తమ ఇజ్జత్‌ని తామే కచ్రా చేసుకుంటున్న తెలుగోళ్లు !

…..1982 దాన్క తెలుగోళ్లని ఉత్తర భారతదేశంలో ”మద్రాసీలు” అనే పిలిచెటోళ్లు. మద్రాసు ముఖ్యమంత్రులకు జైకొడుతూ తెలుగు ముఖ్యమంత్రులను ఛీకొట్టడం ఢిల్లీకి ఆనవాయితీగా వుండేడిది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తొడగొట్టి మీసం తిప్పినంకనే తెలుగోళ్లు వేరు మద్రాసీలు వేరన్న సోయి వచ్చింది అటోళ్లకి. అప్పటినుంచే తెలుగు ఆత్మగౌరవం జర నిలబడ్డది.

…..పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, మద్యపానాన్ని నిషేధించి, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి, ప్రజల వద్దకు పాలన తెచ్చి తెలంగాణాల సుత ఎన్‌టిరామారావు జేజేలు అందుకున్నడు. అసొంటి మహానుభావుడ్ని చిల్లర కారణం చూపించి గద్దెమీద నుంచి దించి ఆయన ఉప్పుతిన్నోళ్లే ఆయన ఉసురు తీసుకున్నరు.

…..ఇగ ఇప్పుడు తెలుగోళ్ల ఆత్మగౌరవం పరిస్థితి ఎట్లున్నది? మళ్లీ ఢిల్లీ పాదాల కింద నలిగిపోతున్నది. ఆత్మగౌరవం సోయే ఎవరికి లేకుండ పోయింది. ఆనాడు ”నువ్వెంత నీ అధికార మెంత… కేంద్రం అనేది మిధ్య… రాష్ట్రాలే వాస్తవం” అంటూ ఢిల్లీనే సవాలు చేసిండు రామన్న. కానీ ఈనాడు అధికార పక్షం అనిలేదు, ప్రతిపక్షం అని లేదు అందరూ తమ జుట్టును తామే తీస్కపోయి ఢిల్లీ చేతుల పెడ్తున్నరు.  ఢిల్లీయేమో తెలుగోళ్ల తమాష చూస్తున్నది. అందర్ని ఆటాడిస్తున్నది. మల్ల మనది బాంచెపు బతుకే అయిపోతున్నది.

…..ఎన్నికలప్పుడు , అఖిల పక్షమప్పుడు, అసెంబ్లీ సమావేశమప్పుడు అధికారపక్షం, ప్రతిపక్షం … “మీరు బిల్లు పెట్టుండ్రి మేం మద్దతిస్తం” అని బీరాలు పలికితెనే కదా కేంద్రం పుసుక్కున ”తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడ్తం, అసెంబ్లీల తీర్మానం ప్రవేశపెడ్తం” అని 2009 డిసెంబర్‌ 9న పార్లమెంటుల ప్రకటన చేసింది?!

…..ఆ తెల్లారే… ప్రకటన వచ్చి 24 గంటలన్న గడవక ముందే ”రాష్ట్రాన్ని విడదీయనీకి చిదంబరమెవడు, మొయిలీ ఎవడు… జై సమక్యాంధ్ర…” అని రాజినామాల నాటకం షురుచేసిరి. రోడ్లమీదకు వచ్చి గవర్నమెంటు ఆస్తుల్ని తగులబెడ్తిరి. దాంతో ఢిల్లీ ”ఇదెక్కడి కతరో” అనుకుంట చేసిన ప్రకటనను అదే డిసెంబర్‌ 23నాడు వెనక్కి తీసుకునె.

…..మల్ల ఇప్పుడేమంటున్నరు… ”తెలంగాణాకు మేం ఎప్పుడూ అడ్డుపడలేదు. అడ్డుపడబోము. తెలంగాణాకు మేం వ్యతిరేకం కాదు” అని ఒక పార్టీ. ”తెలంగాణా ప్రజల మనోభావాలను మేం గౌరవిస్తం. తెలంగాణా ఏర్పాటు చేసే అధికారం మా చేతిల లేదు. ఢిల్లీ చేతుల్లనే వుంది. ఢిల్లీ గన్క పార్లమెంటుల బిల్లు పెడ్తే మేం అనుకూలంగ ఓటేస్తం” అంట టక్కుటమారపు డైలాగులు గొడ్తున్నరు.

…..అదే నిజమైతె అసెంబ్లీల చర్చించి సమైక్యమో … విడిపోవడమో … ఇగో గిదీ మా తీర్మానం అని  ఢిల్లీకి పంపొచ్చు కదా. తెలుగోల్లంటే పైకొక్కటి లోపలోక్కటి మాట్లాడెటోళ్ళు    , వాళ్ళ మాటలకు గడ్డిపరక విలువ ఇవ్వొద్దు.  అంతా తుపాకి రాముళ్ళే… గివన్ని ఒళ్లెక్కల మాటలని ఢిల్లీకి బాగ ఎర్కయిపోయింది. ఇగ తెలుగోల్లని అదెందుకు గౌరవిస్తది?? ముందు ముందు ఇంకా ఆటాడిస్తది!  మనకంటే తక్కువ మంది ఎంపీలున్న తమిళనాడుకు, పశ్చిమ బెంగాల్‌కు, ఆఖరుకు కేరళకు ఢిల్లీ ఇస్తున్న గౌరవం మనకు ఇస్తలేదంటె ఎందుకుకిస్తది?

…..ఇప్పటికైన ప్రజలు అంతా ఒక్కటై మన ఆత్మాభిమానంలేని, రెండునాల్కల నాయకుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తె బాగుంటది.

………………………ఏమంటరు?

Advertisements
This entry was posted in Telangana. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s