపోతే “తెలుగు తల్లి బిడ్డలు” అందరూ చందాలు వేసుకొని సభలు జరుపుకొండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s